ఫేస్‌బుక్‌లో హైడెఫినిషన్ క్వాలిటీ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు

ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం సరికొత్త అప్‌డేట్‌లను ఫేస్‌బుక్ లాంచ్ చేసింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచే క్రమంలో ఫేస్‌బుక్, సరికొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాుటలోకి తీసుకువచ్చింది.

ఫేస్‌బుక్‌లో  హైడెఫినిషన్ క్వాలిటీ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు

Read More : రూ.144కే నెలంతా ఉచిత కాల్స్, ఇంటర్నెట్

తాజా అప్‌డేట్స్‌లో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫేస్‌బుక్ యాప్‌లో హైడెఫినిషన్ క్వాలిటీ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. పిక్షర్ ఇన్ పిక్షర్ వీడియాలను కూడా ఆండ్రాయిడ్ ఫేస్‌బుక్ యూజర్లు క్యాప్చుర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఫేస్‌బుక్ వీడియోలను సైతం ఆఫ్‌లైన్‌లో వీక్సించవచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరికొత్త హంగులు..

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌ తన ఆండ్రాయిడ్ వర్షన్ యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. సీక్రెట్ కన్వర్జేషన్స్, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్, ఫేక్ న్యూస్ రిమూవ్, అట్రాక్టివ్ emojis వంటి సరికొత్త హంగులు ఇటీవల ఫేస్‌బుక్‌ యాప్‌లో జతయ్యాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిసెంబర్ అప్‌డేట్‌లో భాగంగా..

డిసెంబర్ అప్‌డేట్‌లో భాగంగా ఫేస్‌బుక్, ప్రధానంగా ఆండ్రాయిడ్ యూజర్ల పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన అప్‌డేట్స్‌లో భాగంగా యాపిల్ ఐఓఎస్ యూజర్స్ తరహాలోనే ఆండ్రాయిడ్ యూజర్లు కూడా హైడెఫినిషన్ వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసుకోగలుగుతారు. అయితే, ఈ వీడియోలను అప్‌లోడ్ చేసుకునే క్రమంలో ఇంటర్నెట్ కనెక్షన్ బలంగా ఉండాలని ఫేస్‌బుక్ చెబుతోంది.

గతంలో ఫోటోలు మాత్రమే..

నిన్న మొన్నటి వరకు ఆండ్రాయిడ్ యూజర్లు ఫేస్‌బుక్‌లో కేవలం హైడెఫినిషన్ క్వాలిటీ ఫోటోలను మాత్రమే అప్‌లోడ్ చేసుకోగలిగే వారు, తాజా అప్‌డేట్‌తో హెచ్‌డి క్వాలిటీ వీడియో కంటెంట్‌ను కూడా అప్‌లోడ్ చేయగలుగుతారు.

ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా..

యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ తరహాలోనే ఫేస్‌బుక్ కూడా ఆఫ్‌లైన్ వ్యూవింగ్ ఆప్షన్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేకపోయినప్పటికి ఫేస్‌‌బుక్ వీడియోలను వీక్షించే అవకాశం ఉంటుంది.

వీడియో సెక్షన్‌లో మార్పు చేర్పులు

వీటితో పాటు అనేక ఫీచర్లను ఫేస్‌బుక్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియో సెక్షన్‌లో పలు మార్పు చేర్పులు చేయటంతో పాటు నోటిఫికేషన్‌లను సులువుగా బ్రౌజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Now Let's Android Users Upload HD Videos, Watch Videos Offline, and More. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot