ఈ యాప్ ఖరీదు రూ.26,000, అంత గొప్పేంటో.?

మన మార్కెట్లో ఒకప్పుడు పెయిడ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువుగా ఉండేది. స్మార్ట్‌ఫోన్‌‌ల వినియోగంతో పాటు యాప్స్‌‌తో అవసరాలు మరింతగా పెరిగిపోవటంతో కొన్నికొన్ని యాప్స్‌ను డబ్బులు పెట్టి కొనుగోలు చేయవల్సిన పరిస్థితులు వచ్చేసాయి.

ఈ యాప్ ఖరీదు రూ.26,000, అంత గొప్పేంటో.?

మార్కెట్లో లభ్యమవుతోన్న చాల వరకు యాప్స్ వందల ఖరీదు చేస్తున్నాయి. వందా, రెండొదులు, మూడొందులు అయితే పర్వాలేదుగాని ఏకంగా యాప్ ఖరీదు రూ.26,000 అంటే ఎవరైనా కొంటారా చెప్పండి..? గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న కొన్ని పెయిడ్ యాప్స్ వేలల్లో ఖరీదు చేస్తున్నాయి. వీటిని పొందాలంటే రూ.26,000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ యాప్స్ వల్ల అంతగా ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఏమి లేవు. మరి ఎందుకింత ధర..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Most Expensive Android App

ఈ యాప్ పేరు Most Expensive Android App. ఖరీదు రూ.13,300. ఈ యాప్, మీ ఫోన్‌కు ప్రత్యేకమైన బ్యాడ్జ్‌తో పాటు ఓ సర్టిఫికేట్‌ను ఆఫర్ చేస్తుంది. దీంతో మీ ఫోన్ లక్షల్లో ఒక్కటిలాగా ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది. స్టేటస్ సింబల్ ఇంకా హుందాగా ఫీల్ అవ్వాలనుకునే వారు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

Expensive Digital Wallet

ఈ యాప్ పేరు Expensive Digital Wallet. ఖరీదు రూ.2419. ఈ వాలెట్ యాప్ మీ ఖర్చులను ట్రాక్ చేస్తూ మీ బ్యాలన్స్ హిస్టరీని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్ .

The Most Expensive App

ఈ యాప్ పేరు The Most Expensive Android App. ఖరీదు రూ.26,000. ఈ యాప్ మీ ఫోన్ డిస్‌ప్లే పై అద్భుతమైన మెరిసే వజ్రాలను డిస్‌ప్లే చేస్తుంది. స్టేటస్ సింబల్ ఇంకా హుందాగా ఫీల్ అవ్వాలనుకునే వారు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

5-Minute Sports Medicine

ఈ యాప్ ఖరీదు రూ.5.491. క్రీడలు సంబంధిత వైద్య సమస్యలు పై ఇన్‌స్టెంట్ గైడెన్స్‌ను ఈ యాప్ ఆఫర్ చేస్తుంది. 280పైగా సమస్యలకు సంబంధించిన వివరాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. డౌన్‌లోడ్ లింక్

Dr.Web Security Space Life

డాక్టర్.వెబ్ సెక్యూరిటీ స్పేస్ లైఫ్

ఈ యాప్ మీ ఫోన్‌కు అవసరమైన సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా మాల్వేర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. యాప్ ఖరీదు రూ.4,050. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

 

The Atlas of Internal Medicine

ద అట్లాస్ ఆఫ్ ఇంటర్నల్ మెచీన్
ఈ మెడికల్ యాప్ ఖరీదు రూ.8,514. 2000కు పైగా మెడికల్ ఇమేజెస్ దీనిలో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

I'm Rich Man-Most expensive

ఐయామ్ రిచ్ మ్యాన్ - మోస్ట్ ఎక్స్‌పెన్సివ్

ఈ యాప్ పేరు I'm Rich Man-Most expensive. ఖరీదు రూ.26,000. ఈ యాప్ మీ ఫోన్ డిస్‌ప్లే పై అద్భుతమైన మెరిసే వజ్రాలను డిస్‌ప్లే చేస్తుంది. స్టేటస్ సింబల్ ఇంకా హుందాగా ఫీల్ అవ్వాలనుకునే వారు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most expensive apps you can download on your Android device. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot