Threads App యాజర్లకు షాక్.. పొరపాటున అకౌంట్ డిలీట్ చేస్తే...!!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌కు పోటీగా మెటా సంస్థకు చెందిన Threads యాప్ లాంచ్ అయింది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే సుమారు 70 మిలియన్ల సైన్‌అప్‌లు నమోదు చేసినట్లు మోటా సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. అయితే తొలి నుంచి ఈ యాప్‌కు అనూహ్య స్పందన వచ్చింది.
ట్విట్టర్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో విసుగెత్తిపోయిన చాలా మంది నెటిజన్లు థ్రెడ్స్ యాప్‌ను భారీగా డౌన్‌లోడ్ చేశారు. ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో థ్రెడ్స్ యాప్‌ను కూడా లాగిన్ కావచ్చు మరియు వినియోగించుకోవచ్చు. ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారిని థ్రెడ్స్ యాప్‌లోనూ ఫాలో కావచ్చు.

థ్రెడ్స్ యాప్ సుమారుగా ట్విట్టర్ తరహా ఫీచర్లను కలిగి ఉంది. అయితే కొన్ని అంశాల్లో ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ట్విట్టర్‌లో కేవలం 280 అక్షరాల వరకు మాత్రమే పోస్టు చేయవచ్చు. అదే థ్రెడ్స్‌లో 500 అక్షరాల వరకు పోస్ట్ చేసే అవకాశం ఉంది.
ట్విట్టర్‌లో గరిష్ఠంగా 2 నిమిషాల 20 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను మాత్రమే పోస్టు చేయవచ్చు. అదే థ్రెడ్స్ యాప్‌లో 5 నిమిషాల వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం థ్రెడ్స్‌లో పోస్టులు, ఇతరుల పోస్టులపై కామెంట్లు చేయవచ్చు మరియు రీపోస్టు, లైక్ చేయవచ్చు. అయితే ట్విట్టర్ తరహాలో డెరెక్ట్ మెసేజ్ చేస్ ఆప్షన్ ఇంకా అందుబాటులో లేదు.

అయితే ఇంతవరకు అంతా బాగానే ఉన్న ఓ వార్త థ్రెడ్స్ యూజర్లను షాకింగ్‌కు గురిచేస్తుంది. ఇతర సోషల్ మీడియా యాప్‌ల మాదిరిగా థ్రెడ్స్ అకౌంట్‌ను డిలీట్ చేయలేము. ఒకవేళ డిలీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ అవుతుంది. ఎందుకంటే థ్రెడ్స్ యాప్‌ను ఇన్‌స్టా ఖాతా ఆధారంగా పనిచేస్తుంది. అయితే థ్రెడ్స్ యాప్‌ను డియాక్టివేట్ చేసుకోవచ్చు.
థ్రెడ్స్‌ను ఎలా డియాక్టివేట్ చేయాలి అంటే... ముందుగా థ్రెడ్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ట్యాబ్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ కనిపిస్తున్న టూలైన్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అనంతరం అక్కడ కనిపిస్తున్న అకౌంట్‌పైన క్లిక్ చేయాలి. తర్వాత డియాక్టివేట్ ప్రొఫైల్‌పైన క్లిక్ చేసి థ్రెడ్స్ యాప్‌ను డియాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఇది తాత్కాలిక ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి. మళ్లీ మీ ప్రొఫైల్‌లోకి లాగిన్ కావచ్చు.
దీనిపై ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సేరి స్పందించారు. ఈ పరిస్థితి గురించి మెటా సహా తమకు అవగాహన ఉందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కోసం కృషిచేస్తున్నట్లు చెప్పారు. మరియు కొన్ని అదనపు ఫీచర్లపైన పనిచేస్తున్నట్లు ఆడమ్ మోస్సేరి వెల్లడించారు.
ఇప్పటి వరకు మోటా సంస్థకు చెందిన థ్రెడ్స్ యాప్ సుమారు భారత్ సహా 100కుపైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో మాత్రం ఈ యాప్ ఇంకా విడుదల కాలేదు. ఆయా దేశాల్లో ఉన్న కొత్త చట్టాల కారణంగా విడుదల ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ఆ దేశాల్లో థ్రెడ్స్ యాప్ లాంచ్ లాంచ్ కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications








