ఫేస్‌బుక్ లో ఈ రెండు కొత్త ఫీచర్లు అదుర్స్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రతీసారి సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రతీసారి సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది. కొత్త కొత్తగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ మరింతగ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు శర వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అభిమానుల కోసం Boomerang, Selfie Portrait Shot ఫీచర్లను యాడ్ చేసింది.

Selfie Portrait Shot...
ఈ కొత్త ఫీచర్ ఆటోమేటిక్ గా బ్యాక్ గ్రౌండ్ ను బ్లర్ చేస్తుంది.అలాగే ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లు ఇప్పుడు స్టిక్కర్లు (AR) వారి వీడియోలకు మరియు ఫోటోలకు కూడా జోడించవచ్చు.

Boomerang ఫీచర్...
Boomerang ఫీచర్ ఇప్పటికే Instagram లో అందుబాటులో ఉంది . ఈ ఫీచర్ ద్వారా రికార్డు చేయబడిన వీడియో GIF గా మారుతుంది. ఈ కొత్త ఫీచర్ తో ఫేస్‌బుక్ మెసెంజర్ లో అయిదు వేర్వేరు కెమెరా మోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ ఈ ఫీచర్ ను ప్రపంచ వినియోగదారుల కోసం విడుదల చేసింది.

ఫేస్‌బుక్ మెసెంజర్ ను....
అంచనా ప్రకారం, ఫేస్‌బుక్ మెసెంజర్ ను ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు . ఈ సంఖ్యను అలాగే ఆదాయం పెంచుకోవడానికి,ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ 2017 లో ప్రకటనలను చూపించడం ప్రారంభించింది. మెసెంజర్ యాప్ ద్వారా సంస్థ యొక్క లాభాలలో గణనీయంగా పెరిగిందని ఫేస్‌బుక్ అంగీకరించింది.

Instagram మరియు Whatsapp వినియోగదారులకు....
ఇటీవల ఫేస్‌బుక్ Instagram మరియు Whatsapp వినియోగదారులకు అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది. అందువల్ల Facebook Messenger లో కొత్త ఫీచర్లను అందించడంలో కొద్దిగా వెనుక ఉంది. ఫేస్‌బుక్ అందిస్తున్న ఈ కొత్త ఫీచర్స్ వళ్ల మెసెంజర్ కు మరింత యూజర్లు పెరిగి ఈ యాప్ ను ఒక ప్రైమరీ మెసేజింగ్ యాప్ లానే ఉపయోగించగలరు అని సంస్థ భావిస్తుంది .


Click it and Unblock the Notifications








