Home
Apps

ఈ నంబర్లతో మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి

వాట్సప్ ఈ మధ్య చాలా పాపులర్ అయిన యాప్..ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది. అయితే దీంతో పాటు అనేక ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసి చాలామంది దాన్ని వాడుతుంటా

వాట్సప్ ఈ మధ్య చాలా పాపులర్ అయిన యాప్..ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది. అయితే దీంతో పాటు అనేక ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసి చాలామంది దాన్ని వాడుతుంటారు. అయితే వాటిని ఎలా గుర్తించాలి అని చాలామంది సందేహపడుతుంటారు. అయితే ఈ నంబర్లతో మీకు ఏమైనా మెసేజ్ లు వస్తే ఓపెన్ చేయకండి.సాధారణంగా నకిలీ వాట్సప్ అకౌంట్లు Spoof నెంబర్లు ఆధారంగా క్రియేట్ చేస్తారు. సాధారణ మొబైల్ నెంబర్లతో పోలిస్తే ఈ నెంబర్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ నెంబర్ల నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే అది నకిలీ వాట్సాప్ అకౌంట్‌గా గుర్తించండి.

ఫేక్ నెంబర్స్

ఫేక్ నెంబర్స్

మీ నెంబర్‌కు +1 తో ప్రారంభమైన నెంబర్ నుంచి మెసేజ్ వస్తే అది నకిలీ వాట్సప్ నుంచి వచ్చిందని గుర్తించండి. ఇటువంటి ఫేక్ నెంబర్స్ ఎక్కువుగా voxox app ద్వారా క్రియేట్ చేయబడతాయి. కాబట్టి +1 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను మాత్రం నమ్మకండి.

Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా

Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా

+44 నెంబర్‌తో వచ్చే వాట్సాప్ మెసెజ్‌లను కూడా నకిలీవిగానే గుర్తించండి. Fw calls అనే U.K బేసిడ్ వెబ్‌సైట్ ద్వారా ఈ +44 వాట్సాప్ నెంబర్స్ జనరేట్ అవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే వాట్సప్ అకౌంట్ ప్రొఫైల్ ఫోటోను బట్టి కూడా నకిలీ అకౌంట్లను గుర్తించవచ్చు.

ప్రొఫైల్ స్థానంలో వాట్సప్ లోగో

ప్రొఫైల్ స్థానంలో వాట్సప్ లోగో

ప్రొఫైల్ స్థానంలో వాట్సప్ లోగో ఉంటుంది కానీ ఒరిజినల్‌ లోగో మాదిరి ఉండదు స్టేటస్ స్థానంలో 'Hey there! I'm using WhatsApp' అని ప్రత్యేకమైన ఫాంట్‌తో ఉన్నట్లయితే అది దాదాపుగా నకిలీ అకౌంటే అవుతుంది.

ఇటువంటి వాట్సప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే

ఇటువంటి వాట్సప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే

కాబట్టి ఇటువంటి వాట్సప్ అకౌంట్స్‌ను నకిలీవిగానే పరిగనించడం మంచిది. ఈ నకిలీ అకౌంట్ల నుంచి పరిచయం చేసుకొని ఎటువంటి నష్టాన్నైనా మీకు కలిగించవచ్చు. కాబట్టి వాటిని దూరంగా పెట్టడమే కాకుండా చాటింగ్ చేయడం కూడా మానేయండి.

వావ్ అనిపించేలా వాట్సాప్  కొత్త ఫీచర్లు

వావ్ అనిపించేలా వాట్సాప్ కొత్త ఫీచర్లు

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం ఈ మధ్య ఐదు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ నేపధ్యంలో వచ్చిన ఐదు ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

Swipe to Reply

ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలంటే దానిపై లాంగ్ ప్రెస్ చేసి ప‌ట్టుకోవాల్సి వ‌చ్చేది. కానీ ఇక‌పై అలా కాదు. రిప్లై ఇవ్వాల‌నుకున్న మెసేజ్‌పై కుడి వైపున‌కు స్వైప్ చేస్తే చాలు. వెంట‌నే మ‌నం కావాల‌నుకున్న మెసేజ్‌కు రిప్లై ఇవ్వ‌వ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ఐఫోన్ లో వాట్సాప్ ను వాడుతున్న యూజ‌ర్ల‌కు ఇప్ప‌టికే అందుబాటులో ఉండ‌గా, ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్‌పై వాట్సాప్ బీటా వెర్ష‌న్‌ను వాడుతున్న వారికి అందుబాటులోకి వ‌చ్చింది. త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ ఈ Swipe to Reply ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

Picture in Picture Mode

Picture in Picture Mode

సుదీర్ఘకాలంగా Android Beta వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉన్న పిక్చర్ ఇన్ పిక్చర్ సదుపాయం తాజాగా వాట్సప్ ఫైనల్ వెర్షన్ వాడుతున్న వారికి ప్రవేశపెట్టబడింది. ఆండ్రాయిడ్ 4.4 తర్వాతి వెర్షన్లు వాడుతున్న వారికి ఇది లభిస్తుంది.ఈ సదుపాయం ద్వారా మీకు ఎవరైనా యూట్యూబ్ వీడియోలు పంపినప్పుడు వాటిని ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేయాల్సిన పనిలేకుండా ఒకపక్క చాట్ కన్వర్జేషన్ చేస్తుంది మరోపక్క చిన్న విండోలో వీడియోలను ప్లే చేసుకోవటానికి సాధ్యపడుతుంది.అయితే ఇక్కడ ఒక చిన్న అసౌకర్యం ఉంది. మీకు ఏ కాంటాక్ట్ నుండైతే వీడియో షేర్ చేయబడిందో ఆ ఛాట్ కన్వర్‌జేషన్‌లో ఉన్నంత సేపు మాత్రమే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌లో వీడియో చిన్నదిగా ప్లే అవుతుంది. ఒకవేళ మీరు బయటకు వచ్చి వేరే చాట్ విండోలోకి వెళ్ళినట్లయితే దాంతో ఆ వీడియో ప్లే అవ్వటం నిలిచిపోతుంది. అయితే Apple iOSలో ఇలాంటి ఇబ్బంది ఉండదు.కొంతమంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు వాట్సప్ తాజా వెర్షన్ వాడుతున్నప్పటికీ ఈ ఫీచర్ లభించడం లేదు. అలాంటప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న వాట్సాప్ చాట్ బ్యాక్ అప్ తీసుకుని ఆ తర్వాత దాన్ని తొలగించి తాజాగా మళ్లీ ఇన్స్టాల్ చేస్తే సమస్య తొలగిపోతుంది.

Ads for Status

Ads for Status

వాట్సప్ లోనూ ఇకపై యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. కానీ ఇవి కేవలం మీరు అప్ డేట్ చేసే వాట్సాప్‌ ‘స్టేటస్‌'లో కనిపించనున్నాయి. వీటిని మొదటగా ఐవోఎస్‌ మొబైల్స్ లో ప్రయోగించనున్నారు. ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌తో అసోసియేట్ అయి ఉన్న ఫోన్ నెంబర్స్‌ను బట్టి ఈ యాడ్స్‌ను పొస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఫేస్‌బుక్ తన వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను యాడ్ బేసిడ్ ఫార్మాట్‌లోకి తీసుకువచ్చేందుకు ఆగష్టు నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ స్టేటస్‌లలో పోస్ట్ అయ్యే యాడ్స్‌ను ఫేస్‌బుక్ అడ్వర్టైజింగ్ సిస్టం మానిటర్ చేస్తుంది .

Stickers For Whatsapp

Stickers For Whatsapp

ఇక వాట్సాప్ బీటా వెర్ష‌న్‌లో కొత్త‌గా వ‌చ్చిన మ‌రో ఫీచ‌ర్ Stickers download. వాట్సాప్ యూజ‌ర్లు థ‌ర్డ్‌పార్టీ యాప్స్ నుంచి కూడా స్టిక్క‌ర్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Inline Image Notification

Inline Image Notification

నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్‌లైన్‌ ఇమేజ్‌ స్టయిల్‌ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సప్‌కు మెసేజ్‌ వచ్చినట్టు నోటిఫికేషన్‌లో ఇమేజ్‌ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకుముందు కూడా వాట్సప్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌లైన్‌ ఇమేజస్‌ను వాడింది. కానీ తాజాగా కొత్త మెసేజింగ్‌స్టయిల్‌ నోటిఫికేషన్‌ ఫార్మాట్‌లో దీన్ని తీసుకొస్తోంది.అయితే ఈ ఫీచర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ 9 పై డివైజ్‌లకు మాత్రమే పనిచేయనుంది.నోటిఫికేషన్‌ల కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ జీఐఎఫ్‌లకు, వీడియోలకు పనిచేయదు. కేవలం చిన్న ఐకాన్‌ మాత్రమే ఇమేజ్‌ రూపంలో వస్తుంది. కేవలం ఆండ్రాయిడ్‌ పైలకు మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Beware the fake Whatsapp message Notifications read more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X