ట్విట్టర్ (X) పోస్టులను లైక్, కామెంట్, షేర్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్ లోగో, పేరు కూడా మార్చేసిన మస్క్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ (X)లో ఏదైనా పోస్టును లైక్, కామెంట్, షేర్ చేయాలన్నా.. కనీస ఛార్జీలు చెల్సించాల్సిన ఉంటుందని ప్రకటన చేశారు. ట్వీట్‌లను ఉచితంగానే చదువుకోవచ్చని స్పష్టం చేశారు.
ట్విట్టర్‌ను వినియోగించాలంటే (Twitter or X Annual Fee Program) కనీస ఛార్జీలు వసూలు చేసే ఆలోచన ఉందని, గతంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిగిన సంభాషణ సందర్భంగా ఎలాన్ మస్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ట్విట్టర్ (X) సీఈవో లిండా కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు.

తొలి దశలో న్యూజిలాండ్, ఫిలిప్పెన్స్ రెండు దేశాల్లో ఈ విధానంలో అమల్లోకి వచ్చింది. ఈ దేశాల్లోని X వినియోగదారులు సంవత్సరానికి 1 USD (అమెరిక్ డాలర్) చెల్సించాల్సి ఉంటుంది. దీనిపై మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ (X) కీలక ప్రకటన చేసింది.
"ఇవాళ్టి నుంచి న్యూజిలాండ్, ఫిలిప్పెన్స్ దేశాల్లో Not A Bot టెస్టింగ్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నాం. ఈ విధానం కింద కొత్త, అన్‌వెరిఫైడ్ ఖాతాదారులు పోస్టులను లైక్, కామెంట్, షేర్ చేసేందుకు సంవత్సరానికి $1 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఈ కొత్త విధానం ద్వారా ప్రభావితం చెందరు" అని పోస్టు చేసింది.
X ప్లాట్‌ఫాంలో బాట్ (నకిలీ ఖాతా)ల నియంత్రణ సహా ఇతర కారణాలతో ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసినట్లు పోస్టులో పేర్కొంది. ఈ కొత్త విధానంపై ట్విట్టర్ (X) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా స్పందించారు. ఈ మేరకు పోస్టు చేశారు
X పోస్టులను ఉచితంగా చదవండి. కానీ రాసేందుకు $1/ సంవత్సరం చెల్లంచాల్సి ఉంటుందని రాసుకొచ్చారు. బాట్లతో పోరాడేందుకు ఇదో మంచి మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే దీని ద్వారా బాట్లను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ దేశాల్లో ఈ కొత్త విధానం విజయవంతం అయితే ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. ఎలాన్ మస్క్ ఇది వరకు భావిస్తున్నట్లుగా.. ట్విట్టర్ (X)ను ప్రీమియం యాప్‌గా మార్చే అవకాశం ఉంది. అంతే కనీస నగదు చెల్లింపులతో అనుమతి ఇచ్చే విధంగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇందుకోసం మూడు రకాల ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లను పరీశీలిస్తున్నట్లు X సీఈవో ఇప్పటికే వెల్లడించారు. ప్లాట్‌ఫాంలో వచ్చే యాడ్‌ల ఆధారంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫ్లాట్‌ఫాంను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కనీస చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. X ప్లాట్‌ఫాంను అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై బ్యాంకర్లకు ఇచ్చిన సమాచారంలో ఈ వివరాలు సమర్పించినట్లు సమాచారం.
X ( ప్రీమియం) ప్లాన్లు.. బేసిక్, స్టాండర్డ్, ప్లస్‌లుగా విభజించారు. బేసిక్ యూజర్లు పుల్ యాడ్స్‌ను చూడాల్సి ఉంటుంది. అదే స్టాండర్డ్ యాజర్లకు సగం యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే ప్లస్ యూజర్లకు ఎటువంటి యాడ్స్ కనిపించవని తెలుస్తోంది. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందో వెల్లడికాలేదు.


Click it and Unblock the Notifications








