గూగుల్ వేమో గురించి మీకు తెలియని నిజాలు
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త ప్రాజెక్ట్ గూగుల్ సెల్ప్ డ్రైవింగ్ కార్లను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ గూగుల్ కార్లు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో ముందుకు వస్తున్నాయి. అలాే వేమో అనే సరికొత్త పేరుతో గూగుల్ ఈ కార్లను అభివృద్ధి చేస్తోంది.

ఈ కార్లు అత్యంత అధునాతన టెక్నాలజీని కలిగి రోడ్ల మీద మీరు ఇచ్చే సైగలతోనే ముందుకు వెళ్లనున్నాయి. గూగుల్ సిస్టం ద్వారా నడిచే విధంగా ఈ కార్లలో హార్డ్ వేర్ , సాప్ట్ వేర్ ని ఇంజనీర్లు తయారుచేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా క్యాప్చాని తయారుచేయనున్నారు. ఈ క్యాప్చాను ఇప్పటికే వేల వెబ్ సైట్లలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ కార్లకు కూడా ఈ సాప్ట్ వేర్ అందుబాటులోకి రానుంది.

captcha అంటే..
ఈ పదాన్ని 2000వ సంవత్సరంలో Carnegie Mellon University researchers ప్రవేశపెట్టారు.computer scientist researcher Luis Von Ahn or Big Lou దీన్ని మరింతగా అభివృద్ధి చేశారు. ఈ క్యాప్చా ద్వారా అకౌంట్ హ్యాక్ కాకుండా ఉంటుంది. సెక్యూరిటీ కింద నంబర్లు కాని అలాగే చిత్రాలను కాని ఉంచుకోవచ్చు.
ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు, ఆన్‌లైన్ షాపింగ్‌లో పేమెంట్ చేస్తునప్పుడు బ్యాంకు గేట్‌వేల దగ్గర క్యాప్చాలు చూస్తుంటాం. మీరు మనిషా లేక యంత్రమా అనేది ఈ క్యాప్చాల ద్వారా తెలుసుకుంటామని ఆయా వెబ్‌సైట్లు చెబుతుంటాయి. గజిబిజి అక్షరాలు ఇచ్చి వాటిని తిరగరాయమనడం, ఇచ్చిన బొమ్మలో ఒకే రకానికి చెందినవో చెప్పమనడం లాంటివి క్యాప్చాల కిందకి వస్తాయి.

అంతర్జాలం నుంచి
త్వరలో అంతర్జాల వినియోగదారులకు ఈ ఇబ్బంది తొలగిపోనుంది. అంతర్జాలం నుంచి క్యాప్చా విధానాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు. అయితే ఎక్కడైనా సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేస్తున్న విధానం పరిశీలించి కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తున్నది మనిషా యంత్రమా అనేది తెలుసుకునేలా సాంకేతికతను సిద్ధం చేశారట. దీంతో క్యాప్చా అవసరం పోనుంది.

గూగుల్ తన కారు ప్రాజెక్టులోకి
అయితే ఇది అంతర్జాలంలో ఇప్పుడు అంతగా కనపడటం లేదు. కొన్ని ముఖ్యమై సైట్లలో అంటే బ్యాంకు లావాదేవీలు, ట్రైన్ బుకింగ్ లాంటి చోట్ల మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని గూగుల్ తన కారు ప్రాజెక్టులోకి తీసుకురానుంది.

వేమో కార్లలోకి
గూగుల్ వేమో కార్లను ఆణ్ లైన్ ద్వారా కొన్ని వేల మంది నిర్మిస్తున్నారు. వీరు సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అధునాతన టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు. వీరందరికీ ఈ క్యాప్చా అవసరం పడనుంది. ఎఐ మిసన్ ద్వారా గూగుల్ వేమో కార్ల మీద పనిచేసేందుకు ఇప్పటికే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్యాప్చాను సాల్వ్ చేసే విధంగా గూగుల్ వీరికి ట్రైనింగ్ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








