Home
Apps

గూగుల్ ప్లే స్టోర్ లో అత్యంత ప్రమాదకరమైన యాప్స్ ఇవే....

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది యాప్స్ వైపు..గూగుల్ ప్లే స్టోర్‌లో ఆసక్తిగా ఏ యాప్ కనిపించినా వెంటనే డౌన్‌లోడ్ చేస్తారు.

By Anil

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది యాప్స్ వైపు..గూగుల్ ప్లే స్టోర్‌లో ఆసక్తిగా ఏ యాప్ కనిపించినా వెంటనే డౌన్‌లోడ్ చేస్తారు. అయితే ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ప్రముఖ antivirus సంస్థ Eset లాంటి అప్లికేషన్స్ తాజాగా ఈ విషయాన్నీ వెల్లడించింది . గూగుల్ ప్లే స్టోర్ లో గూగుల్ సంస్థ కొన్ని ప్రమాదకరమైన అప్లికేషన్స్ ని దాచి ఉంచినట్టు చెబుతుంది.

Free Daily Horoscope 2019....

Free Daily Horoscope 2019....

Free Daily Horoscope 2019 అనేది గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది. ఇది ఒకసారి మన ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసిన తర్వాత, బ్యాంకింగ్ ట్రోజాన్‌గా పనిచేస్తుంది. మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్‌లు, దొంగతనం చేయటంతో పాటు, మనకు తెలియకుండానే మన ఫోన్ కి వచ్చే OTPలు, smsలు, call logs అన్నింటిని యాక్సెస్ చేస్తూ ఉంటుంది.

ఈ యాప్ ను  డౌన్లోడ్ చేసుకున్నాక....

ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నాక....

ఇది డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. స్క్రీన్ మీద The installed application is incompatible with your phone and has now been removed! అంటూ ఇన్ స్టాల్ అయిన అప్లికేషన్ మీ ఫోన్‌తో కంపాటబుల్ అవకపోవడం వల్ల, దాన్ని తొలగించాం అంటూ మెసేజ్ చూపిస్తుంది. కానీ అది చెప్పినట్లు అది తొలగిపోదు. బ్యాక్ గ్రౌండ్ లో ఎప్పటికప్పుడు రన్ అవుతూ మీ డేటా ని దొంగతనం చేస్తూ ఉంటుంది.

Master Clean – Power Booster, Super Boost Cleaner.....

Master Clean – Power Booster, Super Boost Cleaner.....

అలాగే Master Clean - Power Booster, Super Boost Cleaner అనే మరో రెండు అప్లికేషన్లు మన ఫోన్ పెర్ఫార్మెన్స్ పెంచుతాం అంటూ తప్పుడు ప్రామిస్ చేస్తూ జనాల్ని బురిడీ కొట్టిస్తున్నాయి. ఇవి కూడా ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి.

128 GB RAM Mobile, 32 GB RAM Mobile, 2000 GB RAM Mobile....

128 GB RAM Mobile, 32 GB RAM Mobile, 2000 GB RAM Mobile....

ఇదిలా ఉంటే మన ఫోన్ లోని RAMని పెంచుకోవడానికి సాధ్యపడదు అన్న విషయం చాలా మందికి తెలిసిందే. అయినా కూడా 128 GB RAM Mobile, 32 GB RAM Mobile, 2000 GB RAM Mobile వంటి పేర్లతో నకిలీ అప్లికేషన్లు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపిస్తున్నాయి. ఇది మీ
ర్యామ్ పరిమాణాన్ని పెంచుతాం అంటూ మోసం చేస్తున్నాయి.

ఈ అప్లికేషన్లు భారీ మొత్తంలో వ్యక్తిగత సమాచారాన్ని...

ఈ అప్లికేషన్లు భారీ మొత్తంలో వ్యక్తిగత సమాచారాన్ని...

ఈ అప్లికేషన్లు కూడా ఒకసారి మన ఫోన్ లోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు antivirus సంస్థలు వెల్లడిస్తున్నాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Danger Applications In Google Play Store.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X