ఇంటర్నెట్ లేకపోయినా వెబ్ పేజీలను యాక్సెస్ చేసుకోవటం ఎలా..?

మన ఇండియాలో స్లో ఇంటర్నెట్ అనేది ఇప్పటికి పెద్ద సమస్యే. ఇంటర్నెట్ కనెక్టువిటీ నెమ్మదిగా ఉన్న సమయంలో వెబ్ పేజీలు లోడ్ అవటానికి చాలానే సమయం తీసుకుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఒక యాప్ మార్కెట్లో సిద్ధంగా ఉంది. ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినప్పటికి వెబ్ పేజీలను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. "Offline Browser" పేరుతో అందుబాటులో ఉన్న ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి "Offline Browser" అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

యాప్ లాంచ్ అయిన తరువాత వెబ్ సైట్ లింక్ ను యాడ్ చేసేందుకు Add Symbol పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

వెబ్ పేజీ లింక్ ను యాడ్ చేసిన తరువాత టైటిల్ ఇచ్చి "Download" బటన్ పై క్లిక్ చేయండి. మొత్తం వెబ్‌సైట్ డౌన్‌లోడ్ అవటానికి కాస్తంత సమయం తీసుకుంటుంది. లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.

స్టెప్ 4

డౌన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత వెబ్‌పేజ్ యాప్‌లో సేవ్ అయి ఉంటుంది. ఇక ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వెబ్ పేజీని యాక్సెస్ చేసుకునే వీలుంటుంది.

Google Chromeలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే..?

ఆఫ్‌లైన్ మోడ్‌లో వెబ్ పేజీలను యాక్సెస్ చేసుకునేందుకు గాను Google Chrome బ్రౌజర్ ప్రత్యేకమైన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ఈ ప్రొసీజర్‌ను అనుసరించండి..

స్టెప్ 1, స్టెప్ 2

స్టెప్ 1

ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో క్రోమ్ బ్రౌజర్ యాప్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోయినట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

స్టెప్ 2

బ్రౌజర్‌ను లాంచ్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వెబ్ పేజీలోకి వెళ్లండి.

 

స్టెప్ 3, స్టెప్ 4

స్టెప్ 3

బ్రౌజర్ పేజీ లింక్ పై లాంగ్ ప్రెస్ ఇచ్చినట్లయితే "Download Link" ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 4

డౌన్‌లోడ్ అయిన లింక్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని సంబంధిత వెబ్ పేజీలోని కంటెంట్‌ను యాక్సెస్ చేసుకునే వీలుంటుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best ways to access websites without internet on your Android. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot