Home
Apps

టిక్‌టాక్ వాడకం ఇండియాలో ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!!

ఇండియాలో టిక్‌టాక్ వీడియో యాప్ కు రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతోంది. డేటా అనలిటిక్స్ సంస్థ యాప్ అన్నీ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం ఈ షార్ట్-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో భారతీయులు 2019 సంవత్సరంలో సుమారు 5.5 బిలియన్ గంటల పాటు గడిపినట్లు సమాచారం. 2018 లో భారతీయులు 900 మిలియన్ గంటల సమయం పాటు గడిపారు. 2018 తో పోలిస్తే ఈ సమయం చాలా వరకు గణనీయంగా పెరిగింది.

షార్ట్-వీడియో షేరింగ్ యాప్

షార్ట్-వీడియో షేరింగ్ యాప్

ప్రపంచవ్యాప్తంగా ఈ షార్ట్-వీడియో షేరింగ్ యాప్ ను వాడుతున్న వారిలో మార్కెట్లలో ఇండియా అగ్రశ్రేణిలో ఉండగా చైనా రెండవ స్థానంలో ఉంది. ఇండియాలో టిక్ టాక్ యొక్క నెలవారీ క్రియాశీల వినియోగదారులు డిసెంబర్ 2019 నాటికి 90% పెరిగి 81 మిలియన్లకు చేరుకున్నదని నివేదిక పేర్కొంది.

 

 

 సోషల్ నెట్‌వర్కింగ్

సోషల్ నెట్‌వర్కింగ్

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ వేదిక అయిన ఫేస్‌బుక్‌తో టిక్‌టాక్ గట్టిగానే పోటీ పడింది అని తెలుస్తోంది. నివేదిక ప్రకారం వినియోగదారులు ఫేస్‌బుక్‌లో 2019 సంవత్సరంలో 25.5 బిలియన్ గంటల పాటు గడిపారు. ఫేస్‌బుక్‌ 2018 తో పోలిస్తే ఈ సంవత్సరం 15% వృద్ధిని నమోదు చేసింది. అలాగే నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య కూడా 224 మిలియన్లకు పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్ కూడా తన నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్యను 20% వృద్ధితో డిసెంబర్ నాటికి 137 మిలియన్లకు పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ కంటే వేగంగా 40% వృద్ధిని సాధించింది.

 

టిక్‌టాక్ యాప్

డిసెంబర్ 2019 లో ఇండియాలో టిక్‌టాక్ యాప్ లో గడిపిన సమయం మిగిలిన 11 దేశాల కన్నా చాలా ఎక్కువ. ఎక్కువ మంది వ్యక్తులు ఇందులో నిమగ్నమవ్వడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తికి సంబందించిన లోతైన సమాచారం కూడా ఇందులో ఉంది అని యాప్ అన్నీ సీనియర్ మార్కెట్ మేనేజర్ లెక్సీ సిడో పేర్కొన్నారు.

 

 

గూగుల్ ప్లే స్టోర్

సెన్సార్ టవర్ నుండి ఇటీవల వచ్చిన నివేదికలు కూడా తాజా నివేదికను ధృవీకరిస్తున్నాయి. ఇండియా మార్కెట్లలో టిక్‌టాక్ యొక్క వృద్ధి గణనీయంగా పెరిగింది అని అన్ని నివేదికలు వెల్లడించాయి. వాట్సాప్ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన రెండవ యాప్ టిక్‌టాక్ అని సెన్సార్ టవర్ తన నివేదికలో తెలిపింది.

 

 

2020 లో టిక్‌టాక్

2020 లో టిక్‌టాక్

2020 లో టిక్‌టాక్ యొక్క వృద్ధి ఇలాగే కొనసాగిస్తుందో లేదో అని చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా వివిధ సమస్యలపై తరచు స్కానర్‌లోకి వస్తుంది. చైనా సైన్యం ఇటీవల తన సైనికులను చైనా సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఉపయోగించకుండా నిషేధించింది.

 

 

టాంగి యాప్

టాంగి యాప్

టిక్‌టాక్ కూడా ఈ ఏడాది మరింత పోటీ కోసం బ్రేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ కూడా టిక్‌టాక్ లాంటి రీల్స్‌లో పనిచేస్తున్నది. వైన్ వ్యవస్థాపకుడు ఇటీవల "బైట్" అనే ఆరు సెకన్ల వీడియో యాప్ ను విడుదల చేశాడు. గూగుల్ ట్యుటోరియల్‌ కూడా తన షార్ట్-ఫార్మ్ వీడియో అప్లికేషన్ అయిన ‘టాంగి' యాప్ ను ప్రవేశపెట్టింది.

Best Mobiles in India

English summary
Did You Know How Many Hours Indian Users Spend TikTok in 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X