Home
Apps

గూగుల్ మ్యాప్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు...

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకుగా రీచ్ కాగలుగుతున్నాం.

By Bommu Sivanjaneyulu

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకుగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్‌డేట్ చేస్తూ వస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గూగుల్ మ్యాప్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

 గూగుల్ మ్యాప్స్‌లో మీ పార్కింగ్ లొకేషన్‌ను సేవ్ చేసుకోవచ్చు..

గూగుల్ మ్యాప్స్‌లో మీ పార్కింగ్ లొకేషన్‌ను సేవ్ చేసుకోవచ్చు..

గూగుల్ మ్యాప్స్‌లో పార్కింగ్ లొకేషన్‌ ట్రాకింగ్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను గూగుల్ ఇటీవల యాడ్ చేసింది. ఈ ఫీచర్‌ మీ స్మార్ట్‌ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే మీ డివైస్ Android Marshmallow ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవ్వాల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా మీ డివైస్‌లోని గూగుల్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.

యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత...

యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత...

యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత ఫోన్ లొకేషన్ సర్వీసెస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇదే సమయంలో గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్‌ను వాయిస్ కమాండ్స్‌తో కాన్ఫిగర్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అన్ని పర్మిషన్స్‌ను మీరు గ్రాంట్ చేయవల్సి ఉంటుంది. ముందుగా Ok Google' కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ అసిస్టెంట్‌ ఓపెన్ అయిన తరువాత 'Remember where I parked' అనే కమాండ్‌ను మీరు అప్లై చేసిన వెంటనే గూగుల్ అసిస్టెంట్ జీపీఎస్‌తో కోఆర్డినేట్ అయి స్పెషల్ పార్కింగ్ పిన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత పార్కింగ్ లోకేషన్‌ను రిట్రీవ్ చేసుకుని నేవిగేషన్ ప్రారంభిస్తుంది.

మల్టిపుల్ లొకేషన్స్‌కు సంబంధించి డైరెక్షన్ తెలుసుకోవచ్చు..

మల్టిపుల్ లొకేషన్స్‌కు సంబంధించి డైరెక్షన్ తెలుసుకోవచ్చు..

గూగుల్ మ్యాప్స్‌ అప్లికేషన్‌లో మల్టిపుల్ లొకేషన్స్ కు సంబంధించిన డైరెక్షన్స్‌ను తెలుసుకునే వీలుంటుంది. ఉదాహరణకు మీరు ఆఫీసుకు వెళ్తూ దారిలో మీ పిల్లలను స్కూల్ వద్ద డ్రాప్ చేయాలనుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో మీ జర్నీకి సంబంధించి మల్టిపుల్ స్టాప్స్ ను యాడ్ చేసుకున్నట్లయితే మీరు చేరుకోవల్సిన గమ్యస్థానాలకు సంబంధించి డైరెక్షన్స్ వేరువేరుగా చూపించబడతాయి.

ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లయితే ..

ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లయితే ..

ఈ ఫీచర్‌ను మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లయితే ముందుగా A పాయింట్ నుంచి B పాయింట్ వరకు డైరెక్షన్‌ను సెటప్ చేసుకోవాలి. ఆ తరువాత గూగుల్ మ్యాప్స్ పేజీలో టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు హారిజెంటల్ డాట్స్ పై క్లిక్ చేసి Add stop ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ జర్నీకి సంబంధించి కావల్సిన స్టాప్‌లను యాడ్ చేసుకునే వీలుంటుంది.

 మీ సొంత గూగుల్ మ్యాప్‌ను తయారు చేసుకోవచ్చు..

మీ సొంత గూగుల్ మ్యాప్‌ను తయారు చేసుకోవచ్చు..

గూగుల్ మ్యాప్స్‌లోని మైమ్యాప్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీ ట్రిప్‌కు సంబంధించిన ప్లాన్ వివరాలను కస్టమ్ మ్యాప్స్ రూపంలో క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు.

డ్రైవింగ్ చేస్తున్న సమయంలో..

డ్రైవింగ్ చేస్తున్న సమయంలో..

డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వాయిస్ కమాండ్‌లను ఉపయోగించుకోవటం ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు యూజర్‌కు లభిస్తాయి. యాప్‌లోని మైక్రోఫోన్ ఫోన్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా వాయిస్ కమాండ్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

నచ్చిన ప్రదేశాలను లేబుల్ చేసుకోవచ్చు..

నచ్చిన ప్రదేశాలను లేబుల్ చేసుకోవచ్చు..

గూగుల్ మ్యాప్స్‌లో మీకు నచ్చిన ప్రదేశాలను సలువుగా లేబుల్ చేసుకోవచ్చు. మీరు రీసెంట్‌గా విజిట్ చేసిన రెస్టారెంట్, షాప్ లేదా ఫ్రెండ్ అడ్రస్‌ను లేబుల్ చేసుకోవటం ద్వారా మళ్లీమళ్లీ ఆ అడ్రస్‌ను టైప్ చేయవల్సిన అవసరం ఉండదు. గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా అడ్రస్‌ను లేబుల్ చేయాలనుకున్నట్లయితే ముందుగా ఆ అడ్రస్ పై లాంగ్ ప్రెస్ ఇచ్చి మ్యాప్స్‌కు పిన్ చేయాలి. ఆ తరువాత స్ర్కీన్ బోటమ్ పై టాప్ ఇచ్చి సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే లేబుల్ యాడ్ అవుతుంది.

మీ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు..

మీ లొకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు..

గూగుల్ ఇటీవల లొకేషన్ షేరింగ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ లొకేషన్‌ను అవతలి వ్యక్తికి షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్రాసెస్ అంతా రియల్ టైమ్‌లో జరిగిపోతోంది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
For most commuters, Google Maps has been a god send as it has made navigation really simple. People who commute a lot always turn to Google Maps and the company keeps updating its features for its loyal users.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X