గ్లాన్స్ తో స్మార్ట్‌ఫోన్‌ లాక్ స్క్రీన్‌ వింత అనుభవం

|

స్మార్ట్‌ఫోన్‌లు క్రమంగా మల్టీమీడియా వినియోగానికి మరింత చెరువుతున్నాయి. ఇప్పుడు ఇవి వన్-స్టాప్ పరిష్కారంగా కూడా మారుతున్నాయి. ఇవి ముఖ్యంగా ప్రపంచంతో సంభాషించే విధానాన్ని మారుస్తాయి. వాటిలో వార్తలు, వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు వంటివే కాకుండా మరేదైనా డిజిటల్ సమాచారం కోసం ఎక్కువ ట్యాప్ లు ఉపయోగించనవసరం లేదు.

అన్‌లాక్

మీరు మీ హ్యాండ్‌సెట్‌ను అన్‌లాక్ చేసిఉన్నపుడు ఏదైనా నిర్దిష్ట సమాచారం కోసం శోధించినప్పుడు మాత్రమే డిజిటల్ తలుపు తెరుచుకుంటుంది. లేకపోతే లాక్ చేయబడిన స్థితిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను చాలా పరిమిత ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

 

ఈ యాప్ లతో జాగ్రత్త!! వెంటనే డెలిట్ చేయండి....ఈ యాప్ లతో జాగ్రత్త!! వెంటనే డెలిట్ చేయండి....

లాక్ స్క్రీన్ సర్వీస్ గ్లాన్స్

ఆండ్రాయిడ్ AI- శక్తితో పనిచేసే లాక్ స్క్రీన్ సర్వీస్ గ్లాన్స్ ఏదైనా చిత్రం రూపంలో వస్తుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో అంతర్నిర్మిత ఈ సర్వీస్ మీ ఫోన్ యొక్క లాక్ స్క్రీన్‌ను ఆసక్తికరమైన కంటెంట్ ను స్థిరమైన ఫోటో ఫీచర్ గా మారుస్తుంది. గ్లాన్స్ మీ లాక్ స్క్రీన్‌ను విజువల్ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌గా మార్చడం ద్వారా వార్తలు, వీడియోలు, టీవీ సిరీస్‌లు వంటి విభిన్నమైన కంటెంట్‌ను కలిగి ఉంటాయి.

 

అమెజాన్ లో RS.700 లోపు కొనుగోలు చేయగల స్మార్ట్-హోమ్ గాడ్జెట్లుఅమెజాన్ లో RS.700 లోపు కొనుగోలు చేయగల స్మార్ట్-హోమ్ గాడ్జెట్లు

శామ్సంగ్ మరియు షియోమి
 

లాక్ స్క్రీన్‌పై అధిక-నాణ్యత సమాచారాన్ని ప్రదర్శించడం కోసం గ్లాన్స్ సహకరిస్తుంది. ఇది కంటెంట్ యొక్క నాణ్యతను ఆకర్షిస్తుంది కాబట్టి శామ్సంగ్ మరియు షియోమి వంటి అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో గ్లాన్స్ ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. గ్లాన్స్ ను ప్రారంభించడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు.ఇది ఫోన్ లో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది.

 

సెట్-టాప్ బాక్స్‌ల ధరను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీసెట్-టాప్ బాక్స్‌ల ధరను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ

హై-రిజల్యూషన్ ఇమేజ్

ప్రతి గ్లాన్స్ అందమైన హై-రిజల్యూషన్ ఇమేజ్ మరియు హెడ్‌లైన్ కలయికతో వస్తుంది. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు మీ వద్ద ఉన్న లేదా ఎవరి వద్ద ఉన్న శామ్‌సంగ్ ఫోన్‌లో మరియు షియోమి ఫోన్‌లో ఒకసారి స్వైప్ చేయండి పూర్తి సమాచారం దొరుకుతుంది.

