Home
Apps

X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్‌ మస్క్‌ ప్రకటన!!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అప్పటి నుంచి కీలక మార్పులు చేశారు. X ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు అనేక ఫీచర్లను తీసుకొచ్చారు. దీంతోపాటు భవిష్యత్‌లోనూ మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు.

ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తొలిరోజుల్లో ప్రీమియం యూజర్లకు మాత్రమే బ్లూటిక్‌ (వెరిఫైడ్‌ ఖాతా) గా గుర్తిస్తామని X సంస్థ వెల్లడించింది. అనంతరం ప్రీమియం యూజర్ల కోసం కొన్ని ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు.

X platform

వారికి ఉచితంగా ప్రీమియం ఫీచర్లు : X లో 2500 కంటే ఎక్కువ వెరిఫైడ్‌ సబ్‌స్క్రైబర్లు ఫాలోయర్లుగా ఉన్న వారు ప్రీమియం ఫీచర్లను ఉచితంగానే (X Premium Features) పొందవచ్చని తెలిపారు. దాంతోపాటు 5000 వైరిఫైడ్‌ సబ్‌స్కైబర్లు ఫాలోయర్లుగా ఉంటే ప్రీమియం + ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చని ప్రకటన చేశారు.

X ప్లాట్‌ఫాం ప్రీమియం మరియు ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రైబర్లు ఇతర ప్రయోజనాలతోపాటు ఇటీవల కొత్తగా లాంచ్‌ అయిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) చాట్‌ బోట్‌ GrokAI యాక్సెస్‌ను పొందవచ్చు. గతంలో కేవలం ప్రీమియం+ సబ్‌స్కైబర్లకు మాత్రమే ఈ చాట్‌బోట్‌ అందుబాటులో ఉండేది. ఈ వారం చివర నుంచి ఈ చాట్‌బోట్‌ ప్రీమియం, ప్రీమియం+ యూజర్లకు అందుబాటులో ఉంటుందని మస్క్‌ తెలిపారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత Grok AI ను గత సంవత్సరం నవంబర్‌లో ఆవిష్కరించారు. ఎటువంటి ప్రశ్నను అయినా ఈ చాట్‌బోట్ బదులివ్వగలదని సంబంధిత టీం వెల్లడించింది. దీంతోపాటు ఈ చాట్‌బోట్‌ రియల్‌ టైం సమాచారాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. ఇతర AI చాట్‌బోట్‌లు రిజెక్ట్‌ చేసిన ప్రశ్నలను కూడా ఈ చాట్‌బోట్‌ సమాధానాలిస్తుందని పేర్కొంది.

** X ప్లాట్‌ఫాంలో ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆడియో/ వీడియో కాల్‌ ఫీచర్‌ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు LinkedIn తరహాలో X లో జాబ్‌ సెర్చ్‌ ఫీచర్‌ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్‌ను ప్లాట్‌ఫాంలో జతచేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను వెబ్‌ డెవలపర్‌ Nima Owji షేర్‌ చేశారు.

ఈ స్క్రీన్‌ షాట్‌ ఆధారంగా ఉద్యోగంలోని అనుభవం ఆధారంగా సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని సంస్థల్లోని ఉద్యోగాల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. జాబ్‌ సెర్చ్‌లోని ఫిల్టర్‌ ఫీచర్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మిలియన్ సంస్థలు ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది.

దీంతోపాటు ఎలాన్‌ మస్క్ కొన్ని రోజుల కిందట కీలక ప్రకటన చేశారు. త్వరలో X మనీ ట్రాన్సిమీటర్‌ లైసెన్స్‌ పొందుతుందని చెప్పారు. అంటే ఈ ప్లాట్‌ఫాం ద్వారా నగదు బదిలీ చేసుకొనే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. X ప్లాట్‌ఫాంను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Elon Musk said some users can get free access to premium features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X