సిగ్గుమాలిన చైనా, వాట్సప్ ద్వారా ఇండియాపై హ్యాకింగ్ దాడి, +86తో జాగ్రత్త

Written By:

పొరుగుదేశం చైనా సిగ్గుమాలని చర్యలకు పాల్పడుతోంది. అన్ని అవకాశాలతో పాటు సోషల్ మీడియాను కూడా బాగా ఉపయోగించుకుంటోంది. దీని ద్వారా ఇండియాపై దాడి చేసేందుకు రెడీ అయినట్లు నిఘా వర్గాలు చెబుుతున్నాయి. కాగా ఈ మేరకు ఇండియాసైన్యం ఓ వీడియోను విడుదల చేసింది. భారత్‌లోని కంప్యూటర్లను హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు వాట్సప్‌ను మార్గంగా వాడుకుంటున్నారని భారతీయ సైన్యం తెలిపింది. సోషల్ మీడియా వాడకంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించింది.

దేశ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పరిధిలో విధులు నిర్వహిస్తున్న సైన్యం.. వాట్సప్‌తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల వినియోగంపై జాగ్రత్త వహించాలని పేర్కొన్నది. చైనీయులు డిజిటల్ ప్రపంచంలోకి చొచ్చుకెళుతున్నారని సైన్యం అధికారిక ట్విట్టర్ నుంచి అడిషినల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ ఫేస్ (ఏడీజీపీఐ) ఒక వీడియోను ట్వీట్ చేశారు.

భారీ ఆఫర్లతో అమ్మకానికి వచ్చిన రెడ్‌మి 5, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

+86 నంబర్‌తో

భారత్‌లో వాట్సప్‌ను వాడుతున్న యూజర్లు +86 నంబర్‌తో జాగ్రత్తగా ఉండాలని భారత ఆర్మీ హెచ్చరిస్తున్నది. ఎందుకంటే ఈ నంబర్‌తో ప్రారంభమయ్యే ఏదైనా మొబైల్ నంబర్‌తో ఎవరైనా వాట్సప్ గ్రూప్‌లో చేరితే అలాంటి నంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని లేదంటే యూజర్లకు చెందిన వాట్సాప్ యాప్ హ్యాక్ అయి ఫోన్‌లోని సమాచారం చోరీకి గురవుతుందని భారత ఆర్మీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్విట్టర్‌లో ఓ వీడియో

ఇదే విషయమై భారత ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్‌ఫేస్ (ఏడీజీపీఐ) ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు భారత వాట్సప్ యూజర్ల ఖాతాల్లోకి చొరబడుతున్నారని, ఆ అకౌంట్లను హ్యాక్ చేసి యూజర్లకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారని ఏడీజీపీఐ వెల్లడించింది.

నంబర్ ఆరంభంలో ఉన్న ఏదైనా మొబైల్‌తో ..

కనుక పైన చెప్పిన నంబర్ ఆరంభంలో ఉన్న ఏదైనా మొబైల్‌తో ఎవరైనా వాట్సప్ గ్రూప్‌లో చేరితే వెంటనే అప్రమత్తం కావాలని అధికారులు హెచ్చరించారు. ఇక యూజర్లు మొబైల్ నంబర్లను మార్చినప్పుడు పాత సిమ్‌లను పనిచేయకుండా విరగ్గొట్టాలని కూడా వారు సూచిస్తున్నారు.

+86 నంబర్‌తో కూడిన ఫోన్ నంబర్లను..

+86తో మొదలయ్యే ఫోన్ నంబర్ల ద్వారా వాట్సప్‌లను ఉపయోగించుకుని భారత కంప్యూటర్లను చైనీయులు హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. +86 నంబర్‌తో కూడిన ఫోన్ నంబర్లను గ్రూపులో చేర్చుకునే ముందు అప్రమత్తంగా ఉండాలని ఆ వీడియో హెచ్చరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Beware! Chinese Numbers Starting With +86 Are Hackers Targetting Indian WhatsApp Groups More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot