Home
Apps

వాట్సాప్‌లో క్రేజీ అప్‌డేట్.. ప్రైవేట్ చాట్‌లలోనూ ఈవెంట్లు షెడ్యూల్ చేసుకోవచ్చు!

WhatsApp Scheduling Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు ఓ గుడ్ న్యూస్. ఇప్పటివరకు గ్రూప్ చాట్స్‌లో మాత్రమే ఈవెంట్స్‌ షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉండగా, త్వరలోనే ప్రైవేట్ చాట్‌లలో కూడా ఈ ఫీచర్ రాబోతోంది. అంటే ఇకపై స్నేహితులతో వ్యక్తిగతంగా చాట్ చేస్తూనే మీటింగ్స్, అపాయింట్‌మెంట్లు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది.

ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపిన వివరాల ప్రకారం, వాట్సాప్ తాజా బీటా వెర్షన్‌లో ఈ ప్రైవేట్ చాట్ ఈవెంట్ క్రియేషన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈవెంట్ క్రియేట్ చేసే సమయంలో యూజర్లు లొకేషన్, ఆడియో లేదా వీడియో కాల్ లింక్‌లను కూడా యాడ్ చేసుకోవచ్చు.

Big Update Alert  WhatsApp Set to Revolutionize Chats with Event Scheduling Feature

వేరే క్యాలెండర్ యాప్‌ల అవసరం లేకుండా, వాట్సాప్‌లోనే అన్నీ సెట్ చేసుకునే అవకాశం రావడంతో యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. చాలామంది వాట్సాప్‌లోనే ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి, ఈ ఫీచర్ రావడం వల్ల యాప్స్ మార్చకుండానే అన్నీ ఒకే చోట సెట్ చేసుకోవచ్చు.

* యాపిల్‌కు పోటీగా ఫీచర్..

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ఫీచర్ వాట్సాప్‌కి పోటీగా యాపిల్ కొత్త యాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో రావడం విశేషం. 9to5Mac, బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్స్ ప్రకారం, యాపిల్ త్వరలోనే ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఈవెంట్ ఇన్విటేషన్స్ కోసం ఒక యాప్‌ను తీసుకురానుంది.

మీటింగ్స్, పార్టీలు లేదా ఇతర గెట్-టుగెదర్‌లకు ఇన్వైట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో యాపిల్ ఈ కొత్త యాప్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వాట్సాప్ లో ఈ ఫీచర్ వచ్చాక యాపిల్ ఫీచర్‌ని యూజర్లు ఉపయోగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

* మరో ఫీచర్

వాట్సాప్‌లో వ్యూ వన్స్ మీడియా ఫీచర్ ఇప్పటివరకు కేవలం ప్రైమరీ డివైస్‌లో మాత్రమే పనిచేసేది. లింక్డ్ డివైస్‌లలో వ్యూ వన్స్ మీడియాను ఓపెన్ చేయడానికి వీలుండేది కాదు. కానీ, మెటా సంస్థ తీసుకొస్తున్న కొత్త అప్‌డేట్‌తో యూజర్లు లింక్డ్ డివైజ్‌లైన పీసీలు, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు లేదా సెకండరీ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా "వ్యూ వన్స్" మీడియాను చూడొచ్చు.

ఈ అప్‌డేట్ ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్ 2.25.3.7 వాడుతున్న కొంతమంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఇంతకుముందు లింక్డ్ డివైజ్‌లో వ్యూ వన్స్ మీడియాను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, "వెయిటింగ్ ఫర్ దిస్ మెసేజ్. దిస్ మే టేక్ ఎ వైల్" అని మెసేజ్ వచ్చేది. కొత్త ఫీచర్‌తో ఈ సమస్య తొలగిపోతుంది.

ఈ ఫీచర్లు రిలీజ్ డేట్ గురించి వాట్సాప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బీటా యూజర్లతో టెస్టింగ్ జరుగుతోంది. వాట్సాప్ యాప్ స్టోర్, ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, కానీ బీటా వెర్షన్ మాత్రం టెస్ట్‌ఫ్లైట్ ద్వారా సెలెక్ట్ చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
WhatsApp is expanding its event scheduling feature to private chats, allowing users to plan meetings, set reminders, and add locations or call links directly within one-on-one conversations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X