మెసేంజర్ వాడుతున్నారా, అయితే ఈ డేంజర్ ఫైల్‌ వస్తే ఓపెన్ చేయకండి !

Written By:

ఆండ్రాయిడ్ సీ ప్లాట్‌ఫాంలపై ఫేస్‌బుక్ మెసెంజర్‌ను వాడుతున్న యూజర్లను ఇప్పుడు కొత్తగా ఓ వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ యాప్‌లో క్రిప్టో కరెన్సీ మైనింగ్ మాల్‌వేర్ వ్యాప్తి చెందుతున్నదని వార్తలు వస్తున్నాయి. ఓ మాల్ వేర్ వైరస్ ఓ జిప్ ఫైల్ ద్వారా వ్యాప్తి చెందుతోందని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

జియో కొత్తగా అప్‌డేట్ చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

video_xxxx.zip అనే ఫైల్ ద్వారా..

డిగ్‌మైన్ గా పిలవబడుతున్న ఈ మాల్‌వేర్ వైరస్ video_xxxx.zip అనే ఫైల్ ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు నిర్దారించాయి.

మెసెంజర్‌లో ఏవైనా ఫైల్స్ వస్తే ..

దీని పేరిట మెసెంజర్‌లో ఏవైనా ఫైల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్ లేదా కంప్యూటర్లకు వైరస్ వ్యాప్తి చెందుతుందని వారు చెబుతున్నారు.

మాల్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉన్నామని..

అయితే ఈ డిగ్‌మైన్ మాల్‌వేర్ పట్ల ఫేస్‌బుక్ యాజమాన్యం కూడా స్పందించింది. ఈ మాల్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉన్నామని తమ యూజర్ల సెక్యూరిటీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌తో..

యూజర్లు ఎవరైనా తమ డివైస్‌లకు వైరస్ వచ్చినట్టు అనిపిస్తే వెంటనే తాము అందిస్తున్న ఉచిత యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌తో స్కాన్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది.

విస్తరించే అవకాశం..

కాగా ఈ వైరస్ ఇప్పటికే సౌత్ కొరియా, వియత్నాం, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వెనెజులా దేశాల్లో వ్యాప్తి చెందిందని, త్వరలో మిగిలిన దేశాలకు విస్తరించే అవకాశం ఉందని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెసెంజర్‌లో..

కనుక మెసెంజర్‌లో పైన చెప్పిన విధంగా ఏదైనా ఫైల్ పేరిట మెసేజ్‌లు వస్తే వాటిని ఓపెన్ చేయకండి. లేదంటే వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cryptocurrency-Mining Malware Targets Facebook Messenger Users Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot