X ప్లాట్‌ఫాంను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చే లక్ష్యంతో ఎలాన్ మస్క్ కీలక అడుగులు.. ఏం చేయబోతున్నారో తెలుసా?
ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ కీలక మార్పులు చేశారు. లోగో సహా పేరును మార్చేశారు. ప్రస్తుతం X (ట్విట్టర్) ను ఎవ్రీథింగ్ యాప్‌గా తయారుచేసే ప్రణాళికతో పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో X ను ఉద్యోగ నియామక సమాచారం (Job Search) అందించే ప్లాట్‌ఫాంగా మార్చే ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
X వేదికగా నియామకాలు చేపట్టేందుకు సుమారు 1 మిలియన్ సంస్థలు ఎదురుచూస్తున్నాయని సంస్థ వెల్లడించింది. అనేక సంస్థల్లో లక్షలాది ఉద్యోగాల కోసం ఇప్పటికే Xలో పోస్టులు చేయబడ్డాయని సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను ఎలాన్ మస్క్ మరోసారి షేర్ చేశారు.

ప్రస్తుతం X ప్లాట్‌ఫాంలో 1 మిలియన్‌కి పైగా ఉద్యోగాలకు సంబంధించిన పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్, ఆర్థికపరమైన సేవలకు సంబంధించిన సర్వీసులు మరియు ఇతర సంస్థలు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం X ద్వారా వెతుకుతున్నాయని పేర్కొంది. లింక్‌డిన్ వంటి సంస్థలు ఇప్పటికే ఉద్యోగ సమాచారాన్ని అందిస్తు్న్నాయి.
* X ఫ్లాట్‌ఫాంలో కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆడియో / వీడియో కాలింగ్ ఫీచర్‌ను వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే ఈ సదుపాయం X యూజర్లు అందరికి అందుబాటులోకి వచ్చిందని X ఫ్లాట్‌ఫాం ఇంజినీర్ ఒకరు వెల్లడించారు.
X ఫ్లాట్‌ఫాం గత సంవత్సరం ఈ ఫీచర్‌ను iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆడియో/ వీడియో కాలింగ్ ఫీచర్‌ను కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అనంతరం ఈ సంవత్సరం తొలి రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లను ఈ అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ కూడా కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తాజాగా అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
అయితే యూజర్లకు ఆడియో / వీడియో కాలింగ్ ఫీచర్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకొనే అవకాశం కల్పించారు. ఎవరు తమకు కాల్స్ చేయవచ్చనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఫాలో అవుతున్న వ్యక్తుల లేదా ఇతరులు లేదా వెరిఫైడ్ ఖాతాలు కలిగిన వ్యక్తులు తమకు కాల్ చేసే సదుపాయం కల్పించారు.
ఇటీవల ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని నెలల్లో తన ఫోన్ నంబర్ వినియోగాన్ని నిలిపేస్తానని, మెసెజ్, ఆడియో, వీడియో కాల్స్ కోసం కేవలం X ను మాత్రమే ఉపయోగిస్తా అని X లో పోస్ట్ చేశారు. ఆడియో/ వీడియో కాలింగ్ ఫీచర్ ప్రమోషన్ కోసమే ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
X ప్లాట్‌ఫాంలో ఆడియా మరియు వీడియో కాల్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసేందుకు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను గతంలోనే ట్విట్టర్ సీఈవో లిండా షేర్ చేశారు. ఇందులో ఎవరు తమకు వీడియో కాల్ చేయవచ్చునో ఎంపిక చేసుకోవచ్చు. అక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వెరిఫైడ్ యూజర్లు, ఫాలో అవుతున్న ఖాతాలు, అడ్రస్ బుక్‌లో ఉన్న ఖాతాలు.. వంటి ఆప్షన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఈ ఆప్షన్ మీకు కనిపించకుంటే ముందుగా X (ట్విట్టర్) యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ప్రైవసీ మరియు సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అనంతరం డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. చివరికి అక్కడ కనిపించిన ఆడియో మరియు వీడియో కాలింగ్ ఫీచర్‌ను ఎంచుకోవాలి. అక్కడ కుడివైపున ఫోన్ సింబల్‌ను గుర్తించవచ్చు.


Click it and Unblock the Notifications