భీమ్ లావాదేవీలకు బంపరాఫర్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Written By:

డిజిటల్ లావాదేవీలను పెంచాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మొబైల్ చెల్లింపులు యాప్ భారత్ ఇంటర్‌పేస్ ఫర్ మొబైల్స్ (భీమ్-BHIM)ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. యూపీఐ విధానం ద్వారా పని చేసే ఈ యాప్‌లో గతంతో పోలిస్తే ప్రస్తుతం జరుపుతున్న లావాదేవీల శాతం ఒక అంకెకు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్యాష్ బ్యాక్‌లు, ప్రోత్సాహకాలతో దూసుకుపోతున్న తేజ్, ఫోన్ పే, పేటీఎంల మాదిరిగానే వినియోగదారులకు క్యాష్ బ్యాక్‌లు, ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఆఫర్లు అందించనుంది.

భీమ్ లావాదేవీలకు బంపరాఫర్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్‌ చేసిన ప్రభుత్వ యాప్‌ భీమ్‌ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్‌ అఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా ​గూగుల్ తేజ్, ఫ్లిప్‌కార్ట్‌ ఫోన్ పే మార్కెటింగ్ వ్యూహాలను ఫాలో అవుతూ ఇపుడు భీమ్‌ యాప్‌ ద్వారా కూడా ఆఫర్ల వెల్లువ కురిపించేందుకు తద్వారా వినియోగదారులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది.

2016 డిసెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భీమ్‌ యాప్‌ ద్వారా అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్‌ 14నుంచి క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అమలు చేయనుంది. సుమారు రూ.900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. నోట్ల రద్దు తరువాత డిజిటల్‌ లావాదేవీలపై దృష్టిపెట్టిన కేంద్రం గూగుల్‌ తేజ్‌, ఫోన్‌పే లావాదేవీలు పెరగడం, ఇటు భీమ్‌ యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు గణనీయంగా(సింగిల్‌ డిజిట్‌కు) పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇకపై ఫేస్‌బుక్‌లో ఇవి చేయడం కష్టం, జుకర్‌బర్గ్ కీలకమైన చర్యలు !

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు
భీమ్‌ యాప్‌ ద్వారా తొలి లావాదేవీ జరిపినప్పుడు (కనీస మొత్తం రూ.100కి) రూ.51 క్యాష్‌ బ్యాక్‌ లభ్యం. ఇలా వినియోగదారులకు గరిష‍్టంగా రూ.750 క్యాష్‌ బ్యాక్‌ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే మొత్తంగా ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం. కాగా భీమ్‌ యాప్‌ ద్వారా ఆఫర్లను మొదటిసారి కాదు. గత ఏడాది కూడా, ప్రభుత్వం రెండు కొత్త పథకాలను లాంచ్‌ చేసింది. భీమ్‌ రిఫరల్ బోనస్ స్కీమ్, భీమ్‌ మర్చంట్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను ప్రకటించి.. బహుమతులను అందించిన సంగతి తెలిసిందే.

English summary
Cashbacks & incentives: Govt to take cues from rivals to popularise BHIM More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot