Home
Apps

గూగుల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా రూ.9 వేలు గెలుచుకోండి

గూగుల్ బంపరాఫర్ ఇస్తోంది. యూజర్ల కోసం సరికొత్తగా క్యాష్ రివార్డు పోగ్రాంను ప్రకటించింది. గూగుల్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా రూ. 9 వేల వరకు గెలుచుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

గూగుల్ బంపరాఫర్ ఇస్తోంది. యూజర్ల కోసం సరికొత్తగా క్యాష్ రివార్డు పోగ్రాంను ప్రకటించింది. గూగుల్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా రూ. 9 వేల వరకు గెలుచుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన వీడియో కాలింగ్ యాప్ డుయోని ఇన్స్టాల్ చేసుకుని స్నేహితులకు రిఫర్ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని యూజర్లు సొంతం చేసుకోవచ్చు.అయితే ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్ ని ప్రవేశపెట్టింది. ఈ కండీషన్లకు లోబడి మీరు డుయో యాప్ ద్వారా రూ.9 వేలు ఎలా సంపాదించుకోవాలో ఓ సారి చూద్దాం.

ఈ రకమైన ఆఫర్ ను మొదటగా...

ఈ రకమైన ఆఫర్ ను మొదటగా...

ఈ రకమైన ఆఫర్ ను మొదటగా ఫిలిప్ఫీన్స్ దేశంలో ప్రవేశపెట్టింది. గూగుల్ క్యాష్ రివార్డు పోగ్రాం కింద గూగుల్ డుయో ద్వారా డబ్బును సంపాదించుకునే అవకాశాన్ని ఇప్పుడు ఇండియన్లకు కూడా కల్పించింది.

మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్....

మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్....

దీని కోసం మీరు ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత తొలి కాల్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిన తరువా గూగుల్ క్యాష్ రివార్డు కు సంబంధించిన డేటాను మీకు యాక్టివేట్ చేస్తుంది. దీని ద్వారా మీరు మీ స్నేహితులకు ఫస్ట్ కాల్ చేయడం ద్వారా రిఫర్ చేయాలి.

 ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది....

ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది....

కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పనిచేస్తుంది. మీరు ఆపిల్ ఐఫోన్ యూజరయితే మీ స్నేహితునికి రిఫర్ చేసిన అతను మాత్రమే ఈ ఆఫర్ పొందుతాడు. అది ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉండాలి.

 

 

ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి...

ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి...

ఇక ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి. తొలిసారిగా నంబర్ నుంచి గూగుల్ డుయోని ఇన్ స్టాల్ చేసుకున్నవారే అర్హులు. అలాగే మీ స్నేహితుని నంబర్ కూడా కొత్తదై ఉండాలి.

గూగుల్ డుయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా...

గూగుల్ డుయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా...

గూగుల్ డుయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు యుపిఐ బేస్డ్ పేమెంట్లకు అర్హత పొందుతారు. డుయో, పే యాప్ ల ద్వారా గూగుల్ ఈ రకమైన ఆఫర్లను మీకు అందిస్తోంది.

తమిళనాడు ప్రాంత వాసులకు ఈ ఆఫర్ అందుబాటులో లేదు...

తమిళనాడు ప్రాంత వాసులకు ఈ ఆఫర్ అందుబాటులో లేదు...

అయితే తమిళనాడు ప్రాంత వాసులకు ఈ ఆఫర్ అందుబాటులో లేదు. Tamil Nadu Prize Scheme (Prohibition) Act 1979 యాక్ట్ ఉండటంతో ఆ ప్రాంత వాసులు ఈ ఆఫర్ కు అర్హతను సాధించలేరు.

ప్రతి యూజర్ సంవత్సరానికి....

ప్రతి యూజర్ సంవత్సరానికి....

కాగా ప్రతి యూజర్ సంవత్సరానికి 30 రిఫెర్రల్ అవార్డ్స్ కు మాత్రమే అర్హత పొందుతాడు. మొత్తం మీద రూ.9 వేల వరకు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కాగా ఈ కండిషన్లను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Earn Rs 9000 By Installing This Google App – Make Money Online Via Video Calls!.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X