మీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

Written By:

కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్‌ల‌లో జంక్ ఫైళ్ల‌ను, బ్రౌజ‌ర్ హిస్ట‌రీల‌ను, క్యాషే ఫైళ్ల‌ను, కుకీల‌ను డిలీట్ చేసేందుకు ఎక్కువ మంది ఉపయోగించే సీక్లీన‌ర్ సాఫ్ట్‌వేర్ హ్యాక‌ర్ల దాడికి గురైంది.

జియోపై కసి: రూ. 32,000 కోట్లతో Airtel భారీ స్కెచ్

మీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

గ‌త ఆగ‌స్టులో విడుద‌ల చేసిన వెర్ష‌న్ 5.33.6162, సీక్లీన‌ర్ క్లౌడ్ వెర్ష‌న్ 1.07.3191 సాఫ్ట్‌వేర్ల మీద హ్యాక‌ర్లు దాడి చేసిన‌ట్లు సీక్లీన‌ర్ మాతృ సంస్థ పిరిఫార్మ్ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం సీక్లీన‌ర్ అప్‌డేట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న అవాస్ట్ కంపెనీ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

ఈ ఏడు ఫీచర్లు లేని ఆండ్రాయిడ్ ఫోన్ కొనకండి !

మీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ఈ రెండు వెర్ష‌న్ల‌ను ఇప్ప‌టికి 2.27 మిలియ‌న్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే హ్యాక్‌కి గురైంద‌న్న సంగ‌తి తెలిసిన వెంట‌నే అప్‌డేట్‌ను ఆపేసిన‌ట్లు అవాస్ట్ తెలిపింది. అలాగే కొత్త వెర్షన్‌ను కూడా డౌన్‌లోడ్‌కి సిద్ధంగా ఉంచిన‌ట్లు కంపెనీ తెలిపింది.

తక్కువ ధరకే షియోమి Redmi Note 5A కొత్త వెర్షన్‌ !

మీ మొబైల్‌లో ఈ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ప్ర‌స్తుతం వినియోగ‌దారులంద‌రూ పాత సీక్లీన‌ర్ వెర్ష‌న్‌ని డిలీట్ చేసి, కొత్త‌ది ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని సూచించింది. అయితే హ్యాక్ కు గురైన వెర్ష‌న్ల వ‌ల్ల ప్ర‌మాదం ఎదురైన‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని పేర్కొంది. హ్యాక‌ర్లు కేవ‌లం వినియోగ‌దారుల వివ‌రాలు మాత్ర‌మే సేక‌రించి ఉంటార‌ని వారు చెబుతున్నారు.

English summary
CCleaner gets hit by a nasty malware infection Read more at gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting