డబ్బులు సంపాదించిపెట్టే ఆండ్రాయిడ్ యాప్స్

సాధారణ రోజులతో పోలిస్తే పండుగల సమయాల్లో మొబైల్ రీఛార్జ్ నిమిత్తం ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తుంటాం. ఈ భారాన్ని తగ్గించేందుకు కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

డబ్బులు సంపాదించిపెట్టే ఆండ్రాయిడ్ యాప్స్

Read More : రూ.1000కే VoLTE సపోర్ట్‌ ఫోన్..?

వీటిని డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఉచిత టాక్‌టైమ్ లభించటంతో పాటు మీకు అవసరమైన బోలెడంత సమచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటిని మీ మిత్రులకు రిఫర్ చేయటం ద్వారా అదనపు ప్రయోజనాలను మీరు పొందుతారు. ఆ యాప్స్ వివరాలు తెలుసుకుందామా మరి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Pokkt Money App

ఈ యాప్‌ను ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసారు. Pokkt Money Appను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఉచిత టాక్‌టైమ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను మీ మిత్రులకు రిఫర్ చేయటం ద్వారా ఒక్కో రిఫరల్‌కు రూ.5 చప్పున మీకు లభిస్తుంది.

mCent App

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఉచిత టాక్‌టైమ్ పొందే అవకాశం ఉంటుంది. mCent App మీ మిత్రులకు రిఫర్ చేయటం ద్వారా ఒక్కో రిఫరల్‌కు కమీషన్ లభిస్తుంది. కమీషన్ రూపంలో వచ్చిన మొత్తాన్ని బ్యాలన్స్ రూపంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.

TaskBucks App

ఉచిత డేటాను ఆఫర్ చేస్తున్న యాప్‌లలో TaskBucks ఒకటి. ఈ యాప్ ఉచిత టాక్‌టైమ్‌తో పాటు ఇంటర్నెట్ డేటాను కూడా ఆఫర్ చేస్తోంది. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి TaskBucks యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ వివరాలను ఎంటర్ చేసిన వెంటనే మీకు కొంత డేటా బోనస్ క్రింద లభిస్తుంది. రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద యాప్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తూ ప్రతిసారి డేటాను ఉచితంగా పొందవచ్చు. ఈ యాప్ ఆఫర్ చేసే కమీషన్ పేటీఎమ్, మొబీవిక్ క్యాష్
వాలెట్‌లలో జమవుతుంటుంది. వాటి ద్వారా రీఛార్జ్ పొందవల్సి ఉంటుంది.

Mobile Money App

ఈ యూజర్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ యాప్‌లో అనేక గేమ్స్‌తో  పాటు యాప్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఉచిత రీఛార్జ్ ఇంకా టాక్‌టైమ్‌ను పొందవచ్చు. రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద యాప్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తూ ప్రతిసారి డబ్బులు మీ అకౌంట్‌లో యాడ్ అవుతాయి.

 

 

Ladooo App

యాప్‌ను మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఉచిత రీఛార్జ్‌ను పొందే అవకాశముంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Diwali Dhamaka: Download These Android Apps and Earn Free Recharge Instantly. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot