ఫేస్‌బుక్‌లో గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు

ఫేస్‌బుక్ ఎట్టకేలకు తన డెస్క్‌టాప్ యూజర్ల కోసం గ్రూప్ వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసకువచ్చింది. దీంతో యూజర్లు గ్రూప్ మెసేజింగ్‌తో పాటు గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. స్కైప్, గూగుల్ డ్యుయో యాప్‌లకు పోటీగా నిలిచే క్రమంలో ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అప్‌డేట్ చేసినట్లు తెలస్తోంది.

ఫేస్‌బుక్‌లో గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు

Read More : 200 సంవత్సరాలు ప్రయత్నించినా తెలుసుకోలేని పాస్‌వర్డ్!

ఫేస్‌బుక్ తాజాగా తన మెసెంజర్ కెమెరాకు 3డీ ఎఫెక్ట్స్‌ను అద్దిన విషయం తెలసిందే. దీంతో పాటు వివిధ వెరైటీలలో స్టిక్కర్స్ ఇంకా ఆర్టిస్టిక్ ఫిల్టర్ లను ఫేస్ బుక్ పరిచయం చేసింది. ఇంతే కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫేస్‌బుక్ యాప్‌లో హైడెఫినిషన్ క్వాలిటీ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. పిక్షర్ ఇన్ పిక్షర్ వీడియాలను కూడా ఆండ్రాయిడ్ ఫేస్‌బుక్ యూజర్లు క్యాప్చుర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఫేస్‌బుక్ వీడియోలను సైతం ఆఫ్‌లైన్‌లో వీక్సించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ మధ్య కాలంలో..

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌ తన ఆండ్రాయిడ్ వర్షన్ యాప్‌ను కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. సీక్రెట్ కన్వర్జేషన్స్, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్, ఫేక్ న్యూస్ రిమూవ్, అట్రాక్టివ్ emojis వంటి సరికొత్త హంగులు ఇటీవల ఫేస్‌బుక్‌ యాప్‌లో జతయ్యాయి. డిసెంబర్ అప్‌డేట్‌లో భాగంగా ఫేస్‌బుక్, ప్రధానంగా ఆండ్రాయిడ్ యూజర్ల పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన అప్‌డేట్స్‌లో భాగంగా యాపిల్ ఐఓఎస్ యూజర్స్ తరహాలోనే ఆండ్రాయిడ్ యూజర్లు కూడా హైడెఫినిషన్ వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసుకోగలుగుతారు. అయితే, ఈ వీడియోలను అప్‌లోడ్ చేసుకునే క్రమంలో ఇంటర్నెట్ కనెక్షన్ బలంగా ఉండాలని ఫేస్‌బుక్ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్‌డి క్వాలిటీ వీడియో కంటెంట్‌..

మీ ఫోన్ హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే..?

నిన్న మొన్నటి వరకు ఆండ్రాయిడ్ యూజర్లు ఫేస్‌బుక్‌లో కేవలం హైడెఫినిషన్ క్వాలిటీ ఫోటోలను మాత్రమే అప్‌లోడ్ చేసుకోగలిగే వారు, తాజా అప్‌డేట్‌తో హెచ్‌డి క్వాలిటీ వీడియో కంటెంట్‌ను కూడా అప్‌లోడ్ చేయగలుగుతారు. వీటితో పాటు అనేక ఫీచర్లను ఫేస్‌బుక్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. వీడియో సెక్షన్‌లో పలు మార్పు చేర్పులు చేయటంతో పాటు నోటిఫికేషన్‌లను సులువుగా బ్రౌజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

గూగుల్ బాటలోనే..

తాజాగా.. గూగుల్ బాటలోనే వాట్సాప్, హైక్ మెసెంజర్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ కూడా వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేసాయి. ఫీచర్ల పరంగా చూస్తే వాట్సాప్ ఇంకా హైక్ మెసెంజర్‌లతో పోలిస్తే గూగుల్ డ్యుయో వెనకంజలో ఉందనే చెప్పాలి. వాట్సాప్, హైక్ మెసెంజర్‌లు వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో గూగుల్ డ్యుయోకు మార్కెట్లో క్రేజ్ తగ్గింది.

సింగిల్ క్లిక్‌తో పొందవచ్చు

మోటో జీ4 ప్లస్ ఇప్పుడు రూ.12,499కే

వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లలో ఏర్పాటు చేసిన వీడియో కాలింగ్ సదుపాయాన్ని యూజర్లు సింగిల్ క్లిక్‌తో పొందవచ్చు. ఇదే సమయంలో గూగుల్ డ్యుయో యాప్‌ను హ్యాండిల్ చేయటం అంత సులభంగా అనిపించదు.

వీడియో కాలింగ్‌కు మాత్రమే..

గూగుల్ డ్యుయో యాప్ కేవలం వీడియో కాలింగ్‌కు మాత్రమే ఉపకరిస్తుంది. ఇదే సమయంలో వాట్సాప్, హైక్ యూజర్లు వీడియో కాల్స్‌తో పాటు వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెసెజ్‌లు పంపుకోవచ్చు, ఫోటోలను కూడా ఎడిల్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సదుపాయాలు ఈ రెండు యాప్‌లలో కొలువుతీరి ఉండటం విశేషం.

వాటిలో వేగవంతంగా కనెక్ట్ అయ్యే అవకాశం..

నోకియా నుంచి మరో సంచలన ఫోన్..?

గూగుల్ డ్యుయో యాప్‌తో పోలిస్తే వాట్సాప్, హైక్ మెసెంజర్ ద్వారా వీడియో కాల్స్‌ను వేగవంతంగా కనెక్ట్ అవుతాయి. గూగుల్ డ్యుయో యాప్ లో వీడియో కాల్ ద్వారా ఫ్రెండ్ కు కనెక్ట్ అయ్యేందుకు చాలా సేపు వెయిట్ చేయవల్సి ఉంటుంది.

 

 

2జీ నెట్‌వర్క్‌లో ఉన్నప్పటికి...

కాల్ డ్రాప్ సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్

గూగుల్ డ్యుయోతో పోలిస్తే వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల యూజర్లను కలిగి ఉన్నాయి. మీరు 2జీ నెట్‌వర్క్‌లో ఉన్నప్పటికి వాట్సాప్, హైక్ మెసెంజర్ ద్వారా వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో గూగుల్ డ్యుయో ద్వారా వీడియో కాల్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా 3జీ లేదా 4జీ కనెక్షన్ ఉండి తీరాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Introduces Group Voice Calling, Might Give a Tough Competition to Skype and Google Duo. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot