భీమ్ (BHIM) యాప్ ఇప్పుడు తెలుగులో

నగదురహిత లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ భారత ప్రభుత్వ లాంచ్ చేసిన 'భీమ్'(భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ) ఇప్పుడు తెలుగులో లభ్యమవుతోంది. డిజిటల్ లావాదేవీల పై అవగహన లేనివారు సైతం ఉపయోగించుకునేలా తీర్చిదిద్దబడిన భీమ్ అప్లికేషన్‌ను తాజాగా కొత్త 1.2 వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లటం ద్వారా అప్‌డేటెట్ వర్షన్ భీమ్ యాప్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యాప్ లాంచ్ అయిన నాటి నుంచి ఇది రెండవ అప్‌డేట్.

Read More : నోకియా 6.. రేపటి సేల్ కోసం 14 లక్షల మంది రె 'ఢీ'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏడు కొత్త భాషలతో లభ్యమవుతోంది

BHIM అప్‌డేటెడ్ వర్షన్ 1.2 యాప్ ఏడు కొత్త భాషలతో లభ్యమవుతోంది. వాటి వివరాలు.. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, బెంగాలీ, ఒడియా, గుజరాతీ. పాత వర్షన్ భీమ్ యాప్ కేవలం ఇంగ్లీష్ ఇంకా హిందీ భాషలను మాత్రమే సపోర్ట్ చేసేది. 'Pay to Aadhaar Number'పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఈ అప్‌డేటెడ్ వర్షన్‌తో అందుబాటులోకి తీసుకువచ్చారు.

'Pay to Aadhaar Number'

ఈ ఫీచర్‌లో భాగంగా కస్టమర్ ఆధార్ నెంబర్ ఆధారంగా నగదు లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. నగదు పంపాల్సిన వ్యక్తికి సంబంధించి బ్యాంక్ అకౌంట్‌ నెంబరుతో పనిలేకుండా అతని అకౌంట్‌తో లింక్ అయిన ఉన్న ఆధార్ నెంబర్ ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయాన్ని ఈ 'Pay to Aadhaar Number'ఫీచర్ అందిస్తుంది. ఈ అప్‌డేటెడ్ వర్షన్‌‌లో సెక్యూరిటీ ఫీచర్లను మరింతగా బలోపేతం చేసినట్లు NPCI ఒక ప్రకటనలో తెలిపింది.

50 లక్షల మంది డౌన్‌‌లోడ్ చేసుకున్నారు

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని, ఆయనకు ఘన నివాళిగా డిసెంబర్ 30న అందుబాటులోకి వచ్చిన భీమ్ యాప్‌ను ఇప్పటి వరకు 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అవగాహనలోపం కారణంగా చాలా మంది యూజర్లు ఈ యాప్ ఉపయోగించుకోవటంలో తడబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ అంశం పై దృష్టిసారించి దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహించటం ద్వారా యాప్ వినియోగం విషయంలో మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నకిలీల బెడద తప్పటం లేదు

భీమ్ యాప్‌‌కు నకిలీల బెడద తప్పటం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 నకిలీ వర్షన్ భీమ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కాబట్టి వీటి ఎంపిక విషయంలో యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరిజనల్ BHIM యాప్‌ను మీ ఫోన్‌లో పొందాలంటే ఇలా చేయండి..

గూగుల్ ప్లే స్టోర్‌లో BHIM app

గూగుల్ ప్లే స్టోర్‌లో BHIM app అని మీరు టైప్ చేసిన వెంటనే భీమ్ యాప్ పేరుతో అనేక పేర్లు మీకు కనిపిస్తాయి. అయితే ఒరిజనల్ BHIM యాప్‌ను National Payments Corporation of India (NPCI) డెవలప్ చేసింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ కు సంబంధించిన లోగో రెండు ఏకకాలిక త్రిభుజాలను కలిగి ఉంటుంది. అందులు మొదటి త్రిభుజం ఆరెంజ్ రంగులో, మరొక త్రిభుజం పచ్చ రంగులో ఉంటుంది. లోగో పై ఏ విధమైన టెక్స్ట్ ఉండదు. BHIM పేరుతోనే యాప్ ఉంటుంది. ఒరిజనల్ BHIM యాప్‌ను పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

భీమ్ యాప్ గురించి పలు ఆసక్తికర విషయాలు..

డెబిట్, క్రెడిట్ కార్డుల అవసరం కూడా లేకుండానే కేవలం తమ చేతివేళ్ళతో వినియోగదారులు ఈ యాప్ ను ఉపయోగించి డిజిటల్ లావాదేవీలను పూర్తిచేయవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వర్షన్ ఫోన్‌లను మాత్రమే భీమ యాప్ సపోర్ట్ చేస్తోంది. త్వరలో ఐఓఎస్ ఆధారిత యాపిల్ ఐఫోన్లకు కూడా ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ కేవలం మీ మొబైల్ నంబర్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ లేదా చెల్లింపు సదుపాయం కల్పిస్తుంది.

భీమ్ యాప్ గురించి పలు ఆసక్తికర విషయాలు..

మీరు ఎక్కడైనా ఏదైనా కొనుగోలు చేసినప్పుడు సదరు దుకాణదారుడు కూడా ఈ యాప్ గనుక వినియోగిస్తుంటే.. యాప్ ను తెరిచి, సెండ్ మనీ అని కొట్టి, చెల్లించాల్సిన మొత్తం, వ్యాపారి ఫోన్ నంబర్ టైపు చేస్తే చాలు. సెకన్ల వ్యవధిలో చెల్లింపు జరిగి పోతుంది. మీ బ్యాంకు ఖాతాలో నగదు డెబిట్ అయి, వ్యాపారి బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఈ యాప్ వినియోగదారులకు కల్పిస్తోంది. వ్యాపారులు కూడా ఈ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ లను జనరేట్ చేసుకోవచ్చు. మర్చంట్ కి నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు స్కాన్ ను టాప్ చేసి, యాప్ లోని పే బటన్ ను నొక్కాలి. తర్వాత క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు.

ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు

ఫీచర్ ఫోన్ వాడుతున్న వారు చెల్లింపుల కోసం మొదట *99# ను డయల్ చేయాలి. అనంతరం వివిధ ఆప్షన్లతో కూడిన మెనూ కనిపిస్తుంది. నగదు పంపడానికి, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి, లావాదేవీల చరిత్ర కోసం నోక్కవలసిన వివిధ నంబర్లు మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఉదాహరణకు.. నగదు పంపించాలనుకుంటే, 1 నంబరు టైప్ చేసి, సెండ్ నొక్కాలి. ఎవరికి పంపించాలకున్నారో వారి మొబైల్ నంబరు టైపు చేసేందుకు మళ్ళీ 1 నంబరు నొక్కాలి. తర్వాత సదరు వ్యక్తి ఫోన్ నంబరు, చెల్లింపు మొత్తం టైపు చేసి 'పిన్'ను జనరేట్ చేసుకోవాలి.

రూ.20 వేల వరకు నగదు ట్రాన్స్‌ఫర్

ఈ భీమ్ యాప్‌తో రూ.10 వేల వరకు నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఇలా రోజుకు రూ.20 వేల వరకు ఎవరికైనా నగదు పంపించుకోవచ్చు. మొబైల్ వాలెట్ యాప్ ద్వారా అయితే మొదట అందులో నగదు నింపుకుని, తర్వాత లావాదేవీలు జరపవలసి ఉంటుంది. అయితే ఈ భీమ యాప్ లో ముందుగా నగదు నింపుకోవలసిన అవసరం కూడా లేదు. డెబిట్ కార్డు మాదిరిగా ఇది నేరుగా వినియోగదారుల ఫోన్, బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉంటుంది కాబట్టి చెల్లింపులు వెంట వెంటనే జరిగిపోతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BHIM app gets support for seven regional languages. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot