ఈ యాప్స్‌తో మీరు పీల్చే గాలి మంచిదో కాదో తెలుసుకోవచ్చు

|

దట్టమైన పొగమంచుకు కాలుష్యం తోడవటంతో ఢిల్లీ వాసులు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీపావళి తరువాత నుంచి దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కొరల్లో కొట్టుమిట్టాడుతోంది. గాలిలోని స్వచ్ఛత శాతం ప్రమాదకార స్థాయికి పడిపోవటంతో ఇక్కడ జనవాసాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం విజృంభిస్తుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

 
ఈ యాప్స్‌తో మీరు పీల్చే గాలి మంచిదో కాదో తెలుసుకోవచ్చు

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థేశించిన సేఫ్టీ లిమిట్‌ను దాటేసి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ కాలుష్య శాతం నమోదవటంతో అత్యవససర పరిస్థితులను విధించాల్సి వస్తోంది. క్వాలిటీ ఇండికేటర్ ప్రకారం గాలిలో పొల్యూషన్ శాతం 100 పాయింట్లు దాటితేనే ప్రమాదకరంగా పరిగణిస్తారు. అలాంటిది ఏకంగా 999 పాయింట్లకు ఢిల్లీ కాలుష్య తీవ్రత చేరకోవటంతో కాలుష్య నియంత్ర మండలి తీవ్ర ఆందోళణ వ్యక్తం చేస్తోంది.

కాలుష్యం నేపథ్యంలో ఇళ్లనుంచి బయటకు వచ్చేందుక ప్రజలు జంకుతున్నారు. ఒకవేళ రావల్సి వస్తే మాస్కులను ధరించి బయటకు వస్తున్నారు. కలుషితమైన గాలిని పీల్చటం వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బయటకు వెళ్లే ముందు ఎయిర్ ప్రొల్యూషన్ చెక్ చేసుకోవటం చాలా ఉత్తమం.

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రాంతానికి సంబంధించిన గాలి స్వచ్ఛత వివరాలను తెలుసుకునే వీలుటుంది. ఎయిర్ పొల్యూషన్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు మీకు అందించే పలు యాప్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎయిర్‌వేదా (Airveda)

ఎయిర్‌వేదా (Airveda)

ఈ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయిే మీ లొకాలిటీకి సంబంధించి రియల్-టైమ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తెలుసుకునే వీలుంటంది. అవుట్‌డోర్ ఎయిర్ క్వాలిటీతో పాట పొల్యూషన్ లెవల్స్‌ను ఈ యాప్ చెక్ చేయగలుగుతుంది. PM2.5 PM10 CO2 ఉష్ణోగ్రతలను చెక్ చేేసుందుకుగాను ఈ యాప్‌ను పోర్టబుల్ ఎయిర్‌వేదా మానిటర్‌లకు కనక్ట్ చేసుకోవచ్చు.

సఫర్-ఎయిర్ (Safar-Air)

సఫర్-ఎయిర్ (Safar-Air)

ఈ మొబైల్ అప్లికేషన్‌ను ప్రత్యేకించి భారతీయుల కోసం అభివృద్ధి చేయటం జరిగింది. సఫర్-ఎయిర్, గాలిలోని స్వచ్ఛతకు సంబంధించి మూడు రోజుల ముందస్తు సూచనలను ఇవ్వగలదు. ఈ రిపోర్టును బట్టి అవుట్ డోర్ ప్రయాణాలను ఖరారు చేసుకోవచ్చు. సఫర్ అప్లికేషన్‌ను మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో పాటు ఇండియా ప్రీమియర్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్, ఐఐటీఎమ్ పూణేలు సంయుక్తంగా అభివృద్థి చేసాయి.

సమీర్ (Sameer)
 

సమీర్ (Sameer)

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అందించే నేషనల్ ఎయిర్ క్వాలిటీ అప్‌డేట్‌లను సమీర్ యాప్ ద్వారా గంటగంటకు తెలుసుకునే వీలుంటుంది. గాలి నాణ్యతకు సంబంధించిన స్టేటస్‌లను ప్రతి ఒక్కరు సులువుగా అర్థం చేసుకునే విధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటాను ప్రొవైడ్ చేస్తుంది. గాలి స్వచ్ఛతకు సంబంధించిన ఫిర్యాదులను కూడా ఈ యాప్ స్వీకరిస్తుంది.

వాట్సప్ నుంచి మరో రెండు కళ్లు చెదిరే ఫీచర్లు వస్తున్నాయ్ !వాట్సప్ నుంచి మరో రెండు కళ్లు చెదిరే ఫీచర్లు వస్తున్నాయ్ !

ప్లూమ్ ఎయిర్ రిపోర్ట్ (Plume Air Report)

ప్లూమ్ ఎయిర్ రిపోర్ట్ (Plume Air Report)

గాలి స్వచ్ఛతకు సంబంధించి విశ్వసనీయమైన అప్‌డేట్‌లను ఈ యాప్ అందిచగలదు. మీమీ పట్టణాల్లో పొల్యూషన్ లెవల్స్‌కు సంబంధించిన వివరాలను ప్లూమ్ ఎయిర్ రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. శాటిలైట్ డేటా ఆధారంగా గాలి నాణ్యతకు సంబంధించి రియల్ టైమ్ సమాచారాన్ని ఈ యాప్ ప్రొవైడ్ చేయగలుగుతుంది.

ఎయిర్ క్వాలిటీ/ఎయిర్‌విజవల్

ఎయిర్ క్వాలిటీ/ఎయిర్‌విజవల్

ఆండ్రాయిడ్ ఆధారిత డివైసుల్లో మాత్రమే పనిచేయగలిగే ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 9,500 నగరాలకు సంబంధించి ఎయిర్ పొల్యూషన్ అప్‌డేట్‌లతో పాటు వాతావరణ సూచనలను జారీ చేస్తుంది. PM2.5, PM10లకు సంబందించిన స్కోర్‌ను గంట గంటకు అప్‌డేట్ చేస్తుంది. ఈ యాప్‌ను విడ్జెట్ క్రింద ఫోన్ హోమ్ స్ర్కీన్ పై యాడ్ చేసుకునే వీలుంటుంది. నెలవారీ ఎయిర్ క్వాలిటీ రిపోర్టుతో పాటు హెల్త్ రికమండేషన్‌లను కూడా ఈ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తుంది.

ఎయిర్‌లెన్స్ డేటా (Airlens Data)

ఎయిర్‌లెన్స్ డేటా (Airlens Data)

మీరు పీలుస్తున్న గాలి నాణ్యమైనదో కాదో తెలుసుకోవాలంటే ఎయిర్‌లెన్స్ డేటా యాప్ మీ ఫోన్‌లో ఉండాల్సిందే. అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి చేయబడిన ఈ అప్లికేషన్, మీ లొకాలిటీలో ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన డేటాను అప్ టు డేట్‌గా ప్రొవైడ్ చేయగలుగుతుంది. ప్రస్తుతానికి ఎయిర్‌లెన్స్ డేటా అప్లికేషన్ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ఏరియాలో మాత్రమే వర్క్ అవుతోంది. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Whether you live in Delhi or any other city, you should download some apps that you can use to check air pollution level in areas around you conveniently.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X