కనెక్ట్ అయిపోండి, ఫేస్‌బుక్ డేటింగ్ యాప్ వచ్చేస్తోంది
కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు చేరువ అవుతున్న పేస్ బుక్ ఇప్పుడు సరి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రానుంది.
కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు చేరువ అవుతున్న పేస్ బుక్ ఇప్పుడు సరి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని రానుంది. Tinder ,Truly-Madly మొబైల్ డేటింగ్ యాప్ తరహాలో పేస్ బుక్ కూడా ఒక డేటింగ్ యాప్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొని రానుంది . అమెరికా లో మే నెలలో జరిగిన affair డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ సందర్బంగా పేస్ బుక్ CEO Mark Zukerberg డేటింగ్ యాప్ గురించి ప్రకటన చేసారు.

సంస్థ లో పని చేసే ఉద్యోగులతో.....
తమ సంస్థ లో పని చేసే ఉద్యోగులతో పేస్ బుక్ ఇప్పటికే టెస్ట్ చేయడం మొదలబెట్టింది. డేటింగ్ ప్రొఫైల్స్ కి ఫేక్ డేటా ను ఉపయోగించాలని తమ ఉద్యోగులను పేస్ బుక్ కోరింది.

లాంచ్ చేసే ముందు.....
అయితే పబ్లిక్ గా లాంచ్ చేసే ముందు ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలని పేస్ బుక్ ప్లాన్ చేసింది. anti-harresement పాలసీ కూడా డేటింగ్ ప్రాడక్ట్ కు వర్తిస్తుందని తమ ఉద్యోగులకు హెచ్చరించింది .

యూజర్లు సెపెరేట్ ప్రొఫైల్ ను.....
డేటింగ్ కోసం యూజర్లు సెపెరేట్ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకునేందుకు పేస్ బుక్ డేటింగ్ యాప్ అనుమతినిస్తుంది . యూజర్ల సేఫ్టీ, ప్రైవసీ నీ దృష్టిలో పెట్టుకొని డేటింగ్ యాప్ ను రూపొందిస్తున్నట్టు పేస్ బుక్ తెలిపింది . లాంగ్ టర్మ్ రిలేషన్స్ ను నిర్మించే విధంగా ఈ యాప్ ఉండబోతున్నట్లు పేస్ బుక్ CEO తెలిపారు .

పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ పై నో ప్లాన్స్ ....
ప్రీమియం డేటింగ్ సబ్స్క్రిప్షన్ కొరకు డబ్బులు చెల్లించే ప్లాన్స్ లేవు అని పేస్ బుక్ తెలుపుతుంది. ఒక వేళా ఉంటె మాత్రం యాడ్స్ చూసే అవకాశం ఉంటుంది .

త్వరలో యూజర్లకు అందుబాటులోకి.....
త్వరలోనే పేస్ బుక్ డేటింగ్ యాప్ యూజర్లకు అందుబాటులోకి రాబోతున్నట్టు పేస్ బుక్ తెలిపింది .


Click it and Unblock the Notifications








