ప్లే స్టోర్‌లో నకిలీ WhastsApp

|

కోట్లాది మంది యూజర్లతో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్రపంచాన్ని శాసిస్తోన్న వాట్సాప్‌ను నకిలీల బెడద బెంబేలెత్తిస్తోంది. తాజాగా, వాట్సాప్ కు చెందిన ఓ నకిలీ వర్షన్ యాప్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్ లో హల్ చల్ చేస్తోంది. Update WhatsApp Messenger పేరుతో దర్శనమిస్తోన్న ఈ యాప్ WhastsApp Inc అనే డెవలపర్ పేరు మీద అప్‌లోడ్ అయి ఉంది.

Beware! Fake WhatsApp app found on Google Play Store

ఈ హానికరమైన యాప్ ను ఇప్పటి వరకు 6477 సార్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలత ఈ నకిలీ యాప్ ను @MujtabaMHaq అనే ట్విట్టర్ యూజర్ గుర్తించగా WABetaInfo గుర్తించి ఆ సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసినట్లు IANS రిపోర్ట్ పేర్కొంది.

ఈ రిపోర్ట్ ప్రకారం Temple Run 2 గేమ్ కు సంబంధించిన ఫేక్ వర్షన్ యాప్ కూడా ప్లే స్టోర్ లో హల్ చల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా వాట్సాప్ బిజినెస్ పేరుతో మరో నకిలీ యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్ లో సర్క్యులేట్ అవుతోందని పలువురు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి.

నకిలీ వాట్సాప్ యాప్స్ నుంచి యూజర్లను అప్రమత్తం చేసే క్రమంలో WABetaInfo ఇప్పటికే తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వార్నింగ్ ట్వీట్‌లను ఇష్యూ చేస్తోంది. ఇటువంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకండి!, ఇవి పూర్తిగా ఫేక్! వాట్సాప్ బిజినెస్ యాప్ అఫీషియల్‌గా ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదంటూ, కాబట్టి అఫీషియల్ ఛానల్స్‌ను మాత్రమే ఫాలో అవ్వండంటూ యూజర్లను అప్రమత్తం చేస్తోంది.

ఇక పేటీఎమ్‌లో చాటింగ్ చేస్తూ డబ్బులు పంపుకోవచ్చుఇక పేటీఎమ్‌లో చాటింగ్ చేస్తూ డబ్బులు పంపుకోవచ్చు

అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ యాప్‌కు సంబంధించిన పర్మిషన్ లిస్ట్‌ను కూడా చెక్ చేసుకోవటం మంది. యాప్‌కు సంబంధించిన పర్మిషన్ లిస్ట్‌లో సదరు అప్లికేషన్‌కు సంబంధించి అనేక రకాల విషయాలు చర్చించబడతాయి. దీంతోపాటు డెవలపర్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకుంటే మంచిది.

ఏదైనా యాప్‌‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ముందు అది కొత్తదా లేక పాతదా విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవల్సి ఉంటుంది. గూగుల్‌లో సెర్చ్‌ చేసిన యాప్‌కు సంబంధించిన సమాచారంతో, ప్లేస్టోర్‌లో ఇచ్చిన సమాచారాన్ని సరిచూసుకోవాలి. అప్పుడు నకిలీ ఏదో, అసలు ఏదో ఇట్టే కనిపెట్లే వీలుంటుంది.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ యాప్‌కు మిగితా యూజర్లు ఇచ్చిన రివ్యూస్ అలానే రేటింగ్‌‌లను పరిశీలించండి. రివ్యూస్‌లో ఇచ్చిన సమాచారంతో యాప్‌ నకిలీదో, ఒరిజినల్‌దో ఇట్టే కనిపెట్లే వీలుంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
A fake and malicious version of WhatsApp with the name Update WhatsApp Messenger has been found on the Google Play Store.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X