మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ Document Scanning యాప్స్

By: BOMMU SIVANJANEYULU

మీ పర్సనల్ వర్క్‌కు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను అర్జెంటుగా స్కాన్ చేసి వేరొకరికి పంపాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో మీ వద్ద స్కానర్ అందుబాటలో లేదు. ఇంటర్నెట్ సెంటర్ కూడా చాలా దూరంలో ఉండటంతో ఆ పనిని పూర్తిచేయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందా..? అయితే ఇక పై మీరు అలాంటి టెన్షన్స్ ఏమి పెట్టుకోకండి.

మీ స్మార్ట్‌ఫోన్ కోసం బెస్ట్ Document Scanning యాప్స్

మొత్తం వ్యవహారాన్ని మీ చేతిలోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు అప్పజెప్పేయండి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం వందల కొద్ది డాక్యుమెంట్ స్కానింగ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్‌నే పోర్టబుల్ స్కానర్‌లా ఉపయోగించుకుని డాక్యుమెంట్లను స్కాన్ చేసుకునే వీలుంటుంది. కంఫర్టబుల్ స్కానింగ్ ఫీచర్లతో ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న Best Scanner Apps మీకోసం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్యామ్‌స్కానర్ (CamScanner)

ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న బెస్ట్ స్కానింగ్ యాప్‌లలో CamScanner యాప్ ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఈ యాప్ చాలా కూల్‌గా ఉంటుంది. ఈ యాప్ ద్వారా డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోవటంతో పాటు వాటిని నచ్చిన ఫార్మాట్‌లలోకి కన్వర్ట్ చేసుకునే వీలుంటుంది.

డాక్యుఫై స్కానర్ (Docufy Scanner)

ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

ఈ స్మార్ట్ డాక్యుమెంట్ స్కానర్ అప్లికేషన్‌ ఆండ్రాయిడ్ యూజర్లకు స్కానింగ్ విభాగంలో అనేక సౌకర్యాలను ఆఫర్ చేస్తోంది. ఈ యాప్ ద్వారా డాక్యుమెంట్‌లను స్కాన్ చేయటంతో పాటు వాటిని మరింత మెరుగుపరుచుకునే వీలుంటుంది. స్కాన్ చేయబడిన ఫైల్స్‌ను ఫాక్స్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

ఇతర ఫైల్ ఫార్మాట్‌‌లలోని డాక్యుమెంట్‌లను PDF file ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. jpeg ఫోటోలను PDF ఫైల్స్‌గా మార్చి వాటికి వ్యాఖ్యానాలను యాడ్ చేసుకోవచ్చు.

జీనియస్ స్కాన్ - పీడీఎఫ్ స్కానర్ (Genius Scan – PDF Scanner)

ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న బెస్ట్ స్కానింగ్ యాప్‌లలో Genius Scan - PDF Scanner యాప్ ఒకటి. ఈ యాప్‌కు క్విక్ స్కాన్ ఫీచర్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా డాక్యుమెంట్‌లను వేగంగా స్కాన్ చేసుకోవటంతో పాటు వాటిని షేర్ చేసుకునే వీలుంటుంది. రిసిప్ట్స్, నోట్స్, వైట్‌బోర్డ్స్ తదితర డాక్యుమెంట్‌లను స్కాన్ చేసే క్రమంలో ఈ యాప్, మీ ఫోన్‌ను మల్టీపేజ్ స్కానర్‌లా మార్చేవేస్తుంది.

టర్బోస్కాన్ ఫ్రీ : పీడీఎఫ్ స్కానర్ (TurboScan Free: PDF scanner)

ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

ఈ ఫ్రీవేర్ యాప్ ద్వారా అన్ని రకాల డాక్యుమెంట్లను సులువుగా స్కాన్ చేసుకునే వీలుంటుంది. టర్బోస్కాన్ ద్వారా డాక్యుమెంట్‌లను చాలా వేగంగా స్కాన్ చేసుకోవటంతో పాటు వాటిని మల్టీపేజ్ PDF లేదా JPEG ఫైల్స్ రూపంలో మెయిల్ చేసుకునే వీలుంటుంది.

కెమెరా 2 పీడీఎఫ్ స్కానర్ క్రియేటర్ (Camera 2 PDF Scanner Creator)

ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

ఈ కూల్ స్కానర్ యాప్, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కెమెరాను స్కానర్‌లా మార్చేసి డాక్యుమెంట్‌లను మరింత సునాయాశంగా స్కాన్ చేసేస్తుంది. ఈ PDF క్రియేటర్ యాప్ అన్‌లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

సింప్లీస్కాన్ : పీడీఎఫ్ కెమెరా స్కానర్ (SimplyScan: PDF Camera Scanner)

ప్లే స్టోర్ డౌన్‌లోడ్ లింక్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం అభివృద్ది చేసిన లేటెస్ట్ డాక్యుమెంట్ స్కానింగ్ యాప్‌లలో సింప్లీస్కాన్, పీడీఎఫ్ కెమెరా స్కానర్ యాప్ కూడా ఒకటి. ఈ యాప్, మీ డాక్యుమెంట్లను స్కాన్ చేయటంతో పాటు వాటిని సులువైన పద్థతిలో ఆర్గనైజ్ చేసిపెడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best Scanner Apps To Scan Document With Android Smartphones. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting