ఆన్‌లైన్‌లో Passport కోసం ధరఖాస్తు చేస్తున్నారా? ఈ నకిలీ యాప్‌లకు దూరంగా ఉండండి

ఇకనుంచి దేశంలో ఎక్కడినుంచైనా ఫ్రెష్ పాస్‌పోర్ట్‌కు ధరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

|

జూన్ 26న న్యూఢిల్లీలో జరిగిన 'సిక్స్త్ పాస్‌పోర్ట్ సేవా దివాస్' (Sixth Passport Seva Divas) కార్యక్రమంలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ 'mPassportSeva' యాప్‌కు సంబంధించి అప్‌డేటెడ్ వెర్షన్‌ను అనౌన్స్ చేసారు. తాజా అప్‌డేట్‌లో భాగంగా ఇకనుంచి దేశంలో ఎక్కడినుంచైనా ఫ్రెష్ పాస్‌పోర్ట్‌కు ధరఖాస్తు చేసుకునే వీలుంటుంది.గతంతో ఎవరైనా పాస్‌పోర్ట్‌కు ధరఖాస్తు చేసుకోవాలంటే తమ సొంత ఉరి నుంచే చేసుకోవల్సి వచ్చేది. ఇక పై అలాకాకుండా దేశంలో ఎక్కడినుంచైనా కొత్త పాస్‌పోర్టుకు ధరఖాస్తు చేసుకునే వీలుంటుంది. అంటే మీ సొంత ఊరు విజయవాడ అయి ఉండి ఉద్యోగ రిత్యా చెన్నైలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచే పాస్‌పోర్టుకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

అమెజాన్‌కు రూ.50 లక్షల కుచ్చు టోపీ పెట్టిన ఢిల్లీ కుర్రాడుఅమెజాన్‌కు రూ.50 లక్షల కుచ్చు టోపీ పెట్టిన ఢిల్లీ కుర్రాడు

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభ్యమవుతోంది..

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభ్యమవుతోంది..

‘mPassportSeva' మొబైల్ అప్లికేషన్‌ను తొలిగా 2013, జూలై 11వ తేదీన భారత్‌లో రిలీజ్ చేయటం జరిగింది. ఈ యాప్ ను ‘Consular, Passport and Visa (CPV) Division' అభివృద్ధి చేసింది. 10 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లను సొంతం చేసుకున్న ఈ ఉచిత అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు Passport Seva యాప్‌కు సంబంధించి అనేక ఫేక్ వెర్షన్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. నేటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో భాగంగా Passport Seva యాప్‌కు సంబంధించి గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న 5 ఫేక్ వెర్షన్స్‌ను మీ దృష్టికి తీసుకురావటం జరుగుతోంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇటువంటి యాప్స్‌కు చాలా దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సర్వీసెస్ అండ్ సేవా (Online Passport Services and Seva)

ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సర్వీసెస్ అండ్ సేవా (Online Passport Services and Seva)

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న ‘ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ సర్వీసెస్ అండ్ సేవా' (Online Passport Services and Seva) యాప్‌ను స్టైలిష్ ఫోటో మేకర్ అనే డెవలపర్ అభివృద్ధి చేసారు. ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి స్టేటస్ అండ్ అపాయింట్‌మెంట్ వరకు అన్ని రకాల సర్వీసెస్ ఇందులో అందుబాటులో ఉంచినప్పటికి ఇది ఎంత మాత్రం అఫీషియల్ యాప్ కాదు.

ఆధార్ పాన్ పీఎన్ఆర్ పాస్‌పోర్ట్ సేవా (Aadhar Pan PNR Passport Seva)

ఆధార్ పాన్ పీఎన్ఆర్ పాస్‌పోర్ట్ సేవా (Aadhar Pan PNR Passport Seva)

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న ‘ఆధార్ పాన్ పీఎన్ఆర్ పాస్‌పోర్ట్ సేవా' (Aadhar Pan PNR Passport Seva) యాప్ ద్వారా ఎంఐసీఆర్ ఆధార్, ఐఎఫ్ఎస్‌సీ, పాన్‌కార్డ్, పీఎన్ఆర్ ఇంకా పాస్‌పోర్ట్ యూసేజ్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునే వీలుంటుంది. వివిధ రకాల సర్వీసులు ఇందులో అందుబాటులో ఉంచినప్పటికి ఇది ఎంత మాత్రం అఫీషియల్ యాప్ కాదు.

పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ (Passport Seva Online)

పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ (Passport Seva Online)

mPassportSeva యాప్‌కు దగ్గర పోలికలను కలిగి ఉండే ఈ యాప్ అనేక ప్రభుత్వ సర్వీసులను ఆఫర్ చేస్తున్నప్పటికి ఇది ఎంత మాత్రం అఫీషియల్ యాప్ కాదు. కాబట్టి ఈ యాప్‌‌‌కు దూరంగా ఉండటం మంచిది.

పాస్‌పోర్ట్ సర్వీసెస్ ఇ-సేవా (Passport Services E - Seva)

పాస్‌పోర్ట్ సర్వీసెస్ ఇ-సేవా (Passport Services E - Seva)

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న పాస్‌పోర్ట్ సర్వీసెస్ ఇ-సేవా (Passport Services E - Seva) అనే అప్లికేషన్స్ గెలాక్సీ ఆండ్రాయిడ్ యాప్స్ అనే యాప్ డెవలపర్ లాంచ్ చేసింది. ఓరిజనల్ యాప్ తరహాలోనే అన్ని రకాల పాస్ పోర్ట్ సర్వీసులను ఆఫర్ చేస్తోంది. ఇది ఎంత మాత్రం అఫీషియల్ యాప్ కాదు.

పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ (Passport Status Check)

పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ (Passport Status Check)

గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న పాస్‌పోర్ట్ స్టేటస్ చెక్ (Passport Status Check) యాప్‌ను స్మార్ట్ టెక్ 2020 అనే సంస్థ అభివృద్ధి చేసింది. పాస్‌పోర్ట్‌కు సంబంధించిన మొత్త వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఉపయోగపడే సర్వీసులను ఆఫర్ చేస్తున్నప్పటికి ఇది ఎంత మాత్రం అఫీషియల్ యాప్ కాదు.

Best Mobiles in India

English summary
On the occasion of the ‘Sixth Passport Seva Divas’ on June 26, External Affairs Minister Sushma Swaraj has announced a revamped ‘mPassportSeva’ app. The app will now will now allow citizens to apply for a fresh passports from anywhere in the country.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X