ఇదుగోండి మొట్టమొదటి fidget spinner మొబైల్ ఫోన్
హాంకాంగ్ చెందిన చిల్లీ ఇంటర్నేషనల్ హోల్డింగ్ (హెచ్‌కే) లిమిటెడ్ ప్రపంచపు మొట్టమొదటి fidget spinner మొబైల్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. K188 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఫిడ్జెట్ స్పిన్నర్ షేపులో ఉంటుంది. ఈ ఫోన్‌తో పాటు F05 పేరుతో మరోక ఫోన్ కూడా కంపెనీ లాంచ్ చేసింది. A-GPS టెక్నాలజీతో లాంచ్ అయిన మొట్టమొదటి ఫీచర్ ఫోన్ కూడా ఇదే కావటం విశేషం.

ఈ రెండు ఫోన్‌లను అమెజాన్ ఇండియాతో పాటు ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్ ఇంకా పేటీఎమ్‌లు విక్రయంచబోతున్నాయి. ఇటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. రిటైల్ మార్కెట్లో K188 మోడల్ ధర రూ.1200 నుంచి రూ.1300 మధ్య ఉంటుంది. F05 మోడల్ ధర రూ.1500 నుంచి రూ.1700 మధ్య ఉంటుంది.
ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి.. K188 మోడల్ 32MB ర్యామ్ ఇంకా 32MB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఇమేజెస్, వీడియో, మ్యూజిక్ సపోర్ట్ వంటి మల్టీ మీడియా ఫీచర్లతో పాటు ఇంటర్నెట్ కనెక్టువిటీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

ఈ స్ట్రెస్ బస్టర్ పోన్‌ను ఫిడ్జెట్ స్పిన్నర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌కు బ్లుటూత్ డివైస్‌గా కూడా ఈ సెకండరీ ఫోన్ ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ మొత్తం 6 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. రోజ్ గోల్డ్, గోల్డ్, సిల్వర్, బ్లాక్, బ్లూ, రెడ్.
మరో ఫీచర్ ఫోన్ F05కు A-GPS టెక్నాలజీ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఏ-జీపీఎస్ టెక్నాలజీని వినియోగించటం వల్ల ఫోన్ ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది. BT dialer ఫెసిలిటీతో వస్తోన్న ఈ ఫీచర్ ఫోన్ వాట్సాప్ మెసేజింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో రెండు నెట్‌వర్క్‌లను రన్ చేసుకోవచ్చు.

మార్కెట్లో సందడి చేస్తోన్న కొత్త గాడ్జెట్‌లలో fidget spinner ఒకటి. ఈ ఆట వస్తువు ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా కనిపిస్తోంది. స్టైల్ కోసం కొందరు, ఒత్తిడిని తగ్గించుకునేందుకు మరి కొందరు ఈ డివైస్‌ను ట్రై చేస్తున్నారు. సరిగ్గా చేతి వేళ్ల మధ్య ఇమిడిపోయే ఈ స్పిన్నర్ డివైస్ ఒక్కసారి తిప్పగానే కొన్ని నిమిషాల పాటు అలా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఉండటమే ఫిడ్జెట్ స్పిన్నర్ అసలు స్పెషాలిటీ.
1993లో ఆవిష్కరించబడిన ఈ డివైస్‌కు ఇటీవల కాలంలో భాగా క్రేజ్ ఏర్పడింది. అల్లు అర్జున్ రీసెంట్ మూవీ డీజేతో ఈ స్పిన్నర్ డివైస్‌కు తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయ్యింది. fidget spinner డివైస్ లను రకరకాలు ఆకృతులలో డిజైన్ చేస్తున్నారు. ప్రతి దుకాణంలో ఇవి లభ్యమవుతున్నాయి.
స్ట్రెస్ బస్టర్‌గా పిలవబడుతోన్న ఈ ఫిడ్జెట్ స్పిన్నర్ వల్ల ఎంతకొంత ఒత్తిడిని నివారించుకోగలుగుతున్నామని పలువురు అభిప్రాయపడుతున్నారు. చేతివేళ్లతో ఈ స్పిన్నర్‌ను తిప్పుతున్నప్పుడు కొత్త ఫీలింగ్ కలుగుతుందని మరికొందరు చెబుతున్నారు. అయితే సైకాలిజిస్టుల వాదన మాత్రం మరోలా ఉంది. ఈ
డివైస్‌ను కేవలం ఆట వస్తువులా మాత్రమే చూడాలని, దీని వల్ల టైంపాస్ అవటం తప్పితే ఒత్తిడి తగ్గటం లాంటాది ఉండదని వీరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికి, ప్రస్తుత మార్కెట్లో fidget spinner ఓ హాట్ టాపిక్.


Click it and Unblock the Notifications