Home
Apps

X (ట్విట్టర్‌)లో ఇన్‌స్టాగ్రామ్‌ తరహా ఫీచర్.. త్వరలో మరిన్ని కీలక మార్పులు..!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్ X (ట్విట్టర్‌) రీ‌బ్రాండ్‌ అయిత తర్వాత అనేక కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ఈ ప్లాట్‌ఫాం వీడియో స్వైప్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ తరహా ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ మాదిరిగా ఉంటుంది. Xలో వీడియోలు చూసేందుకు పైకి స్వైప్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్‌కు సంబంధించిన ఫోన్‌ X (ట్వి్ట్టర్‌) తన అధికారిక హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. అల్గారిథమ్‌ ద్వారా వీడియోలను సిఫార్సు చేస్తుందని తెలిపింది. వీడియో స్వైప్‌ ఫీచర్‌.. మెరుగైన వీడియో అనుభూతి ఇస్తుందని X అధినేత ఎలాన్‌ మస్క్‌ ఇదివరకే చిన్న లీక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

X brings Instagram like video swipe up feature

ఈ వీడియో స్పైప్‌ ఫీచర్‌ ద్వారా మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాంపై యూజర్లను ఎక్కువ సమయం ఎంగేజ్‌ చేసే అవకాశం ఉంది. X ప్లాట్‌ఫాంను ప్రస్తుతం ఎవ్రీథింగ్‌ అప్లికేషన్‌గా మార్చేందుకు ఎలాన్‌మస్క్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తనకు నచ్చిన వారికి త్వరలో వీడియో, ఆడియో కాల్స్‌ చేసుకొనే ఫీచర్‌ అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఎలాన్‌మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక అనేక కీలక మార్పులు చేశారు. ప్రారంభంలోనే కీలక స్థానాల్లోని వారిని తొలగించారు. దాంతోపాటు వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక.. ఒకరకంగా దానిపై ఎలాన్‌ మస్క్‌ ప్రయోగాలు చేశారు. ప్రముఖుల అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. అనంతరం మళ్లీ పునరుద్ధరించారు. దాంతోపాటు బ్లూటిక్‌ కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చాడు.

కొన్నిరోజుల క్రితం ట్వీట్లకు పరిమితిని విధించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ అసంతృప్తి వ్యక్తం అయింది. వెరిఫైడ్‌ ఖాతాల కలిగిన వ్యక్తులు రోజుకు పదివేల ట్వీట్లు, వెరిఫైడ్‌ ఖాతా లేకున్నా చాలా కాలం నుంచి ట్వీట్టర్‌ అకౌంట్‌ కలిగి వ్యక్తులు రోజుకు వెయ్యి ట్వీట్లు, కొత్తగా అకౌంట్‌ తెరిచి వెరిఫైడ్‌ అకౌంట్‌ లేకుంటే కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూడగలిగేలా మార్పులు చేశారు.

దాంతోపాటు ట్విట్టర్‌ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎక్స్‌ కార్ప్‌లో విలీనం చేశారు. అనంతరం 2012 నుంచి ఉన్న ట్విట్టర్‌ లోగోను తొలగించి, దాని స్థానంలో Xను ఏర్పాటుచేశారు. పూర్తిగా రీబ్రాండ్‌ వెర్షన్‌గా మార్చేందుకు కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు.

అయితే ట్విట్టర్‌లో గతంలో ఎలాన్‌మస్క్‌ తీసుకున్న నిర్ణయాలు నచ్చక చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు మెటా 'థ్రెడ్స్‌' యాప్‌ను లాంచ్‌ చేసింది. కేవలం రెండు వారాల్లోనే అత్యధిక యూజర్లను పొందింది. అయితే కొద్ది కాలంలోనే థ్రెడ్స్ యాప్‌ రోజువారీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే థ్రెడ్స్‌ యాప్‌ను ట్విట్టర్‌కు పోటీగా ఉండేలా కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Elon musk X brings instagram like video swipe up feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X