Home
Apps

డాక్యుమెంట్ స్కానింగ్ కోసం బెస్ట్ యాప్ లు ఇవే....

కామ్‌స్కానర్ అనేది ఏదైనా డాక్యుమెంట్లను సులభంగా స్కాన్ చేయడానికి ఉపయోగించే యాప్. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇండియాలో చైనా కంపెనీల నుండి వచ్చిన 58 యాప్ లను నిషేధించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ జాబితాలో టిక్‌టాక్ వంటి వాటిని గూగుల్ ప్లే మరియు ఆపిల్ యాప్ స్టోర్ నుండి తొలగించారు. కాని కామ్‌స్కానర్ ఇప్పటికీ ఈ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఏదేమైనా ఇది ఇప్పుడు దేశంలో నిషేధించిన వాటి పరిగణనలోకి వచ్చింది.

కామ్‌స్కానర్‌ ప్రత్యామ్నాయ యాప్ లు

కామ్‌స్కానర్‌ ప్రత్యామ్నాయ యాప్ లు

కామ్‌స్కానర్‌ను అధికంగా ఉపయోగించే వారు ఇకమీదట దీనిని ఉపయోగించడం కుదరదు. , మీకు బహుశా భర్తీ అవసరం. కానీ యాప్ స్టోర్లలో దీనికి ప్రత్యామ్నాయ స్కానర్ యాప్ లు ఉన్నాయి. కామ్‌స్కానర్ ప్రత్యామ్నాయ జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అడోబ్ స్కాన్

అడోబ్ స్కాన్

కామ్‌స్కానర్ యొక్క ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తునప్పుడు మొదట గుర్తుకు వచ్చే యాప్ అడోబ్ స్కాన్. ఇది దీని యొక్క పేరును సూచించినట్లుగా అడోబ్ సంస్థ దీనిని తయారుచేసింది. ఇది అడోబ్ డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ ఫీచర్ల సమ్మేళనంతో లభిస్తుంది.

 

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్

మైక్రోసాఫ్ట్ సంస్థ అభివృద్ధి చేసిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లెన్స్ యాప్ కామ్‌స్కానర్కు మరొక ప్రత్యామ్నాయం. ఇది గొప్ప ఫీచర్లను కలిగి ఉండి అప్లికేషన్ వంటి అన్ని రకాల డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి మరియు వాటిని నేరుగా మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా పవర్ పాయింట్‌కు ఎక్సపోర్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టంలో ఇప్పటికే ఉన్నవారికి ఈ యాప్ మరింత మెరుగ్గా పనిచేస్తుంది.

ఫోటోస్కాన్ యాప్

ఫోటోస్కాన్ యాప్

గూగుల్ సంస్థ అభివృద్ధి చేసిన ఫోటోస్కాన్ యాప్ డాక్యుమెంట్లను స్కాన్ చేయడానికి మాత్రమే కాకుండా మీరు ప్రింట్ చేసిన ఫోటోలను స్కాన్ చేసి డిజిటల్ కాపీలుగా సేవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫోటోస్కాన్ ఫీజికల్ ఫోటోల నుండి డిజిటల్ ఫోటోలను సృష్టించడంలో చాలా మెరుగ్గా ఉంటుంది. అలాగే ఫోటోను క్రాప్ కూడా సొంతంగా చేస్తుంది.

ట్యాప్‌స్కానర్ యాప్

ట్యాప్‌స్కానర్ యాప్

కామ్‌స్కానర్ యాప్ కి ప్రత్యామ్నాయ యాప్ లలో ట్యాప్‌స్కానర్ ఒక మంచి ఎంపిక. ఈ యాప్ యొక్క ప్రత్యేకమైన విషయం ఏమిటంటే స్కాన్ చేసిన వాటి నుండి వివరణాత్మక డాక్యుమెంట్లను సృష్టించడానికి బహుళ ఫోటోలను కూడా అనుమతిస్తుంది. మీరు స్కాన్ చేసిన కాపీలను అనేక ఫార్మాట్లలో ఎగుమతి చేయవచ్చు మరియు వాటిని క్లౌడ్‌కు అప్‌లోడ్ చేయవచ్చు.

TurboScan యాప్

TurboScan యాప్

అధికంగా కామ్‌స్కానర్ ను ఉపయోగించడం అలవాటు అయిన వారికి దాని యొక్క సామర్థ్యంతో ఉన్న టర్బోస్కాన్ దాదాపు అన్ని పనులను చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ యాప్ ఆటో ఎడ్జ్ డిటెక్షన్, మల్టిపుల్ స్కానింగ్ వంటి మరిన్ని ఫీచర్‌లతో పాటు మెరుగైన స్కాన్ చేసిన కాపీలను సృష్టించే షార్పింగ్ మోడ్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
CamScanner Alternative Apps List are Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X