ఫేస్‌బుక్ నుంచి కొత్త యాప్ !

Posted By: Madhavi Lagishetty

సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్తో యూజర్ల ముందుకు రాబోతోంది. జూన్ లో ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక యాప్ పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఆ సయమంలో యాప్ కేవలం ప్రముఖులను ఆన్ లైన్ ప్రభావితదారులు మరియు జర్నలిస్టులతో సహా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది.

ఫేస్‌బుక్ నుంచి కొత్త యాప్ !

దాదాపు ఆరు నెలల తర్వాత, సోషల్ నెట్ వర్క్ దిగ్గజం చివరకు క్రియేటర్ యాప్ పరిచయం చేసింది. ఫేస్‌బుక్ క్రియేటర్ యాప్ ఏ రకమైన వీడియో క్రియేటర్లకు అయినా వన్ స్టాప్ వంటింది. ఈ యాప్ తో క్రియేటర్లు ఈజీగా ఒరిజినల్ వీడియోలను రూపొందించవచ్చు. ప్రత్యేక ఫీచర్లతో లైవ్లో టెలికాస్ట్ చేయవచ్చు. అంతేకావు వారి ఫ్రెండ్స్ కు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. బ్రాండ్ కంటెంట్ వంటి ప్రొడక్టులతో కూడా మోనటైజ్ చేయవచ్చు. ఈ బ్రాండ్ న్యూ యాప్ యొక్క ఫీచర్లను అనుసరిస్తున్నారు.

లైవ్ క్రియేటివ్ కిట్....

ఈ ఫీచర్తో యూజర్లు పర్సనలైజ్డ్ మరియు ఫన్ ఫీల్త్ కూడిన లైవ్ బ్రాడ్ కాస్టింగ్స్ క్రియేట్ చేసే ప్రత్యేకమైన టూల్స్ తో యాక్సిస్ చేయవచ్చు. క్రియేటర్స్ పరిచయాలను వారి ప్రత్యక్ష ప్రసారాలకు ఓపెనర్లుగా, వాటిని ముగించేటప్పుడు ప్రేక్షకులకు ఇంటరాక్ట్ చేయడానికి ఉపయోగించే కస్టమ్, ప్రత్యక్ష స్టిక్కర్లు, గ్రాఫిక్ ప్రేమ్లను స్థిరమైన బ్రాండ్ను క్రియేట్ చేయడానికి వీలు కలిగించవచ్చు.

కమ్యూనిటీ ట్యాబ్....

కమ్యూనిటీ ట్యాబ్ అభిమానులతో మరియు సహకారులతో ఏకీక్రుత ఇన్ బాక్స్ కనెక్ట్ చేయడానికి వీడియో క్రియేటర్లకు సహాయపడుతుంది. ఇది ఫేస్‌బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ మరియు మెసేంజర్ నుంచి వచ్చిన మెసేజ్ లను కేంద్రీకరిస్తుంది.

కెమెరా మరియు స్టోరీస్....

క్రియేటర్స్ ఫన్ కెమెరాలు మరియు ఎఫెక్ట్ ఫ్రేమ్లను మరియు ఇతర ఫ్లాట్ ఫాంలను సులువుగా క్రాస్ పోస్టు కంటెంట్ను ఉపయోగించవచ్చు. క్రియేటర్స్ ఫేస్‌బుక్ స్టోరీస్ వారి అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇన్ సైట్స్....

• ఫేస్‌బుక్ అనాలిటిక్స్ వంటివి, మీ పేజీ వీడియోలు మరియు అభిమానుల గురించే విశ్లేషణలతో సహా, కంటెంట్ క్రియేట్ కి సమాచారం అందించడానికి మెట్రిక్లను ఈజీగా యాక్సెస్ చేస్తుంది.

ప్రస్తుతం ఫేస్‌బుక్ క్రియేటర్ యాప్ ఐఓఎస్ ఫ్లాట్ ఫాంకు మాత్రమే రూపొందిస్తుంది. కానీ వచ్చే నెలలో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. యాప్ పేజీలు లేదా ప్రొఫైల్లో వ్యక్తులు ఒపెన్ ఉంటుంది. మీరు ఈయాప్ ను ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రూ. 10 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు (3జిబి ర్యామ్)

ఇదికాకుండా ఫేస్‌బుక్ క్రియేటర్లకు కొత్త వెబ్ సైట్స్ ను కూడా ప్రారంభించింది. క్రియేటర్స్ కోసం ఫేస్‌బుక్ క్రియేటర్స్ గ్రేట్ వీడియోలను క్రియేట్ చేయడం...వాటిని అభిమానులతో కనెక్ట్ చేయడం మరియు ఫేస్‌బుక్లో ఎలా డెవలప్ చెందుతాయో దానిపై చిట్కాలు కనుగొనేందుకు ఉపయోగపడుతుంది.

మంచి వీడియోలను క్రియేట్ చేయడానికి మరియు సాధారణ క్రియేటర్ –స్పెసిఫిక్ ప్రశ్నలకు సమాధానాలకు కనుగొనడానికి కొత్త నైపుణ్యాలను మరియు సాంకేతికతను తెలుసుకోవడానికి వెబ్ సైట్ క్రియేటర్లకు ఉపయోగపడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే... ఫేస్ బుక్ క్రియేటర్ కమ్యూనిటీలో చేరవచ్చు.

English summary
Currently, Facebook Video Creator app is only available for iOS users.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot