Home
Apps

సెల్ఫీని చంపేస్తున్న బోథీ, ఫీచర్‌పై పూర్తివివరాలు ఇవే..

స్మార్ట్‌ఫోన్లలో బోథీ ఫీచర్ సంచలనం, కాలగర్భంలోకి సెల్ఫీ ఫీచర్ ! ఎలా అనుకుంటున్నారా..అయితే ఓ లుక్కేయాల్సిందే.

By Hazarath

మీరు ఇప్పటిదాకా సెల్ఫీ గురించే విన్నారు..అయితే ఇకపై ఈ సెల్ఫీ అనే పదం చరిత్ర పుటల్లోకి జారుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దానికి కారణం బోథీ అనే కొత్త ఫీచరే..పేరు కొత్తగా ఉన్నా దాని ఫీచర్లు మాత్రం అదిరిపోతున్నాయి. నోకియా 8 ఈ కొత్త ఫీచర్ కు శ్రీకారం చుట్టింది. ఇంతకుముందే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నా అది నోకియా8 పోన్‌తోనే పాపులర్ అయిందని చెప్పవచ్చు.

ఒకే సమయంలో డ్యుయల్‌ మోడ్‌ సైట్‌ ద్వారా..

ఒకే సమయంలో డ్యుయల్‌ మోడ్‌ సైట్‌ ద్వారా..

మనం సెల్ఫీ కావాలంటే ముందు కెమెరా వాడతాం. మామూలుగా ఫొటోల కోసమైతే వెనుక కెమెరా వాడతాం. కానీ ఒకే సమయంలో డ్యుయల్‌ మోడ్‌ సైట్‌ ద్వారా ముందు, వెనుక కెమెరాలను వాడుకోవచ్చు. దీన్నే బోథీ అంటున్నారు.

నోకియా తన కొత్త ఫోన్ నోకియా8లో..

నోకియా తన కొత్త ఫోన్ నోకియా8లో..

సెల్‌ఫోన్‌ విప్లవానికి నాంది పలికిన నోకియా తన కొత్త ఫోన్ నోకియా8లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. నోకియా-8 ఫోన్లో ప్రవేశపెట్టిన బోథీ ఫీచర్‌ ప్రాచుర్యంలోకి వస్తే సెల్ఫీకి సహజ మరణం తప్పదంటున్నారు టెక్ విశ్లేషకులు.

ఐఫోన్లో కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా

ఐఫోన్లో కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా

అయితే నోకియా ఈ ఫీచర్ ని కనుగొనలేదు. ఇప్పటికే ఐఫోన్లో కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా బోథీ ఫీచర్‌ను జనం ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ యాప్‌లేవీ వాణిజ్యపరంగా సక్సెస్‌ కాలేదు.

3 యాప్స్

3 యాప్స్

Frontback లేదా Front & Back Camera - Dual Selfie Camera Effect లేదా phoTWO అనే ఈ 3 యాప్స్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి.

Frontback..

Frontback..

Frontback ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తుండ‌గా, Dual Selfie Camera Effect ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తోంది. ఇక 3వ యాప్ phoTWO కేవ‌లం ఐఫోన్‌లో మాత్ర‌మే ల‌భిస్తోంది.

ఆ యాప్‌ సహాయంతో..

ఆ యాప్‌ సహాయంతో..

వీటిలో దేన్ని యూజ‌ర్లు ఇన్‌స్టాల్‌ చేసుకున్నా ఆ యాప్‌ సహాయంతో పైన చెప్పిన బోథీ ఫీచ‌ర్‌ను మీ స్మార్ట్‌ఫోన్లో ఎంజాయ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Everything You Need to Know About bothie camera feature Read more News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X