వీడియోల కోసం ఫేస్‌బుక్ కొత్త యాప్ వస్తోంది
యూట్యూబ్‌కు పోటీగా రాబోతోన్న ఈ వీడియో క్రియేషన్ యాప్..
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, వీడియోల కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యూట్యూబ్‌కు పోటీగా రాబోతోన్న ఈ వీడియో క్రియేషన్ యాప్ వెరిఫైడ్ అకౌంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.

గతంలో అందుబాటులోకి వచ్చిన Facebook Mentions మాదిరిగా ఈ వీడియో క్రియేషన్ యాప్ తొలత వెరిఫైడ్ అకౌంట్లను కలిగి ఉన్న సెలబ్రెటీలు, జర్నలిస్టులు ఇతరు ప్రముఖ అకౌంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.

శుక్రవారం యూరోప్‌లో జరిగిన VidCon ఆన్‌లైన్ వీడియో కాన్ఫిరెన్స్‌లో భాగంగా ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజర్ డేనియల్ డాన్కర్ ఈ కొత్త యాప్‌కు సంబంధించిన వివరాలను రివీల్ చేసారు. ఈ వీడియో యాప్‌లో ఫేస్‌బుక్ లైవ్ సదుపాయంతో పాటు వీడియోకు ముందూ, చివరా యాడ్ చేసుకునేందుకు ఇంట్రో, అవుట్రో వీడియోలు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు స్టిక్కర్స్ ఇంకా వీడియో ఫ్రేమ్స్ అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications