మీ ఆండ్రాయిడ్ ఫోన్ హార్డ్‌వేర్‌ను టెస్ట్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్

ఓ స్మార్ట్‌ఫోన్ సక్రమంగా పనిచేయాలంటే ఫోన్‌లోని అన్ని విభాగాలు ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. ఏ విభాగం టైమ్‌కు పనిచేయకపోయినా ఆ ప్రభావం ఫోన్ పనితీరు పై ఖచ్చితంగాఉంటుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలంటే తరచూ ఓ చెకప్ ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకమైన యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలను చూసేద్దామా మరి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Z-Device Test

జెడ్ -డివైస్ టెస్ట్

ఈ యాప్ మీ ఫోన్ హార్డ్‌వేర్ పనితీరుకు సంబంధించి లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ఫోన్ లోని ప్రతి కాంపోనెంట్‌ను టెస్ట్ చేసుకునే వీలుంటుంది. యాప్ డౌన్‌లోడ్ లింక్

Phone Tester

ఫోన్ టెస్టర్


ఈ యాప్ మీ ఫోన్ హార్డ్‌వేర్ పనితీరుకు సంబంధించి సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఈ యాప్ ద్వారా ఫోన్‌లోని సెన్సార్ డిటేల్స్, సిగ్నల్ డిటేల్స్, జీపీఎస్ స్టేటస్ ఇంకా సిస్టం కాన్ఫిగరేషన్‌ను తెలుసుకునే వీలుటుంది. యాప్ డౌన్‌లోడ్ లింక్

Antutu Tester

Antutu టెస్టర్

ఈ యాప్ మీ ఫోన్ హార్డ్‌వేర్ పనితీరుకు సంబంధించి సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ముఖ్యంగా ఫోన్ టచ్ స్ర్కీన్, బ్యాటరీ పనితీరును ఈ యాప్ విశ్లేషిస్తుంది. యాప్ డౌన్‌లోడ్ లింక్

Sensor Box

సెన్సార్ బాక్స్

ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని అన్ని సెన్సార్లను క్షుణ్నంగా చెక్ చేస్తుంది. యాప్ డౌన్‌లోడ్ లింక్

Phone Doctor Plus

ఫోన్ డాక్టర్ ప్లస్


ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరుకు సంబంధించి 25 రకాల పరీక్షలను నిర్వహించగలదు. సెన్సార్స్, బ్యాటరీ, స్ర్కీన్, మైక్, ఫ్లాష్, కెమెరా మెమెరీ వంటి అన్ని అంశాలను క్షుణ్నంగా చెక్ చేస్తుంది. యాప్ డౌన్‌లోడ్ లింక్

Geekbench 4

గీక్‌బెంచ్ 4

ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ పనితీరుకు సంబంధించి అన్ని సీపీయూ టెస్ట్‌లను నిర్వహించగలదు. యాప్ డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Apps to Test Hardware on Android. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot