ఇవి కూడా జీమెయిల్ లాంటివే.. చదివేద్దం పదండి!
గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో జీమెయిల్ సర్వీస్ ఒకటి. 2004లో లాంచ్ అయిన ఈ సర్వీసుకు ప్రపంచవ్యాప్తంగా 1.2బిలియన్ల యూజర్లు ఉన్నారు.
గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో జీమెయిల్ సర్వీస్ ఒకటి. 2004లో లాంచ్ అయిన ఈ సర్వీసుకు ప్రపంచవ్యాప్తంగా 1.2బిలియన్ల యూజర్లు ఉన్నారు. ఈ సర్వీసులో నిత్యం యాడ్ అవుతూ వస్తోన్న కొత్త ఫీచర్స్ యూజర్లకు కొత్త అనుభూతులను పంచుతున్నాయి. ఇదే సమయంలో జీమెయిల్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఇంటర్నెట్‌లో పెరిగిపోతున్నాయి. జీమెయిల్‌కు పోటీగా థీటైన ఫీచర్లతో ఇంటర్నెట్‌లో లభ్యమవుతోన్న ఇతర ఈమెయిల్ సర్వీసుల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ఐక్లౌడ్ మెయిల్ (iCloud Mail)
యాపిల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో ‘ఐక్లౌడ్ మెయిల్' (iCloud Mail) ఒకటి. మీరు యాపిల్ యూజర్ అయినట్లయితే ఈ సర్వీసును ఖచ్చితంగా మీ డివైస్‌లో యాడ్ చేసుకోండి. ఈ సర్వీసులోకి యాపిల్ ఐడీ ద్వారా సైనప్ అవ్వటం ద్వారా 5జీబి ఉచిత స్టోరేజ్ స్పేస్‌తో పాటు 20ఎంబి వరకు అప్‌లోడ్ లిమిట్ అందుబాటులో ఉంటుంది.

అవుట్‌లుక్ (Outlook)
మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న అత్యుత్తమ మెయిల్ సర్వీసుల్లో అవుట్‌లుక్ (Outlook) ఒకటి. ఈ సర్వీసును ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ పై యూజర్‌కు సంబంధించిన అన్ని ఈమెయిల్ అకౌంట్‌లను మేనేజ్ చేసుకునే వీలుంటుంది. అవుట్‌లుక్ మెయిల్ సర్వీసులో లోడ్ చేసిన స్కైప్ ఫీచర్ ద్వారా ఒకవైపు మెయిల్స్ చెక్ చేసుకుంటూనే మరోవైపు వీడియా కాల్స్ అలానే చాటింగ్ నిర్వహించుకునే వీలుంటుంది.

జోహో మెయిల్ (Zoho Mail)
ఈ-మెయిల్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభ్యమవుతోన్న జోహో మెయిల్ యాప్, సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో మరింత ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఈ యాప్‌లో నిక్షిప్తం చేసిన జోహో డాక్స్ ఫీచర్ ద్వారా టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్‌షీట్స్ ఇంకా ప్రెజంటేషన్‌లను షేర్ ఇంకా కొలాబరేట్ చేసుకునే వీలుంటుంది.

మెయిల్.కామ్ (Mail.com Owned)
మెయిల్.కామ్ సర్వీసును జర్మనీకి చెందిన ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీ యునైటెడ్ ఇంటర్నెట్ అందిస్తోంది. ఈ సర్వీస్ 200 వరకు డొమైన్‌లను ఆఫర్ చేస్తుంది. యూజర్లకు 2జీబి వరకు స్టోరేజ్‌తో పాటు 50ఎంబి వరకు అప్‌లోడ్ లిమిట్ అందుబాటులో ఉంటుంది.

