విదేశాల్లో ఉన్నవారికి బీఎస్‌ఎన్‌ఎల్ తీపికబురు
విదేశాల్లో ఉన్నవారికి బీఎస్‌ఎన్‌ఎల్ తీపికబురు అందించింది. ఇప్పటిదాకా అక్కడి నుంచి ఎవరైనా ఇండియాకు ఫోన్ చేయాలంటే ఐఎస్‌డి ఛార్జీల మోతమోగేది. అయితే ఇప్పుడు అటువంటి ఛార్జీల మోత లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది . బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా రూపొందించిన యాప్‌తో ఐఎస్‌డీ చార్జీల మోత తగ్గనుంది.
Read more: రూ.149కే ఇంటర్నెట్ కనెక్షన్!

ఇకపై కేవలం నెలవారీ చార్జీలతో ప్రపంచంలో ఎక్కడినుంచైనా భారత్‌లోని బంధువులతో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ రెండో తేదీ నుంచి ఫిక్స్‌డ్ మొబైల్ టెలిఫోనీ (ఎఫ్‌ఎంటీ)ని ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా యాప్‌ను విడుదల చేసింది. విదేశాల్లోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ను ఈ యాప్ ద్వారా వారి ల్యాండ్‌లైన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.
Read more : పనికిరాని వస్తువులతో సరికొత్త టెక్నాలజీ

దాని ద్వారా భారతదేశంలోని ఫోన్లకు కాల్స్ చేసుకోవచ్చు. దీంతో ఐఎస్‌డీ బిల్లు నిరోధించుకోవచ్చు. కేవలం నెలవారీ చార్జీలను మాత్రమే వసూలు చేస్తారు. ఈ సంధర్భంగా మొబైల్లో బిఎస్‌ఎన్‌ఎల్ డేటాను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

1
ఇంటర్నెట్ బ్యాలన్స్ అలాగే వ్యాలిడిటీ కోసం *234# ఈ నంబర్‌కి డయల్ చేయండి

2
చివరి ట్రాన్సక్షన్ వివరాల కోసం *102# ను డయల్ చేయండి.

3
ఎసెమ్మెస్ బ్యాలన్స్ చెక్ కోసం *125# ను డయల్ చేయండి

4
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం *124# ను డయల్ చేయండి (ఎంక్వయిరీ)

5
బీఎస్‌ఎన్‌ఎల్ యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








