వాట్సాప్‌లో లేని అద్భుత‌మైన ఫీచ‌ర్ Telegram లో.. తెలిస్తే షాకే!

|

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ Telegram భార‌త్‌లో విశేష‌మైన యూజ‌ర్ బేస్‌ను క‌లిగి ఉంది. మెటాకు చెందిన Whatsapp త‌ర్వాత ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయం కోరుకునే వారిలో చాలా మంది Telegram యాప్‌ను ఇష్టపడతారు.

telegram schedule message

వాట్సాప్ లాగానే, Telegram కూడా వినియోగదారులకు అనేక ఫీచర్లను అందిస్తుంది, ఇది టెక్స్టింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మరియు సులభంగా చేస్తుంది. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ రెండూ ఒకదానితో ఒకటి అదే మాదిరి అనేక ఫీచర్లను క‌లిగి ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. Whatsapp లో లేని మ‌రో ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్ టెలిగ్రామ్‌లో ఉంది. అదేంటంటే.. మీరు మిత్రుల‌కు పంపే సందేశాల‌ను షెడ్యూల్ (Message Schedule) చేసే ఫీచ‌ర్‌. ఇప్పుడు షెడ్యూల్ ఫీచ‌ర్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుందాం.

Telegram మెసేజ్ షెడ్యూల్ చేసే విధానం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ద్వారా తెలుసుకుందాం.

Telegram మెసేజ్ షెడ్యూల్ చేసే విధానం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ద్వారా తెలుసుకుందాం.

* ముందుగా మీ Telegram యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత మీరు ఎవ‌రికైతే మెసేజ్ షెడ్యూల్ చేయాల‌నుకుంటున్నారో వారి చాట్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత చాట్‌లో మెసేజ్ టైప్ చేసి సెండ్ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి.
* అప్పుడు మీకు ఓ పాప్ అప్ ఓపెన్ అయి అందులో రెండు ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో ఒక‌టేమో రిసీవర్ ఫోన్‌కు తెలియజేయకుండా సందేశాన్ని నిశ్శబ్దంగా పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు రెండవది షెడ్యూల్ సందేశాన్ని పంపేందుకు అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది.
* వాటిలో మీరు రెండో షెడ్యూల్ సందేశాల‌కు (Message Schedule) సంబంధించిన ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* మీరు "మెసేజ్‌లను షెడ్యూల్ చేయండి (Message Schedule)" అనే ఆప్ష‌న్ ను ఎంచుకున్న తర్వాత, అవతలి వ్యక్తికి సందేశాన్ని ఎప్పుడు చేరావేయాల‌నే విష‌య‌మై తేదీ మరియు సమయాన్ని సెట్ చేయమని యాప్ మిమ్మల్ని అడుగుతుంది. ఆ వివ‌రాల‌ను అందించాలి.
* తేదీ మరియు సమయాన్ని ఎంచుకున్న తర్వాత, సందేశాన్ని షెడ్యూల్ చేయడానికి తేదీ మరియు సమయ సెట్టర్ క్రింద ఉన్న బ్లూ బటన్‌పై క్లిక్ చేయండి.
* ఇక ఈ ప్రాసెస్ పూర్తి అయితే.. మీరు చేసిన మెసేజ్ షెడ్యూలింగ్ విజ‌య‌వంతం అయింద‌ని అర్థం.

స‌వ‌ర‌ణ‌కు ఇలా!

స‌వ‌ర‌ణ‌కు ఇలా!

మీరు Telegram లో మెసేజ్‌ను షెడ్యూల్ చేయడానికి ఏదైనా చాట్‌లో పంపే సందేశ బటన్‌ను నొక్కి పట్టుకోవచ్చు. మీరు మెసేజ్‌లు షెడ్యూల్ చేసిన చాట్‌లలో వినియోగదారులు క్యాలెండర్ మరియు టైమర్ ఎంపికను చూస్తారు - మీ షెడ్యూల్ చేసిన మెసేజ్‌ల‌ను వీక్షించడానికి లేదా సవరించడానికి ఆ టైమ‌ర్ ద్వారా చేసుకోవ‌చ్చు.

