Home
Apps

ఎలాన్ మస్క్ X ప్లాట్‌ఫాంలో జాబ్‌ సెర్చ్‌ ఫీచర్‌.. అనుభవం, సంస్థల వారీగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయవచ్చు..!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ X (ట్విట్టర్‌) ను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk X Platform) అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక మార్పులు చేశారు. ఇటీవల ఆడియో/ వీడియో కాల్‌ ఫీచర్‌ను వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు X ను ఉద్యోగాలు అందించే ప్లాట్‌ఫాంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

అందుకు అనుగుణంగా X ప్లా్ట్‌ఫాంలో ఫీచర్‌ను జతచేసింది. స్క్రీన్‌షాట్‌ను వెబ్‌ డెవలపర్‌ Nima Owji షేర్‌ చేశారు. X ప్లాట్‌ఫాం ఉద్యోగాల సమాచారం అందించే ఫీచర్‌తో Linkedin కు పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ స్క్రీన్‌ షాట్‌ ఆధారంగా ఉద్యోగంలోని అనుభవం ఆధారంగా సమాచారం తెలుసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని సంస్థల్లోని ఉద్యోగాల సమాచారం కూడా తెలుసుకోవచ్చు. జాబ్‌ సెర్చ్‌లోని ఫిల్టర్‌ ఫీచర్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

Elon musk X platform

గత నెలలో X ప్లాట్‌ఫాం జాబ్‌ సెర్చ్‌ ఫీచర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మిలియన్ సంస్థలు ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే మిలియన్ పైగా ఉద్యోగ సమాచారం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఉద్యోగ సమాచారం లైవ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌, ఆర్థికపరమైన సేవలకు సంబంధించిన సర్వీసులు వంటి సంస్థలు X ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినట్లు తెలిపాయి.

దీనితోపాటు X ఫ్లాట్‌ఫాంలో కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆడియో/ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. X ఫ్లాట్‌ఫాం గత సంవత్సరం ఈ ఫీచర్‌ను iOS యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆడియో/ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

అనంతరం ఈ సంవత్సరం తొలిరోజుల్లో ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ కూడా కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తాజాగా అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. యూజర్లకు ఆడియో/ వీడియో కాలింగ్‌ ఫీచర్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకొనే అవకాశం కల్పించారు. ఎవరు తమకు కాల్స్‌ చేయవచ్చనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

త్వరలో తాను మొబైల్‌ నంబర్‌ను నిలిపేస్తానని, X ఆడియో/ వీడియో కాల్‌ ఫీచర్‌ ద్వారా మెసెజ్‌, ఆడియో, వీడియో కాల్స్‌ చేస్తానని వెల్లడించారు. ఈ ఫీచర్‌ను ప్రమోట్‌ చేసే ఉద్దేశంతోనే ఎలాన్‌ మస్క్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఫోన్ నంబర్‌తో సంబంధం లేకుండానే ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.

దీంతోపాటు ఎలాన్‌ మస్క్ కొన్ని రోజుల కిందట కీలక ప్రకటన చేశారు. త్వరలో X మనీ ట్రాన్సిమీటర్‌ లైసెన్స్‌ పొందుతుందని చెప్పారు. అంటే ఈ ప్లాట్‌ఫాం ద్వారా నగదు బదిలీ చేసుకొనే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. X ప్లాట్‌ఫాంను ఎవ్రీథింగ్‌ యాప్‌గా మార్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Elon musk X platform adds job search feature to compete with linkedin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X