మీ debit, credit కార్డులను స్వైప్ చేయకుండా పేమెంట్స్ చెల్లించండి

మీ debit/credit కార్డులను POS మెచీన్‌లలో స్వైప్ చేయకుండా చెల్లింపులను చేపట్టవచ్చు.

|

క్యాష్‌లెస్ ఎకానమీకి అవసరమైన డిజిటల్ పేమెంట్ సిస్టంను భారత్‌లో మరింత సులభతరం చేసే క్రమంలో మోదీ సర్కార్ సరికొత్త ఆన్‌లైన్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

స్వైప్ చేయకుండా చెల్లింపులను చేపట్టవచ్చు

స్వైప్ చేయకుండా చెల్లింపులను చేపట్టవచ్చు

Bharat QR code పేరుతో లాంచ్ అయిన ఈ పేమెంట్ సిస్టంలో భాగంగా debit/credit కార్డులను POS మెచీన్‌లలో స్వైప్ చేయకుండా చెల్లింపులను చేపట్టవచ్చు.

Bharat QR codeను స్కాన్ చేసి

Bharat QR codeను స్కాన్ చేసి

మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మర్చెంట్‌కు కేటాయించిన Bharat QR codeను స్కాన్ చేసి పిన్‌కోడ్‌ను ఎంటర్ చేస్తే చాలు చెల్లింపు పూర్తవుతుంది. నగదు నేరుగా మీ అకౌంట్ నుంచి మర్చంట్ బ్యాంక్ ఖతాలోకి వెళ్లిపోతోంది.

ఎవరు అభివృద్ధి చేసారు..?

ఎవరు అభివృద్ధి చేసారు..?

Bharat QR codeను కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మాస్టర్ కార్డ్, వీసాలు అభివృద్ధి చేసాయి. ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలనే వారు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండాలి. ఇదే సమయంలో వారివారి బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించిన మొబైల్ బ్యాకింగ్ యాప్‌లను కూడా వాడుతుండాలి.

Bharat QR code సర్వీసును సపోర్ట్ చేసే బ్యాంకుల వివరాలు..

Bharat QR code సర్వీసును సపోర్ట్ చేసే బ్యాంకుల వివరాలు..

యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్ లిమిటెడ్, కరూర్ వైశ్యా బ్యాంక్, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్, ఎస్ బ్యాంక్ లిమిటెడ్.

Pockets App, PayZapp appలు సపోర్ట్ చేస్తున్నాయి...

Pockets App, PayZapp appలు సపోర్ట్ చేస్తున్నాయి...

Bharat QR code సర్వీసులను ICICI అలానే HDFC బ్యాంకులకు సంబంధించిన Pockets App, PayZapp appలు సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ICICI లేదా HDFC బ్యాంక్ ఖతాదారులు అయినట్లయితే ముందుగా PayZapp అలానే Pockets యాప్‌లను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్స్ లాంచ్ అయిన తరువాత అకౌంట్‌లలోకి Signup అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత 4 డిజిట్ల పిన్ కోడ్‌ను సెట్ చేసుకోవాలి. ఇప్పుడు debit/credit కార్డ్ అలానే బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను యాప్‌కు లింక్ చేసుకోవాలి. అంతే Bharat QR code సర్వీసు మీకు అందుబాటులో ఉన్నట్లే.

Best Mobiles in India

English summary
Bharat QR Code, Interesting Facts. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X