యాడ్ ఫ్రీ ఇన్‌స్టెంట్ మెసెజింగ్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపుతెచ్చుకున్న వాట్సాప్, ఫేస్‌బుక్ చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచి రోజుకో కొత్త ఫీచర్‌ను తెరమీదకు తీసుకువస్తోంది. తాజాగా తెలియవచ్చిన సమచారం ప్రకారం వాట్సాప్ ద్వారా మరిన్ని ఆదాయ వనరుల కోసం ఫేస్‌బుక్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
టెక్‌క్రంచ్ తాజాగా రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ సరికొత్త యాడ్ యూనిట్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ యాడ్ యూనిట్ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల మధ్య బిజినెస్ లింక్‌ను నెలకొల్పబోతోంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ప్రకటనదారులు తమ ఫేస్‌బుక్ యాడ్‌లలో వాట్సాప్ బటన్‌ను ఇన్ క్లూడ్ చేసుకునే వీలుంటుంది. యూజర్లు ఈ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా వాట్సాప్ కాల్ లేదా మెసేజ్ ద్వారా ప్రకటనదారులతో ఇంటరాక్ట్ అయ్యే వీలుంటుంది. .
రూ.19000కే ఐఫోన్ ఎక్స్ లాంటి ఫోన్, 6జీబి, 128జీబి స్టోరేజ్
టెస్టింగ్ ఫేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ గతేడాదే ఇంటర్నెట్‌లో స్పాట్ అయ్యింది. తాజాగా ఈ ఫీచర్‌కు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫేస్‌బుక్ నుంచి వెలువడింది. త్వరలో అందుబాటులోకి రాబోతోన్న ఈ ఫీచర్ ముందుగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇంకా ఆసియ రీజియన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత యూరోప్ దేశాల్లో అందుబాటులో ఉంటుంది.
ఫేస్‌బుక్‌లో గతంలో అందబాటులో ఉంచిన క్లిక్-టు-మెసెంజర్ యాడ్స్ తరహాలోనే ఈ న్యూ బటన్ యాడ్-యూనిట్ పనిచేస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ బటన్ ఇంటగ్రేషన్ అనేది రెగ్యులర్ కన్స్యూమర్ సర్వీసులకు వర్తిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Gizbot ఇన్‌స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.