కొత్త iOS 11లో బెస్ట్ AR యాప్స్ ఇవే !
ఐపోన్లకు ఐఓఎస్ 11 అప్ డేట్
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ తన సరికొత్త IOS 11 అపరేటింగ్ సిస్టమ్ ను ఈ ఏడాది జూన్ లో జరిగిన డెవలపర్స్ సదస్సులో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ OS యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఐఫోన్, ఐప్యాడ్ సహా పలు ప్లాట్ ఫాంలో పలు రకాల కొత్త ఫీచర్స్ ను రెడీ చేసింది. ఈ యాప్స్ మన చుట్టూ ఉన్న ఫిజికల్ వరల్డ్ పైన ఉన్న వర్చువల్ ఆబ్జెక్స్ తోపాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

అంతేకాదు కంపెనీ మరింత ARKit కోసం ios11లో మరింత కంటెంట్ కోసం డెవలపర్లను ప్రారంభించింది. ARKit స్పెసిఫిక్ డివైస్సుల్లో కూడా పనిచేస్తుంది.
• ఐఫోన్ 7
• ఐఫోన్ 7 ప్లస్
• ఐఫోన్ 6s
• ఐఫోన్ 6s ప్లస్
• ఐఫోన్ SE
• 12.9అంగుళాల ఐప్యాడ్ ప్రో(2017)
• 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో(2016)
• 10.5 అంగుళాల ఐప్యాడ్ ప్రో
• ఐప్యాడ్ (2017)
పైన తెలిపిన వీటితో iOSపరికరంలో ఇన్స్ స్టాల్ చేయగల AR యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వరల్డ్ బ్రష్ ...
ఈ యాప్ తో యూజర్లు వారి చుట్టూ ఉన్న బ్రష్లతో పెయింట్ చేయవచ్చు. మీరు రూపొందించిన ఇమేజ్ సుమారుగా GPS స్థానంలో సేవ్ చేయబడుతుంది. అంతేకాదు..యూజర్లు తమకు ఇష్టం ఉన్న ఇమేజేస్ రిపోర్టింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్ ఐఫోన్ మరియు ఐప్యాడ్ రెండింటి కోసం డిజైన్ చేయబడింది.

మ్యాజిక్ ప్లాన్ ....
ఈ యాప్ తో పిక్చర్స్ తీయడం ద్వారా ప్రొఫెనల్ ఫోర్ల్ ప్లాన్స్ రూపొందించడానికి సహాయపడుతుంది. అదనంగా జాబ్ డిజైన్స్ ను కూడా రూపొందించవచ్చు. 3Dలో మీ ప్లేస్ కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. DIY ప్రాజెక్టులను ప్లాన్ చేయడంతో పాటు కొంత ఇంటి నిర్మాణాన్ని కూడా డిజైన్ చేయవచ్చు. మ్యాజిక్ ప్లాన్ వినియోగదారులు ఫ్లోన్ ప్లాన్ను షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు 3Dలో కూడా చూడవచ్చు.

IKEA PLAN...
ఈ యాప్ తో మీరు మీ స్పేస్ లో IKEA ప్రొడక్టులను ఉంచడానికి వీలుంటుంది. ఇది సోఫాలు మరియు కుర్చీల నుండి ఫుట్ స్టూల్స్, కాఫీ టేబుల్స్ వరకు అన్ని రకాల మోడల్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు మీ ఇంటిలో ఫర్నిచర్ పరిమాణాన్ని డిజైన్ చేయడానికి ఖచ్చితమైన ఇంప్రెషన్ను ఇస్తుంది. వాట్సప్ లేదా ఇన్ స్టాగ్రామ్ తోపాటు ఇతర సోషల్ నెట్ వర్కింగ్ యాప్స్ తో మీ స్థలాన్ని ఈ యాప్ షేర్ చేస్తుంది.

పూల్ ఆఫ్ కింగ్స్ ...
దీన్ని ఇన్ స్టాల్ చేసిన తర్వాత మీరు వరల్డ్ వైడ్ గా స్కిల్స్ ఉన్న 8 బాల్ పూల్ ప్లేయర్స్ కు వ్యతిరేకంగా జారీ చేయబడతారు. మీరు తెలుసుకోవల్సిన అన్ని ప్రత్యేకమైన హై-స్టాక్స్ టేబుల్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు నగదును సంపాదించడంతోపాటు రిచెస్ట్ బిలియర్డ్స్ ప్లేయర్ గా ఉంటుంది.

స్టార్ వార్...
మీరు స్టార్ వార్ అభిమాని అయితే...మీరు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. ఈ యాప్ మీకు న్యూస్ , సోషల్ అప్ డేట్స్ , స్పెషల్ ఈవెంట్స్ ను అందిస్తుంది. సినిమాలకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ వార్తలతో సహా పెద్ద పెద్ద యాడ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ పొందవచ్చు. మీరు 3D స్టార్ వార్స్ క్యారక్టర్స్ , షిప్స్, స్పెషల్ క్విజ్లను అన్ లాక్ చేయవచ్చు. స్టార్ వార్స్ IDకోసం సైన్ అప్ చేయండి. అంతేకాదు రోజు రోజుకు పెరుగుతున్న స్టార్ వార్స్ ఫ్యాన్స్ కమ్యూనిటీలో మీరు చేరండి.

AR డ్రాగెన్ ....
ఇది ఒక పెట్ నెమ్. ఈ యాప్ తో మీరు స్వంతగా డ్రాగెన్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ప్లే చేయవచ్చు. మీరు డ్రాగెన్ను ధరించడానికి 20 ప్రత్యేక టోపీలు, ఫ్యాన్సీ స్కిన్ డ్రెస్సులను సేకరించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