యాండెక్స్ (Yandex)
ఈ-మెయిల్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో లభ్యమవుతోన్న మెయిల్ సర్వీసెస్‌లో Yandex ఒకటి. రష్యాకు చెందిన మల్టినేషనల్ కార్పొరేషన్ కంపెనీ Yandex N.V ఈ సర్వీసును ప్రొవైడ్ చేస్తుంది. యూసేజ్ విషయానికి వచ్చేసరికి యూజర్లకు 10జీబి వరకు స్టోరేజ్‌తో పాటు 30ఎంబి వరకు అప్‌లోడ్ లిమిట్ అందుబాటులో ఉంటుంది. ఈ మెయిల్ సర్వీసులో లోడ్ చేసిన యాంటీవైరస్ ప్రొటెక్షన్ స్పామ్ ఇంకా ఫ్రాడ్ మెయిల్స్ నుంచి యూజర్లు ప్రొటెక్ట్ చేస్తుంది.

జీఎమ్ఎక్స్ ఈమెయిల్ (GMX Email)
2 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ఈమెయిల్ సర్కిల్స్‌లో దూసుకుపోతోన్న జీఎమ్ఎక్స్ ఈమెయిల్ (GMX Email) తన యూజర్లకు అన్ లిమిటెడ్ ఈ-మెయిల్ స్టోరేజ్ ను ప్రొవైడ్ చేస్తోంది. దీంతో పాటు ఇంటిగిరేడెట్ క్యాలెండర్ సపోర్టుతో కూడిన ఉచిత మొబైల్ సర్వీసును కూడా జీఎమ్ఎక్స్ ఈమెయిల్ ఆఫర్ చేస్తుంది. ఈ సర్వీస్ యూజర్‌కు వచ్చే అన్ని మెయిల్ అటాచ్‌మెంట్స్‌ను స్కాన్ చేసి అన్‌వాంటెడ్ మెయిల్స్‌ను రిస్ట్రిక్ట్ చేస్తుంది.

ఏఓఎల్ మెయిల్ (AOL Mail)
1993లో లాంచ్ అయిన ఏఓఎల్ మెయిల్ సర్వీస్ తన యూజర్లకు అన్‌లిమిటెడ్ ఈ-మెయిల్ స్టోరేజ్‌తో పాటు 25ఎంబి వరకు ఫైల్ అప్‌లోడ్ లిమిట్‌ను ప్రొవైడ్ చేస్తోంది. ఈ యాప్‌లో ఏర్పాటు చేసిన వైరస్ ప్రొటెక్షన్, స్పామ్ ఫిల్టర్స్ అన్‌వాంటెడ్ మెయిల్స్‌ను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తుంది. ఇదే సమయంలో యాప్ లో నిక్షిప్తం చేసిన ఏఓఎల్ ఇన్‌స్టెంట్ మెసెంజర్ ద్వారా మెయిల్ లోని ఇతర కాంటాక్ట్ లతో చాటింగ్ నిర్వహించుకునే వీలుంటుంది.

యాహూ మెయిల్ (Yahoo Mail)
జీమెయిల్‌కు ప్రత్యామ్నాయంగా ఇంటర్నెట్‌లో లభ్యమవుతోన్న అత్యుత్తమ ఈ-మెయిల్ సర్వీసుల్లో యాహూ మెయిల్ ఒకటి. హై-క్వాలిటీ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో కస్టమైజ్ కాబడిన ఈ మెయిలింగ్ సర్వీస్ పర్సనలైజిడ్ ఇంటర్‌ఫేస్ థీమ్‌లతో పాటు ఫ్లికర్, డ్రాప్ బాక్స్, జిఫ్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ వ్యూస్ వంటి ప్రత్యేకమైన సదుపాయాలను ఈ యాప్ కల్పిస్తోంది.

టుటానోటా (Tutanota)
ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సపోర్టుతో వస్తోన్న ఈ అత్యుత్తమ మెయిలింగ్ ఫీచర్ పూర్తిస్థాయి సెక్యూరిటీని మీ మెయిల్స్‌కు ప్రొవైడ్ చేయగలుగుతుంది.


Click it and Unblock the Notifications








