మీ ఫోన్‌లో వాట్సప్ చెక్ చేసుకోండి, ఈ వాట్సప్ ఉంటే చాలా ప్రమాదకరం !

Written By:

వాట్సప్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. దాదాపు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఈ సామాజిక మాధ్యమం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ క్రేజ్ ని క్యాష్ రూపంలో సొంతం చేసుకునేందుకు కొందరు మాయగాళ్లు రెడీ అయ్యారు. అదెలాగంటే దీని డూప్లికేట్‌ను రూపొందించి. థర్డ్‌ పార్టీ కంపెనీలకు మీ వ్యక్తిగత వివరాలను చేరవేస్తున్నారు. వాట్సప్ ప్లస్ తో ఓ యాప్ ను రూపొందించి యూజర్ల సమాచారాన్ని వీరు రాబడుతున్న విషయం బయటకు వచ్చింది. వాట్సప్ ప్లస్ పేరుతో ఉండే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే, ఆ డౌన్లోడ్ చేసుకున్న యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలన్నీ సేకరిస్తున్నట్టు మాల్వేర్ బైట్స్ ల్యాబ్ అనే సంస్థ వెల్లడించింది. ఇది చాలా ప్రమాదకరమైన యాప్‌ అని రిపోర్టు హెచ్చరించింది.

ఆత్మీయులకు కానుకగా అందించేందుకు బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్ ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బంగారం రంగులో వాట్సప్ ఐకాన్..

ఏపీకే ఫైల్ రూపంలో ఉండే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత బంగారం రంగులో వాట్సప్ ఐకాన్ దర్శనమిస్తుంది. ఇన్ స్టాల్ తర్వాత అగ్రీ, కంటిన్యూ అని ఓకే చేస్తే గడువు తీరిపోయిందని, తిరిగి ఇన్ స్టాల్ చేసుకుని, అప్ డేట్ చేసుకోవాలన్న సందేశం కనిపిస్తుంది.

బటన్‌పై క్లిక్‌ చేస్తే..

ఎవరైతే డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటారో వారికి ‘వాట్స్‌ ప్లస్‌ ప్లస్‌ వాట్సప్‌' అనే యాప్‌ డౌన్‌లోడ్‌ అయి, ఎ‍ప్పడికప్పుడూ అది అప్‌డేట్‌ అవుతూ యూజర్ల డేటాను దొంగలిస్తుందని మాల్‌వేర్‌బైట్స్‌ నివేదించింది.

Android/PUP.Riskware.Wtaspin.GB కి

అక్కడ ఓకే చేస్తే అంతా అరబిక్ లో ఉండే ఓ అనుమానాస్పద వెబ్ సైట్ కు తీసుకెళుతోంది'' అని మాల్వేర్ బైట్స్ తెలిపింది. Android/PUP.Riskware.Wtaspin.GB కి ఇది వేరియంట్‌ అని తెలిపింది. లింక్‌ల ద్వారా షేర్‌ అయే ఈ నకిలీ వాట్సప్‌ ప్లస్‌ యాప్‌, ఏపీకే ఫైల్‌లో డౌన్‌లోడ్‌ అవుతుందని పేర్కొంది.

ఇన్‌స్టాల్‌ అయితే..

ఒక్కసారి ఇది డౌన్‌లోడ్‌ అయి, ఇన్‌స్టాల్‌ అయితే, మధ్యలో యూఆర్‌ఎల్‌తో గోల్డ్‌ రంగులో వాట్సప్‌ లోగో యూజర్లకు కనిపిస్తుందని రిపోర్టు తెలిపింది.ఈ యాప్ లో అందుకున్న సందేశాలు కనిపించకుండా చేసే హైడింగ్ ఆప్షన్ ఉందని, వాయిస్ క్లిప్ కూడా కనిపించకుండా చేసుకోవచ్చని పేర్కొంది.

నిర్వాహకుల సమాచారం లేకపోవడంతో ..

ఈ యాప్ నిర్వాహకుల సమాచారం లేకపోవడంతో నమ్మతగినది కాదని మాల్వేర్ బైట్స్ సూచించింది. అయితే ఈ యాప్‌ ఎలా పనిచేస్తుందో మాత్రం మాల్‌వేర్‌బైట్స్‌ రివీల్‌ చేయలేదు.

నిజమైన వాట్సప్‌ వైపే..

గూగుల్‌ ప్లేలో ఉన్న నిజమైన వాట్సప్‌ వైపే యూజర్లు మొగ్గుచూపాలని వెబ్‌సైట్‌ సూచిస్తోంది. ప్రస్తుతమైతే గూగుల్‌ తన ప్లే స్టోర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న హానికరమైన యాప్స్‌ను తొలగించడానికి ప్రయత్నిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Don’t download this WhatsApp app, it can be dangerous More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot