ఫోన్ నుంచే మీ పీఎఫ్ డ్రా !

Written By:

ఇకపై మీ ఫోన్ ద్వారానే పీఎఫ్ క్లయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ ని తీసుకురానుంది. సుమారు నాలుగు కోట్ల మంది రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ మేరకు సన్నాహాలు చేస్తుంది. ఈపీఎఫ్ విత్ డ్రాయల్ వంటి పీఎఫ్ క్లయిమ్స్ ను మొబైల్ అప్లికేషన్ యుమాంగ్ ద్వారానే సెటిల్ చేసుకునేలా త్వరలోనే లాంచ్ చేయబోతుంది. ఆన్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరించి, ఆన్ లైన్ ద్వారానే క్లయిమ్స్ సెటిల్ చేసుకునే ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ లోక్ సభకు తెలిపారు.

నెలకి 300జిబి డేటా, BSNL మరో సంచలనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎప్పుడు లాంచ్ చేయాలో ఇంకా తేదీలను

యూనిఫైడ్ మొబైల్ యాప్ తో ఇది ఇంటిగ్రేట్ అయి ఉంటుందని, ఆన్ లైన్ లోనే క్లయిమ్స్ ను స్వీకరించి, ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. అయితే ఎప్పుడు లాంచ్ చేయాలో ఇంకా తేదీలను ఖరారు చేయలేదని తెలిపారు.

సెంట్రల్ సర్వర్ తో అన్ని రీజనల్ ఆఫీసులను కనెక్ట్ చేయడానికి

అయితే ఈ సేవలను ప్రారంభించడానికి సెంట్రల్ సర్వర్ తో అన్ని రీజనల్ ఆఫీసులను కనెక్ట్ చేయడానికి ఇంకా కొంత సాంకేతికత అవసరమని ఈపీఎఫ్ఓ ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటికే కొన్ని రీజనల్ ఆఫీసులను సెంట్రల్ సర్వర్ తో అనుసంధానించిన్నట్టు తెలిపారు.

అప్లికేషన్ దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే

అప్లికేషన్ దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే పీఎఫ్ క్లయిమ్స్ చేపట్టే లక్ష్యంతో ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నామని ఈపీఎఫ్ఓ చెప్పింది.

పీఎఫ్‌ క్లయిమ్స్ పూర్తికావడానికి 20 రోజుల వరకు సమయం

ప్రస్తుతం పీఎఫ్‌ క్లయిమ్స్ పూర్తికావడానికి 20 రోజుల వరకు సమయం పడుతుంది. ఈపీఎఫ్ విత్ డ్రాయల్స్ కోసం రోజుకు దాదాపు కోటి అప్లికేషన్లు వస్తుంటాయి.

ఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి

ఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coming soon: Settle PF claims on your phone through mobile app UMANG
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot