భారత్‌పే నుంచి కొత్త యాప్.. ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలి.. ఎలా ఉపయోగపడుతుంది?
డిజిటల్ పేమెంట్స్ సంస్థ భారత్‌పే (BharatPe) తన వినియోగదారులు మరింత సురక్షితంగా పేమెంట్లు చేసే విధంగా కొత్త నిర్ణయం తీసుకుంది. UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ను ప్లాట్‌ఫాం లో అనుసంధానం చేయడం ద్వారా భారత్‌పే ను తమ వినియోగదారుల మరింత సులభంగా, సురక్షిత వేదికగా మార్చే లక్ష్యం నిర్దేశించుకుంది. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ X ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
UPI TPAP (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) ను లాంచ్ చేస్తున్నట్లు భారత్ పే ప్రకటన చేసింది. ఈ కొత్త నిర్ణయం ద్వారా మరింత సరళంగా, వేగంగా మరియు సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉండనుంది. UPI పేమెంట్ల కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని భారత్‌పే తమ సామాజిక మాధ్యమాల ద్వారా కోరింది.

భారత్‌పే యూపీఐ ద్వారా వ్యాపారులు సహా ఇతరులకు తమ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా పేమెంట్లు చేయవచ్చని తెలిపింది. ప్రస్తుత మర్చంట్ ఎకోసిస్టమ్ ను యూపీఐతో అనుసంధానం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా అధిక స్థాయిలో పేమెంట్లు స్వీకరించేలా ప్లాట్ ఫాం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌పే యూపీఐ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కు మాత్రమే అందుబాటులో ఉందని భారత్‌పే వెల్లడించింది. రానున్న నెలల్లో iOS యూజర్లకు కూడా ఈ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. యూప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకొనే విధంగా సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.
Super News! We’ve now ventured into consumer payments with the launch of our UPI TPAP (Third-Party Application Provider) offering!
— BharatPe (@bharatpeindia) August 28, 2024
As part of this exciting development, postpe is now BharatPe. This rebrand unites all our services under one powerful name, ensuring you continue to… pic.twitter.com/VmVkUNp6be
భారత్‌పే యూపీఐ యాప్ రీబ్రాండింగ్ ద్వారా వ్యాపారులు, వినియోగదారులకు ఒకే ప్లాట్‌ఫాం అందుబాటులోకి తీసుకురావడం తమ లక్ష్యమని భారత్‌పే హెడ్ కన్స్యూమర్ కోహినూర్ బిస్వాస్ అన్నారు. అయితే ఈ తరహా యాప్‌లను ఇప్పటికే కొన్ని సంస్థలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అనేక అప్‌డేట్స్‌తో ఈ యాప్‌ను రీబ్రాండ్ చేసినట్లు చెప్పారు.
అయితే ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్లను పిన్ ద్వారా చేస్తుండగా.. త్వరలో బయో మెట్రిక్ ద్వారా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో UPI పేమెంట్స్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఫోన్‌లలో ఫేస్ ఐడీ ద్వారా చేసే వీలుందని తెలుస్తోంది.
భారత్‌లో ప్రస్తుతం డిజిటల్ పేమెంట్‌లను 4 లేదా 6 అంకెల పిన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశంలో UPI వ్యవస్థ అత్యంత సురక్షితమైనదిగా ఉంది. మరింత సురక్షితంగా చేసేందుకు UPI వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు వీలుగా ఫేస్ ఐడీ, బయోమెట్రిక్ ద్వారా UPI పేమెంట్లు నిర్వహించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