ఇవేకాకుండా మ‌రిన్ని ఫీచ‌ర్లు:

ఇవేకాకుండా మ‌రిన్ని ఫీచ‌ర్లు:

టెలిగ్రామ్ ఇతర ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో లేని అనేక ఇతర ఫీచర్లను కూడా అందిస్తుంది. యాప్‌లోని ఏ భాషలోకి అయినా సందేశాలను అనువదించడానికి వినియోగదారులను అనుమతించే ఇన్‌బిల్ట్ ట్రాన్స్‌లేట‌ర్ ఫీచ‌ర్ కూడా ఉంది. ఇతర కొత్త ఫీచర్లలో మెసేజ్ రియాక్షన్‌లు (ఇటీవల WhatsAppకి జోడించబడిన ఫీచర్), ఇతర వినియోగదారులను కనుగొనడానికి వినియోగదారులను అనుమతించే QR కోడ్ జెనరేటర్ స‌హా మ‌రిన్ని ఆస‌క్తిక‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

టెలిగ్రామ్‌లో సీక్రెట్ మెసేజింగ్ ఫీచ‌ర్ కూడా ఉంది.. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం:

టెలిగ్రామ్‌లో సీక్రెట్ మెసేజింగ్ ఫీచ‌ర్ కూడా ఉంది.. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం:

ఎవ‌రైనా యూజ‌ర్లు త‌మ చాట్ విష‌యంలో ప్రైవ‌సీ పాటించాల‌నుకుంటే.. అలాంటి వారికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరు ఎంత మందితో అయితే సీక్రెట్ చాట్ చేయాల‌నుకుంటున్నారో ఆ వ్య‌క్తికి మాత్ర‌మే దీన్ని యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. మిగ‌తా కాంటాక్ట్స్ అంద‌రితో కామ‌న్ చాట్ చేసుకోవ‌చ్చు. మీరు ఎంపిక చేసుకున్న ప్రొఫైల్‌కు సీక్రెట్ చాట్ ఫీచ‌ర్ యాక్టివేట్ చేసుకున్న త‌ర్వాత ఆ వ్య‌క్తికి మీరు పంపిన చాట్ ఎన్ని క్ష‌ణాల్లో(సెకన్ల‌లో) డిస‌ప్పియ‌ర్ లేదా డిస్ట్ర‌క్ట్‌ కావాల‌నే విష‌యంలో మీరే నిర్దిష్ట‌మైన స‌మ‌యాన్ని కూడా అసైన్ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత మీరు అవ‌త‌లి వ్య‌క్తికి చేసిన‌ మెసేజ్‌లు నిర్దేశించిన స‌మ‌యంలో మీతో పాటు ఆ వ్య‌క్తి మాత్ర‌మే చూడ‌గ‌ల‌రు. మీ నిర్దేశిత స‌మ‌యం అనంత‌రం ఆ చాట్ డిస‌ప్పియ‌ర్ అవుతుంది. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ద్వారా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా ఒక‌వేళ్ మీరు మెసేజ్ పంపిన వెంట‌నే స్వ‌యంగా ఆ దాన్ని డిలీట్ చేస్తే ఇద్ద‌రికీ డిలీట్ అవుతుంది.

ఈ సీక్రెట్ చాట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

ఈ సీక్రెట్ చాట్‌ను ఎలా యాక్టివేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:

* ముందుగా టెలిగ్రామ్ యాప్ లేని వాళ్లు ఆండ్రాయిడ్ యూజ‌ర్ అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ యూజ‌ర్ అయితే యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* అనంత‌రం యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.
* ఆ త‌ర్వాత మీరు ఎవ‌రితో సీక్రెట్ చాట్ చేయాలి అనుకుంటున్నారో వారి చాట్‌ కాంటాక్ట్ ఎంపిక చేసుకుని, వారి ప్రొఫైల్ లోకి వెళ్లాలి.
* అనంత‌రం వారి ప్రొఫైల్ లో కుడి వైపు పై భాగంలో మూడు డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్‌పై క్లిక్ చేస్తే మ‌న‌కు ప‌లు ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. అందులో సీక్రెట్ చాట్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన వెంట‌నే మీరు ఎంపిక చేసిన ఆ కాంటాక్ట్ తో మీ సీక్రెట్ చాట్ యాక్టివేట్ అవుతుంది.
* అనంత‌రం ఆ వ్య‌క్తికి మీరు పంపే మెసేజ్ ఎంత స‌మ‌యంలో డిస‌ప్పియ‌ర్ లేదా డిస్ట్ర‌క్ట్ కావాలో మీరే స‌మ‌యాన్ని ఎంపిక చేసుకునే ఆప్ష‌న్ ఉంటుంది. అలా మీరు నిర్దిష్ట స‌మ‌యాన్ని ఎంపిక చేసుకున్న త‌ర్వాత మీరు అవ‌త‌లి వ్య‌క్తితో చేసే చాట్ ఆ నిర్దిష్ట స‌మ‌యం త‌ర్వాత ఇక క‌నిపించ‌దు.

Best Mobiles in India

English summary
Do You Use Telegram? Here's How To Schedule Messages On The WhatsApp Competitor

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X