Just In
- 13 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 15 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 18 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 21 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- Movies
Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
వాట్సప్ లేటెస్క్ స్కాం, ఒపెన్ చేశారా ఇక అంతే సంగతులు !
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో ఎప్పటికప్పుడు వచ్చే స్పామ్, నకిలీ మెసేజ్‌లు, వైరస్ లింక్‌ల పట్ల యూజర్లు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ అందులో అలాంటి వాటి బెడద తప్పడం లేదు. అధ్బుత ఆఫర్ అంటూ ఈ మధ్య ఓ నకిలీ వైరస్ వాట్సాప్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. దీన్ని ఓపెన్ చేస్తే ఫోన్ లోకి వైరస్ ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాట్సప్ యూజర్లకు చిత్రంలో చూపినట్టుగా అడిడాస్ 3000 మందికి షూస్ ఉచితంగా ఇస్తుందనే ఓ నకిలీ వార్త, లింక్ ఇప్పుడు వైరల్‌గా ఫార్వార్డ్ అవుతున్నది. ఈ క్రమంలో సదరు లింక్‌ను ఓపెన్ చేసిన వారి ఫోన్లలోకి వైరస్ వస్తున్నది. కనుక ఎవరికైనా వాట్సాప్‌లో ఈ లింక్ వస్తే ఓపెన్ చేయకండి. లేదంటే ఫోన్ వైరస్ బారిన పడే అవకాశం ఉంది.
ఈ సంధర్భంగా వాట్సప్ లో మీకు తెలియని కొన్ని ట్రిక్స్ మీకోసం ఇస్తున్నాం ఓ లుక్కేయండి

సింగిల్ మెసేజ్ ను ఒకేసారి చాలా మందికి పంపడం
ఒకే సందేశాన్ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి సాధ్యమవుతుంది. మెనూపై క్లిక్ చేసి న్యూ బ్రాడ్ కాస్ట్ ని సెలెక్ట్ చేసుకొని మీ కాంటాక్ట్ లిస్టు లో ఉన్న వారిని సెలెక్ట్ చేసి ఒకే మెసేజ్ ను మల్టిపుల్ సెండింగ్ చేయొచ్చు.

టెక్ట్స్ ఫార్మాట్
మీరు మెసేజెస్ ను ఇప్పుడు బోల్డ్, ఇటాలిక్స్ లేదా స్ట్రైక్ లో కూడా పంపవచ్చు. మీ ఛాయస్ కు తగ్గట్టుగా వర్డ్స్‌కు ముందుగాని లేదా తరువాత గాని స్పెషల్ క్యారెక్టర్స్ ను యూస్ చేసి అలాగే మీకు నచ్చిన ఫార్మాట్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

డేటా సేవ్
మీరు రోమింగ్ లో లేదా మీరు నెమ్మదిగా లేదా ఖరీదైన డేటా నెట్ వర్క్ లో ఉంటే, మీరు ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నదాన్ని ఎంచుకోవడం ద్వారా మీ డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు. మీరు రోమింగ్ ఉన్నప్పుడు డౌన్లోడ్ కోసం వీడియో, ఫోటో లేదా ఆడియోను సెలెక్ట్ చేసుకొని మీరు వాట్సప్ కాల్ సమయంలో ఉపయోగించే డేటా ను తగ్గించడానికి 'లో డేటా యూసేజ్' కూడా క్లిక్ చేయవచ్చు.

మ్యూట్
మీరుగ్రూప్ లో ఉన్నట్లయితే, చాలా మెసేజస్ ను పంపిస్తుంటారు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనవసరమైన మెసేజస్ ను పంపుతుంటే, ఆ గ్రూప్ లేదా కాంటాక్ట్ ను స్టాప్ చేయొచ్చు. కాంటాక్ట్ లేదా గ్రూప్ ని సెలెక్ట్ చేసి మెనూ లోని మ్యూట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.

ప్రైవసీ కంట్రోల్
మీరు వాట్సప్ ను ఉపయోగిస్తున్నట్టు మీ కాంటాక్ట్ లిస్ట్ లోని ఎవరికైనా చూపించకూడదనుకుంటే, మీరు 'లాస్ట్ సీన్ ' ఆప్షన్ ను షట్ ఆఫ్ చేసుకోవచ్చు. బ్లూ టిక్స్ ను , మీ ప్రొఫైల్ పిక్ ను కూడా షట్ ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే చాలు. అయితే, మీరు ఈ ఆప్షన్స్ డిసేబుల్ చేస్తే, మీ లిస్టు లోని ఇతర కాంటాక్ట్స్ నుండి కూడా ఇవేవి మీరు చూడలేరు.

డాక్యుమెంట్స్ ను షేర్ చేయడం
వాట్సప్ ద్వారా డాక్యుమెంట్స్ ను సెండ్ చేయొచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు. ఫోటోలు మరియు వీడియోలే కాకుండా pdf, excel, word ఫైల్స్ కూడా పంపవచ్చు. మీ చాట్ కు డాక్యుమెంట్ ను అటాచ్ చేసి షేర్ చేయండి.

ఆటో డౌన్ లోడ్
రోమింగ్ లో ఉన్నప్పుడు ఆడియో మరియు వీడియో డౌన్ లోడ్ ను ఆపివేయడం లాగానే, మీరు డేటా లేదా వైఫైలో ఉన్నప్పుడు ఫోటోలను మరియు వీడియోలను సెలెక్టివ్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ కు వెళ్లి డేటా యూసేజ్' సెలెక్ట్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470