Home
Apps

భారత డిజిటల్‌ పేమెంట్స్‌.. స్వాతంత్య్రం నుంచి నేటి వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

స్వాతంత్ర్యం నుంచి ఇప్పటి వరకు భారతదేశం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. కొత్త టెక్నాలజీని ప్రోత్సహించడం సహా స్వీకరించడంలోనూ ముందు వరుసలో ఉంది. తొలిదశలో ప్రాధమిక స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించడం సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించింది. అనంతరం ఆర్థిక. సామాజిక అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా డిజిటల్‌ టెక్నాలజీపైన (Digital India) దృష్టిసారించింది. ప్రారంభంలో అనేక డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ కొంత మంది నియంత్రణలో ఉండేది. ప్రతి లావాదేవీ కోసం కమీషన్‌ చెల్లించాల్సి వచ్చేది.

ఈ నేపథ్యంలో UPI (Unified Payments interface) చెల్లింపు వ్యవస్థ కోసం ప్రభుత్వ ఆధారిత నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటయింది. UPI చెల్లింపుల వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక... భారత్‌లో డిజిటల్‌ పేమెంట్‌ల వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందింది. సులభంగా, ఉచితంగా బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లింపులు చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

Evolution of UPI payments

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) :
భారతదేశంలో ఇటీవల కాలంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ చెప్పుకోదగ్గ పురోగతిగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా బ్యాంకు అకౌంట్లు కలిగిన వారు తమ అన్ని ఖాతాలను ఒకే మొబైల్‌ అప్లికేషన్‌కు లింక్‌ చేసుకొని, పేమెంట్లు చేసేందుకు అవకాశం కలిగింది. UPI ద్వారా సులభంగా, సురక్షితంగా పేమెంట్లు చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

డిజిటల్‌ పేమెంట్‌లను సులభతరం చేయడం సహా ప్రోత్సహించడం కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వరంలో వచ్చిన UPI చెల్లింపుల వ్యవస్థ.. అతి కొద్ది కాలంలోనే వినియోగదారుల ఆదరణ సంపాదించుకుంది. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మరియు నేరుగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచే ఎక్కడివారికైనా చెల్లింపులు చేయవచ్చు.

దీని ద్వారా బ్యాంకింగ్‌ సేవలు సులభతరం అయ్యాయి. డిజిటల్‌ బ్యాంకింగ్ సేవలు వినియోగించని అనేక లక్షల మందిని UPI వినియోగం ద్వారా వారందరిని డిజిటల్‌ పేమెంట్ల వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లయింది. వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులను డిజిటల్‌ ఎకానమీ లో పాల్గొనేందుకు అవకాశం కలిగింది.

ఈ UPI ద్వారా కనిష్ఠంగా రూ.1 నుంచి లక్ష రూపాయల వరకు చెల్లింపులు చేయవచ్చు. ఈ వ్యవస్థ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం సహా అత్యంత భద్రతను కలిగి ఉంది. వినియోగదారులు నేరుగా UPI ఐడీల ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో చెల్లింపులు చేయవచ్చు. ఎటువంటి సున్నితమైన వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేకుండా ఉంది. UPI చెల్లింపులను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా 2 ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వ్యవస్థను తీసుకొచ్చింది.

నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధారంగా UPI చెల్లింపులు ప్రతి సంవత్సరం గణనీయంగా వృద్ధి చెందుతోంది. డిజిటల్‌ ఇండిలో భాగంగా నగదు రహిత చెల్లింపుల కోసం ప్రభుత్వాల ప్రోత్సాహం సహా ఇతర పరిణామాలు UPI వ్యవస్థ అభివృద్ధి చెందేందుకు కారణంగా ఉన్నాయి. 2022-23 సంవత్సరంలో ఈ సంఖ్య 84 మిలియన్‌లు ఉండగా.. 2023-24 సంవత్సరంలో ఈ సంఖ్య 131 మిలియన్‌లుగా ఉంది.

ప్రస్తుతం భారతీయులు ఒమన్‌, దుబాయ్‌, పారిస్ సహా అనేక దేశాలను వెళ్లినప్పుడు UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు అంతర్జాతీయ యాత్రికులు భారత్‌లో పర్యటించిన సమయంలో సులభంగా పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. భారత్‌ డిజిటల్‌ పెమెంట్‌ వ్యవస్థ అంతర్జాతీయ స్థాయికి చేరుకొనేందుకు అవకాశం ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Evolution of UPI payments indias advances technology from independence to present
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X