BHIM యాప్, అప్పుడే కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు

భీమ్ యాప్ సరికొత్త రికార్డును నెలకొల్పటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసారు.

|

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం మోదీ సర్కార్ డిసెంబర్ 30, 2016న లాంచ్ చేసిన ఇ-వాలెట్ యాప్ 'భీమ్'(భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మొబైల్) 10 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది.

BHIM యాప్, అప్పుడే కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు

Read More : భారత్ కోసం గూగుల్ రూ.2000 ఫోన్

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను కేవలం 10 రోజుల వ్యవధిలో 10 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. భీమ్ యాప్ సరికొత్త రికార్డును నెలకొల్పటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసారు.

BHIM యాప్, అప్పుడే కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు

Read More : తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే మోస్ట్ పాపులర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇన్ ఇండియాగా BHIM యాప్ గుర్తింపు తెచ్చుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ భీమ్ యాప్‌కు 4.1 రేటింగ్ లభించింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలకు సంబంధించి లావాదేవీలను నిర్వహించుకునే వీలుగా యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ను ఈ యాప్‌లో పొందుపరిచారు.

AP PURSE..

AP PURSE..

రాష్ట్ర వ్యాప్తంగా నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం AP PURSE పేరుతో సరికొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ యాప్‌ను కొద్ది రోజుల క్రితం లాంచ్ చేసారు. ఈ యాప్‌ను ఉపయోగించుకుని మొబైల్ బ్యాంకింగ్ వైపు అడుగులు వేయటం ద్వారా కరెన్సీ కష్టాల నుంచి బయటపడవచ్చని ముఖ్య మంత్రి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు ఇ-వాలెట్స్

మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు ఇ-వాలెట్స్

ప్రస్తుతానికి AP PURSE యాప్‌లో 13 మొబైల్ బ్యాంకింగ్ అలానే 10 మొబైల్ వాలెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వాలెట్‌లను ఉపయోగించుకుని ప్రజులు తమ క్యాష్‌లెస్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న AP PURSE యాప్‌లో వివిధ మొబైల్ పేమెంట్ యాప్స్‌తో పాటు మొబైల్ బ్యాంకింగ్ కు సంబంధించిన టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్ చెల్లింపులు, నగదు ట్రాన్స్‌ఫర్,

ఆన్‌లైన్ చెల్లింపులు, నగదు ట్రాన్స్‌ఫర్,

ఆన్‌లైన్ చెల్లింపులు, నగదు ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ షాపింగ్, రీఛార్జ్ వంటి అవసరాలను తీర్చుకోవచ్చు. పేటీఎమ్, మొబీవిక్, పేయూమనీ, ఫ్రీఛార్జ్, జియో మనీ, ఎస్‌బిఐ బడ్డీ, ఓలా మనీ, ఎయిర్‌టెల్ మనీ, వొడాఫోన్ m-pesa, ఐడియా మనీ, ఆక్సిజన్ వాలెట్, సిట్రస్, ఐక్యాస్, ఇట్జ్‌క్యాష్ వంటి పేమెంట్ గేట్ వే యాప్స్ ఏపీ పర్స్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

వ్యాపారాన్ని అనేక రకాలుగా విస్తరించుకునే అవకాశం

వ్యాపారాన్ని అనేక రకాలుగా విస్తరించుకునే అవకాశం

అన్ని వాలెట్స్‌కు సంబంధించి పేమెంట్స్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. నగదును తమ అకౌంట్‌లలో డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకు లైన్‌లలో నిలుచుని ఉండాల్సిన అవసరం ఉండదు. బోలెడంత సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. నకిలీ కరెన్సీ బెడద ఉండదు. పెద్ద మొత్తంలో చిల్లర మెయింటేన్ చేయవల్సిన అవసరం ఉండదు. మీ వ్యాపారాన్ని అనేక రకాలుగా విస్తరించుకునే అవకాశం.

యాప్‌పర్స్ యాప్ ద్వారా కరెంటు బిల్స్..

యాప్‌పర్స్ యాప్ ద్వారా కరెంటు బిల్స్..

యాప్‌పర్స్ యాప్ ద్వారా కరెంటు బిల్స్ చెల్లించవచ్చు, రిటైల్ షాపుల్లో ఉపయోగించుకోవచ్చు, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయవచ్చు, ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను కొనుగోలు చేయవచ్చు, రెస్టారెంట్స్, పెట్రోల్ పంప్స్, గ్రోసరీ స్టోర్స్, బిల్ పేమెంట్స్, ఆన్‌లైన్ రీఛార్జ్‌లు, డీటీహెచ్ అలానే బ్రాడ్‌బ్యాండ్ రీఛార్జులు, ఎలక్ట్రానిక్స్ షాప్స్, మొబైల్ షాప్స్, సినిమా టికెట్ బుకింగ్, బస్ టికెట్స్, రైల్వే టికెట్ , ఫ్లైట్ టికెట్ బుకింగ్‌కు AP PURSE యాప్‌ను ఉయోగించుకోవచ్చు.

మొబైల్ ఫోన్‌లలో AP PURSE యాప్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

మొబైల్ ఫోన్‌లలో AP PURSE యాప్‌ను ఉపయోగించుకోవటం ఎలా..?

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి AP PURSE యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ పేరు, ఆధార్ నెంబర్ అలానే మొబైల్ నెంబర్‌తో యాప్‌లో రిజిస్టర్ అవ్వండి. తద్వారా యాప్‌లో అందుబాటులో ఉన్న అన్ని పేమెంట్ యాప్స్‌కు సంబంధించిన యాక్సెస్ మీకు లభిస్తుంది. యాప్ లింక్ 

Best Mobiles in India

English summary
BHIM e-wallet app crosses 10 million downloads in 10 days. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X