2017 బెస్ట్ యాప్ బుక్ మై షో!

Posted By: Madhavi Lagishetty

సినిమా టిక్కెట్ కోసం ఆన్ లైన్ బుకింగ్ అనగానే ఠక్కున గుర్తుకువచ్చేది బుక్ మై షో. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని సినిమా టిక్కెట్లు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సినిమాలతోపాటు ప్రోకబడ్డీ, ఐపీఎస్ ఇలాంటి వాటికి కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆన్ లైన్ ఎంటర్ టైన్మెంట్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం బుక్ మై షో గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో 2017 సంవత్సరానికి బెస్ట్ యాప్స్ లో ఒకటిగా నిలిచింది.

 2017 బెస్ట్ యాప్ బుక్ మై షో!

బుక్ మై షో డైరెక్టర్, పరిక్షిత్ డార్ మాట్లాడుతూ...బుక్ మై షో అనేది ఒక సింపుల్ ప్రొడక్ట్, వినియోగదారులు ఎంటర్ టైన్మెంట్ ఎక్స్ పీరియన్స్ అనుభవాలకు సంబంధించి సింపుల్ సొల్యూషన్ అందిస్తుంది. మా వినియోగదారుల కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంచడమే ఇందుకు కారణం. ఈ సంవత్సరానికి బెస్ట్ యాప్స్ లో ఒకటిగా బుక్ మై షోను గూగుల్, యాపిల్ వంటివి గుర్తించడం సంతోషంగా ఉందన్నారు.

బుక్ మై షో ( యాప్స్ మరియు మొబైల్ వెబ్) మొబైల్ విధానంతో మొత్తం లావాదేవీల్లో 75శాతం పై ట్రాన్స్ జక్షన్స్ జరిగాయి. యాపిల్ యొక్క యాప్ స్టోర్లో బుక్ మైక్ షో సంవత్సరపు ట్రెండ్స్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో 2017 జాబితాలో బెస్ట్ గా నిలిచింది. ఇది యాప్ స్టోర్ ఎడిటర్స్, మోస్ట్ డౌన్ లోడ్ గేమ్స్ మరియు యాప్స్, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన అంశంగా రూపొందించబడింది. బుక్ మై షో ఒక యాప్ లాగే గుర్తింపు పొందింది. ఇది ప్రతిరోజూ టైం సేవింగ్ పర్సనల్ సర్వీసును రూపొందించడానికి సహాయపడుతుంది.

గూగుల్ మ్యాప్‌లో మరో పవర్ పుల్ ఫీచర్ !

బుక్ మై షో ముంబైలోని ఎడ్ షెరాన్ లైవ్ వంటి మెగా కచేరి కోసం ఒకే సమయంలో వేలకొద్దీ బుకింగ్స్ రిక్వెస్టులు నిర్వహించింది. 48నిమిషాల వ్యవధిలో వేలాది సంఖ్యలో టిక్కెట్లు విక్రయించబడ్డాయి.

బుక్ మై షో వీడియో మరియు ఆడియో కంటెంట్ ద్వారా బుక్ మై షోలో హెస్ట్ ద్వారా వారితో వినియోగదారుల పోస్ట్ కొనుగోలు ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరించింది. కొత్త ఫిల్లర్లు మరియు మెరుగైన సెర్చ్ ఆప్షన్, ఆవిష్కరణ కూడా ఈజీగా మారింది. టిక్కెట్ యాప్ దాని ఫ్లాట్ ఫాంలో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ద్రుష్టి సారించింది.

కొన్ని ప్రధాన ఆవిష్కరణలు జ్యూక్ బాక్స్ , బుక్ మై షో యొక్క ఆడియో ఎంటర్ టైన్మెంట్ సర్వీసు యొక్క రోల్ అవుట్ ను కలిగి ఉన్నాయి. బిజినెస్ ఫైలెట్ కోసం వాట్సప్ లో భాగమైన మొట్టమొదటి భారతీయ ఎంటర్ టైన్మెంట్ ప్లేయర్ గా పేరుగాంచింది. ఇందులో వాట్సప్ smsను టిక్కెట్ గా నిర్దారించుకోవచ్చు. మొత్తం 8 ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

English summary
BookMyShow, with its mobile-first approach, continues to drive over 75 percent of total transactions through mobile (apps and mobile web).
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot