BHIM Appలో ఈ కొత్త అప్డేట్ గురించి మీకు తెలుసా...

|

యుపిఐ ప్లాట్‌ఫామ్ ద్వారా పీర్-టు-పీర్ మరియు వ్యాపార లావాదేవీలను అనుమతించే NPCI యొక్క BHIM యాప్ ఇప్పుడు కొత్త అప్డేట్ లను పొందింది. ఇది డిజైన్ ట్వీక్స్ మరియు కొత్త ఎంపికలతో పాటు బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలను తీసుకువచ్చింది. ఇందులో గల ముఖ్యమైన ఫీచర్స్ లలో గిఫ్ట్ కార్డ్ మరియు డొనేషన్ (విరాళం) వంటి ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అప్డేట్ వివరాలు

అప్డేట్ వివరాలు

మీరు యాప్ ను ఓపెన్ చేసినప్పుడు హోమ్ స్క్రీన్‌లో డబ్బు బదిలీ చేయడం, బిల్ పే వంటి మరిన్ని ఎంపికల కోసం చూడండి. బిల్ పే టాబ్‌లో ఇటీవల మీరు చెల్లించిన బిల్లర్‌లైన ఎల్‌పిజి గ్యాస్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్‌లైన్ మరియు మొబైల్ పోస్ట్‌పెయిడ్ వంటివి ఉన్నాయేమో చూడండి.

 

Vodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరటVodafone Long Term Plans ధరల పెంపుపై వోడాఫోన్ యూజర్లకు కొంత కాలం ఊరట

గిఫ్ట్ ఆఫర్లు

వీటికి మరింత కింద చూడగా మీకు ఆఫర్లు, గిఫ్ట్ మరియు డొనేట్ వంటి మూడు ఎంపికలు ఉంటాయి. ఈ మూడు ఆఫర్‌ల కింద మీకు ట్రావలింగ్, షాపింగ్, ఆన్‌లైన్ ఫార్మసీ, ఫుడ్ , గిఫ్ట్స్ వంటి మరిన్నింటిపై డిస్కౌంట్ కూపన్లు మరియు కోడ్స్ లభిస్తాయి. ఉదాహరణకు మీరు పెప్పర్‌ఫ్రైలో ఫర్నిచర్ కొనుగోలు చేసేటప్పుడు మీకు ఫ్లాట్ రూ.1000 పొందడానికి కూపన్ కోడ్‌ను ఉపయోగించవచ్చు. మీరు ఓవెన్ స్టోరీ పిజ్జాపై 50 శాతం వరకు, ఫాసోస్‌పై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

 

Amazon Fire TV Stickను ఉచితంగా అందిస్తున్న టాటా స్కైAmazon Fire TV Stickను ఉచితంగా అందిస్తున్న టాటా స్కై

గిఫ్ట్ ఎంపిక

అందులో ఉన్న గిఫ్ట్ ఎంపికను ఎంచుకొని మీరు పుట్టినరోజు, పెళ్లి రోజు, దీపావళి, నూతన సంవత్సరం వంటి మరెన్నో వాటికి బహుమతిగా గ్రహీతలకు డబ్బును పంపవచ్చు. చివరగా సహాయ నిధులు, క్యాన్సర్ రోగి సహాయ సంఘం వంటి మరెన్నో సేవాసంఘాలకు కూడా సహాయం చేయడం కోసం మీరు నేరుగా చెల్లించడానికి విరాళం ఎంపికను ఎంచుకొని పంపవచ్చు.

 

టెలికాం ఆపరేటర్లకు రెండేళ్ల తాత్కాలిక నిషేదం ఇచ్చిన కేంద్రంటెలికాం ఆపరేటర్లకు రెండేళ్ల తాత్కాలిక నిషేదం ఇచ్చిన కేంద్రం

FY20 లో నమోదయిన డిజిటల్ లావాదేవీలు 21 బిలియన్లు

FY20 లో నమోదయిన డిజిటల్ లావాదేవీలు 21 బిలియన్లు

ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వివరాల ప్రకారం నవంబర్ 13 వరకు 21 బిలియన్ రూపాయలు డిజిటల్ లావాదేవీల రూపంలో జరిగాయి. 2018-2019లో ఇండియా 31 బిలియన్ డిజిటల్ లావాదేవీలను చూసింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు ఉండటంతో లావాదేవీలు ఇంకా పెరిగే అవకాశం చాలా ఉంది.

డిజిటల్ చెల్లింపు

టైర్ 1 మరియు 2 నగరాల్లోని వినియోగదారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించే స్థాయిలు అద్భుతంగా ఉన్నాయి అని ఫోన్‌పే యొక్క CEO మరియు సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి బెంగళూరు టెక్ సమ్మిట్ లోని ప్యానెల్ చర్చలో చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలోను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డబ్బును ఇంటికి పంపుతున్నారు. ఇంతకు ముందు బ్యాంక్ బదిలీలను ఉపయోగించిన వ్యక్తులు కూడా ఇప్పుడు భారీగా డిజిటల్ చెల్లింపులకు వలసలు అవుతున్నారు అని ఆయన చెప్పారు.

Best Mobiles in India

English summary
BHIM App New Version Gets Upgraded With Minor Design Tweaks, And More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X