 

జియో 4K STBకు పోటీగా డిష్ టీవీ కొత్త SMRT కిట్‌,ఆండ్రాయిడ్ టివి STBజియో 4K STBకు పోటీగా డిష్ టీవీ కొత్త SMRT కిట్‌,ఆండ్రాయిడ్ టివి STB

గ్లాన్స్ కార్డులు

ఆసక్తిగల పాఠకులు గ్లాన్స్ లో చదవడానికి ఆసక్తికరమైన కంటెంట్‌ను కనుగొనగలిగినప్పటికీ చాలా గ్లాన్స్ కార్డులు మిమ్మల్ని వినోదాత్మకంగా మరియు సమాచార వీడియో కంటెంట్‌కు తీసుకువెళతాయి. ప్రతి గ్లాన్స్ తో క్రొత్త విషయం తెలుసుకోవడం కంటే మంచిది ఏమున్నది?. మీరు కొన్ని విభిన్న కంటెంట్‌ను కొన్ని సమూహల ద్వారా కూడా బ్రౌజ్ చేయవచ్చు. సంక్షిప్తంగా గ్లాన్స్ ఒకే సమయంలో సమాచారాన్ని అందించడంతో పాటు వినోదం కూడా ఇస్తుంది.

 

ఏయే దేశాల్లో ఏ స్మార్ట్‌ఫోన్ నంబర్ 1 స్థానంలో ఉంది ?ఏయే దేశాల్లో ఏ స్మార్ట్‌ఫోన్ నంబర్ 1 స్థానంలో ఉంది ?

కంటెంట్‌

మీ లాక్ స్క్రీన్‌లో మీరు చూసే కంటెంట్‌ను కస్టమైజ్ కూడా చేయవచ్చు. గ్లాన్స్ లో మీరు ఎంచుకోగల 19+ కంటెంట్ జాబితా కూడా ఉన్నాయి. మీరు గేమ్స్ యొక్క సమాచారం నిరంతరం చూస్తూ ఉంటే కనుక గేమ్స్ ఆప్షన్ మీకు సరైన ఎంపికగా ఉంటుంది. అదేవిధంగా వన్యప్రాణులు మరియు వివిధ జంతువుల గురించి పూర్తి సమాచారాన్ని కూడా పొందవచ్చు. మరోవైపు జీవనశైలి, వినోదం మరియు ఫ్యాషన్, గ్లామర్, మూవీస్ వంటి విషయాల సరికొత్త సమాచారం తెల్సుకోవచ్చు. మీకు నచ్చిన అంశాలను ఎంచుకున్న తర్వాత AI మద్దతుగల సాంకేతిక పరిజ్ఞానం మరియు మానవ క్యూరేషన్‌ను ఉపయోగించి కంటెంట్ మీకు చూపుతుంది.

లాక్ స్క్రీన్‌

మీ ఆసక్తి విషయాల ఆధారంగా గ్లాన్స్ మీ కోసం వ్యక్తిగతీకరించిన లాక్ స్క్రీన్‌ను సృష్టిస్తాయి. బిజీగా ఉన్న రోజులో కంటెంట్‌ను వినియోగించడం మీకు సులభతరం చేయడానికి అత్యంత నాణ్యతమైన దృశ్యమానంగా ప్రదర్శించబడుతుంది. అంతేకాకుండా మీ ఫోన్ లాక్ స్క్రీన్‌లోనే ఉన్నపుడు కొన్ని ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన సమాచారం పొందవచ్చు. మీరు వీటి కోసం మరింత సెర్చ్ చేయడం లేదా బ్రౌజ్ చేయవలసిన అవసరం లేదు.

గ్లాన్స్

మొత్తంమీద గ్లాన్స్ మన ఫోన్లలోని కంటెంట్‌ను వినియోగించే విధానాన్ని మారుస్తాయి. ఇది మీ ఫోన్‌ను ఆన్ చేసిన ప్రతిసారీ క్రొత్త ఇమేజ్ ను చూపించడం ద్వారా ఫోన్ యొక్క నిస్తేజమైన లాక్ స్క్రీన్‌ను చాలా ఎక్కువ చేస్తుంది. మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఇది అద్భుతమైన
అనుభవాన్ని అందిస్తుంది. అన్ని షియోమి డివైస్ లు, శామ్‌సంగ్ A,M మరియు J సిరీస్‌ ఫోన్లలో ఈ గ్లాన్స్ ఫీచర్స్ ముందే ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.

Best Mobiles in India

English summary
Bring life to your lock screen with Glance

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X